చెన్నైలో ఫ్యామిలీ కోర్టులో జయం రవి, ఆర్తి విడాకుల కేసు విచారణకి వచ్చింది. జయం రవి కోర్టుకి నేరుగా హాజరయ్యారు. ఆర్తి మాత్రం వీడియో కాల్ లో అందుబాటులోకి వచ్చింది. ఇరు వర్గాల వాదనలు విన్న తర్వాత కోర్టు కీలక వ్యాఖ్యలు చేసింది. జయం రవి, ఆర్తి దంపతులు కలసి కూర్చుని మాట్లాడుకోవాలని.. రాజీకి ప్రయత్నించాలని సూచించింది. మరి కోర్టు సూచనల్ని జయం రవి, ఆర్తి పాటిస్తారో లేదో చూడాలి.