యూట్యూబర్ హర్షసాయిపై రేప్ కేసు నమోదైంది. తనపై అత్యాచారం చేశాడని, నగ్నచిత్రాలు సేకరించి బ్లాక్‌మెయిల్ చేశాడని సినీ నటి ఇచ్చిన ఫిర్యాదు మేరకు నార్సింగి పోలీసులు కేసు నమోదు చేసినట్లు రాజేంద్రనగర్ డీసీపీ చింతమనేని శ్రీనివాస్ తెలిపారు.
లైంగిక వేధింపులు, భౌతిక దాడి, చీటింగ్, దోపిడితోపాటు బ్లాక్ మెయిల్ చేశాడని హర్ష సాయిపై పెట్టిన కంప్లెయింట్ లో పేర్కొంది. ఆమెను హర్ష సాయి లైంగికంగా వేధించాడని, డబ్బులు కూడా తీసుకున్నాడని, పెళ్లి చేసుకుంటా అని మోసం చేశాడని మహిళ ఎఫ్ఐఆర్ లో తెలిపింది.
హర్ష సాయిపై 328, 376 (2) (n), 354 (B)(C) IPC సెక్షన్ల కింద పోలీసులు కేసు నమోదు చేశారు. హర్షసాయితోపాటు అతని తండ్రిపై కూడా యువతి ఫిర్యాదు ఇచ్చింది. వారిపై కేసు నమోదు చేసి నార్సింగి పోలీస్ స్టేషన్, సైబరాబాద్ పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు. పోలీసులు యువతికి వైద్య పరీక్షల కోసం కొండాపూర్ గవర్నమెంట్ హాస్పిటల్ తీసుకెళ్లారు.
సినిమాల్లో అవకాశాల కోసం ముంబయికి చెందిన యువతి కొన్నేళ్ల క్రితం హైదరాబాద్ వచ్చింది. ఒక రియాల్టీ షోలో పాల్గొంది. ఒక ప్రైవేటు పార్టీలో కలిసి స్నేహంగా ఉంటూ పెళ్లి చేసుకుంటానని చెప్పి అత్యాచారం చేసినట్లు, పెద్ద మొత్తంలో డబ్బు తీసుకున్నట్లు యువతి ఫిర్యాదు చేసినట్లు తెలుస్తోంది. హర్షసాయి తండ్రిపైనా ఫిర్యాదు చేసినట్లు సమాచారం. విశాఖకు చెందిన హర్షసాయి పేదలకు ఆర్థిక సాయం చేస్తూ వీడియోలు తన ఛానెల్‌లో అప్‌లోడ్ చేస్తుంటాడు. ఇతను హీరోగా బాధిత యువతి హీరోయిన్‌గా గతంలో ఒక సినిమాను ప్రారంభించారు.
సోషల్ మీడియా హ్యాండిల్ యూట్యూబ్‌లో దాదాపు 14 మిలయన్ ఫాలవోర్స్ ఉన్న హర్ష సాయి.. బెట్టింట యాప్స్‌ను ప్రమోట్ చేసి రెండు చేతులా సంపాదిస్తున్నాడనే ఆరోపణలు. ఆ కామెంట్‌కు తోడు.. మరో సోషల్ మీడియా ఇన్‌ఫ్లూయెన్సర్ యువ సామ్రాట్ హర్ష సాయి పై సంచలన ఆరోపణలు చేశాడు.
ఇక ఇప్పుడు ఓ యువతి హర్ష సాయి పై కేసు నమోదు చేసింది. పెళ్లి పేరుతో రూ. 2 కోట్ల వరకు వసూలు చేశాడని ఆమె ఆరోపించింది. ఇప్పటికే ఆమె పోలీస్ స్టేషన్ లోనే ఉన్నట్టు తెలుస్తోంది. హర్ష సాయితో పాటు అతని తండ్రి రాధాకృష్ణ పై కూడా బాధితురాలు ఫిర్యాదు చేసిందని తెలుస్తోంది.
హర్ష సాయి హీరోగా మధ్య ఓ సినిమా కూడా మొదలైంది. అతనే సొంతంగా ఓ కథ రాసుకుని.. స్వీయ దర్శకత్వంలో హీరోగా నటించిన చిత్రం మెగా. అప్పట్లో టీజర్ ను కూడా విడుదల చేశారు. ఆ సినిమాకు నిర్మాత ఎవరో కాదు. బిగ్ బాస్ ఫెమ్ మిత్ర శర్మ. బిగ్ బాస్ ఓటీటీలో పాల్గొన్న మిత్ర శర్మ నిర్మాతగా మారి హర్ష సాయితో సినిమా అనౌన్స్ చేసింది.
హర్ష సాయికి తెలుగు మాత్రమే కాదు ఇతర భాషల్లో కూడా యూట్యూబ్ ఛానల్స్ ఉన్నాయి.. ఇక ఈ యంగ్ స్టార్ యూట్యూబ్ ఛానళ్లకు మిలియన్ల కొద్దీ సబ్‌స్క్రైబర్లు కూడా ఉన్నారు. దాంతో ఆన ఇమేజ్ ఓ రేంజ్ లో పెరుగుతూ వస్తోంది.
యూట్యూబ్‌లో హార్ష సాయికి 80 లక్షల 64 వేల మంది( 8.64 మిలియన్ల) ఫాలోవర్స్ ఉండగా..... ఇన్‌స్టాగ్రామ్‌లో 40 లక్షలకు (4మిలియన్ల) ఫాలోవర్స్.. ఉన్నారు. ఇక ఫేస్ బుక్ తో పాటు ఇతర సోషల్ మీడియా ఫ్లాట్ ఫామ్స్ లో చూస్తే.. దాదాపు కోటిమంది హర్షసాయిని ఫాలో అవుతున్నారు. ఈక్రమంలో.. అయితే హర్షసాయి తను చేస్తున్న సామాజిక కార్యక్రమాలతో రాజకీయాల్లోకి వస్తాడని జనసేనలో చేరి ఎమ్మెల్యేగా పోటీ చేస్తారంటూ గతంలో రూమర్స్ గట్టిగా వినిపించాయి.కాని కొంత కాలానికి అవి ఆగిపోయాయి.
వందలు వేలల్లోనే కాకుండా.. లక్షల రూపాయలను మంచి పనుల కోసం మంచి నీళ్లలా పంచేస్తున్నాడు హర్ష సాయి.ఈ మంచి తనమే అందరికిలో స్పెషల్ గా నిలించింది. అంత కాదు.. ఇలాంటి పనులు చేయడంవల్లనే హర్ష సాయికి ప్రత్యేకంగా ప్యాన్స్ కూడా తయరయ్యారు. ఆయనకంటూ స్పెషల్ ఫ్యాన్ బేస్ తో పాటు.. అభిమాన సంఘాటు కూడా తయారయ్యాయి. ఇప్పుడీ సంఘటనతో వారంతా ఎలా స్పందిస్తారో చూడాలి మరి.