కలర్‌ తక్కువ అంటూ శోభన్‌బాబుని అవమానించిన జయలలిత తల్లి, ప్రతీకారంగా సోగ్గాడు ఏం చేశాడో తెలుసా?

First Published | Nov 10, 2024, 9:21 AM IST

శోభన్‌బాబు తెలుగు అభిమానులకు సోగ్గాడిని నిలిచిపోయిన విషయం తెలిసిందే. కానీ ఆయన ఆ స్థాయికి రావడానికి, ఎదగడం వెనుక చాలా దారుణమైన అవమానాలున్నాయట. 
 

తెలుగు తెర సోగ్గాడు శోభన్‌బాబు. ఎన్ని తరాలు మారినా, ఎంత మంది హీరోలు వచ్చినా ఆయన ఎప్పటికీ `సోగ్గాడే`, ఎవర్‌ గ్రీన్‌ సోగ్గాడు. ఆ విషయం చెప్పడంలో ఏమాత్రం అతిశయోక్తి లేదు. అప్పట్లో అమ్మాయిలు కోరుకున్నట్టుగా ఉన్న రూపం శోభన్‌బాబుది, దీనికితోడు `సోగ్గాడు` సినిమాతో పెద్ద హిట్‌ అందుకున్నాడు. ఇందులో ఆడవారు మెప్పించే కథ ఉండటం మరో విశేషం. అలా అప్పటి అమ్మాయిల గ్రీకువీరుడు శోభన్‌బాబు. 

బిగ్‌ బాస్‌ తెలుగు 8 అప్‌ డేట్స్ కోసం ఇక్కడ క్లిక్‌ చేయండి.
 

నట శేఖరుడిగా పేరుతెచ్చుకున్న శోభన్‌బాబు.. పేద, మధ్య తరగతి ఫ్యామిలీ నుంచి వచ్చాడు. నాటకాల ద్వారా నటనపై ఆసక్తి పెంచుకుని, సినిమాల్లోకి వచ్చాడు. వరుసగా చిన్న చిన్న పాత్రలు చేస్తూ తనని తాను ఆవిష్కరించుకున్నాడు. ఒక్కో మెట్టు ఎక్కుతూ, ఎదుగుతూ వచ్చారు. ఎన్టీఆర్‌, ఏఎన్నార్‌ వంటి హీరోల సినిమాల్లో క్యారెక్టర్లు చేస్తూ మెప్పించాడు, ఇండస్ట్రీ దృష్టిని ఆకర్షించాడు. నెమ్మదిగా హీరోగా ఎదిగాడు. తిరుగులేని స్టార్‌గా నిలబడ్డాడు. తెలుగు ఆడియెన్స్ కి `సోగ్గాడు` అయ్యాడు శోభన్‌బాబు. 


అయితే ప్రారంభంలో శోభన్‌బాబు చాలా అవమానాలు ఫేస్‌ చేశాడట. అది కూడా తనని ఎంతో ఇష్టపడ్డ, ఆరాధించబడిని జయలలిత తల్లినే అవమానించిందట. అవమానం అంటే అది మామూలు అవమానం కాదు, చాలా దారుణమైన అవమానం. కలర్‌ గురించిన అవమానం కావడం గమనార్హం. సూపర్‌ స్టార్‌ కృష్ణ హీరోగా నటించిన మొదటి డిటెక్టివ్‌ ఫిల్మ్ `గూఢచారి 116`లో అసలు హీరోగా చేయాల్సింది శోభన్‌బాబునే.

ఆయన్నే హీరోగా అనుకున్నారు. హీరోయిన్‌గా జయలలితని తీసుకున్నారు. జయలలిత అప్పుడప్పుడే సినిమాల్లోకి వస్తుంది. కొన్ని సినిమాలు చేసింది కానీ పెద్ద గుర్తింపు లేదు. ఆమె తల్లి సంధ్య అప్పటికే పెద్ద నటి. బాగా రిచ్‌ పార్టీ కూడా. దీంతో ఆ యాటిట్యూడ్‌ ఆమెలో గట్టిగానే ఉంది. 
 

`గూఢచారి 116` సినిమా సెట్‌కి జయలలితతోపాటు ఆమె తల్లి కూడా వచ్చింది. హీరో ఎవరో అని అడగ్గా, అప్పుడే ఏదో పని చేసి వచ్చిన శోభన్‌బాబుని చూపించారు నిర్మాత దూండి. ఆ సమయంలో శోభన్‌బాబు జిడ్డు మొహంతో ఉన్నాడట, ఎండకి కాస్త కలర్‌ తక్కువగా కనిపించాడట. అలా సోగ్గాడిని చూసిన జయలలిత తల్లి నా కూతురు కలర్‌ ఏంటి? ఆయన కలర్‌ ఏంటి? ఆయన సరసన నా కూతురు హీరోయిన్‌గా చేయడమేంటి? అని దారుణంగా మాట్లాడిందట.

అంతేకాదు హీరోని మారిస్తేనే మా అమ్మాయి చేస్తుందని, లేదంటే వేరే హీరోయిన్‌ని చూసుకోండి అని తెగేసి చెప్పిందట. అది కూడా శోభన్‌బాబు ముందే. దీంతో హీరోగా మారుతున్నాననే ఎన్నో ఆశలతో ఉన్న శోభన్‌బాబుకి ఒక్కసారిగా నీరుగారిపోయిన పరిస్థితి. పూర్తి డిజప్పాయింట్‌ అయిపోయారు.

దర్శక నిర్మాతలు కూడా శోభన్‌బాబుని తీసేయాల్సి వచ్చింది. అయితే హీరోగా ఆయన్ని తప్పించి కృష్ణని తీసుకున్నారు. అందులో మరో గెస్ట్ రోల్‌ లాంటి, కీలకమైన పాత్ర ఏజెంట్‌ 303 లో శోభన్‌బాబుని నటింపచేశారు. పాత్ర కనిపించేది ఐదు నిమిషాలే అయినా చాలా పవర్‌ఫుల్‌గా ఉంటుంది.

దీంతో సినిమా విడుదలయ్యాక కృష్ణతో సమానమైన పేరు శోభన్‌బాబుకి రావడం విశేషం. అయితే జయలలిత తల్లి సంధ్య మాట్లాడిన మాటలు, ఆ అవమానం తన మనసులోనే ఉంది శోభన్‌బాబుకి. ఓ మూలన అది కొడుతూనే ఉంది. ఆయన చాలా బాధపడిపోయాడు. ఆ తర్వాత హీరోగా మారి పెద్ద హిట్లు అందుకున్నాడు. 

దీంతో తనకు ఎవరు అవకాశాలిస్తారనే స్థాయి నుంచి తాను డేట్స్ ఇచ్చే స్థాయికి ఎదిగారు. ఈ క్రమంలో తమ్మారెడ్డి భరద్వాజ ఓ సినిమాని నిర్మించేందుకు ముందుకు వచ్చారు. శోభన్‌బాబు హీరో. అందులో హీరోయిన్‌ సెట్ కాలేదు. దీంతో జయలలిత అనే కొత్త అమ్మాయి వచ్చింది బాగా చేసిందని టీమ్‌కి సజెస్ట్ చేశాడట శోభన్‌బాబు.

దీంతో ఆమెకి కబురు చేయగా, జయలలితకి కూడా శోభన్‌బాబుపై సాఫ్ట్ కార్నర్‌ ఉందట. అన్యాయంగా ఆయన్ని తీసేశామనే సింపతి ఉందట. దీంతో మరో మాట లేకుండా ఓకే చెప్పిందట. అంతేకాదు ఈ మూవీ సెట్‌లోనే ఇద్దరు క్లోజ్‌ అయ్యారట. శోభన్‌బాబు బాగా జోకులు వేస్తారట, దీంతో ఆమె ఇంప్రెస్ అయ్యిందట.

అంతేకాదు జయలలిత ఓ బాయ్‌ ఫ్రెండ్‌తో మాట్లాడటం కూడా అదే ఫస్ట్ టైమ్ అట. అలా ఈ ఇద్దరు క్లోజ్‌ అయ్యారు. సోగ్గాడి సిస్టామాటిక్‌ లైఫ్‌, మాటలు, కేరింగ్‌ నచ్చి ఆయన్ని ఇష్టపడిందట జయలలిత. అయితే అప్పటికే శోభన్‌బాబుకి పెళై పిల్లలు ఉన్నారు. దీంతో సహజీవనం వరకే పరిమితమయ్యారని తెలిపారు సీనియర్‌ జర్నలిస్ట్ ఇమ్మంది రామారావు. సుమన్‌ టీవీకి ఇచ్చిన ఇంటర్వూలో ఈ విషయం చెప్పారు. ఇలా శోభన్‌బాబు మరో రూపంలో రివేంజ్‌ తీసుకున్నాడని చెప్పొచ్చు. తనని దూరం పెట్టినవాళ్లే తన వెంటపడేలా చేసుకోవడం విశేషం. 

read more:నక్కలు, పిచ్చికుక్కలు ఓట్‌ చేస్తే టేస్టీ తేజని పనిష్‌ చేస్తారా? నాగార్జున, బిగ్‌ బాస్‌పై ట్రోల్స్

also read: `గేమ్‌ ఛేంజర్` టీజర్‌, విజువల్స్ కేక.. కానీ ఆ మ్యాటర్‌ విషయంలోనే అన్‌ ప్రెడిక్టబుల్‌ !

Latest Videos

click me!