సోషల్ మీడియాపై ఆయన స్పందిస్తూ, సామాజిక మాధ్యమాల్లో ఇప్పుడు అనేక విషయాలను సృష్టిస్తున్నారని, ఎప్పుడూ లేని పరిస్థితులు సృష్టిస్తున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. అలాంటి దృశ్యాలు ఎప్పుడు జరగలేదని చెప్పారు. తహిల్ చివరగా `హిట్‌ః ది ఫస్ట్ కేస్`లో నటించారు. కొన్ని దశాబ్దాలుగా నటుడిగా రాణిస్తున్న తహిల్ వందకుపైగా చిత్రాల్లో అనేక విలక్షణమైన పాత్రలు పోషించారు. వాటిలో `బాజీగర్`, `ఖయామత్ సే ఖయామత్ తక్`, `కహో నా ప్యార్ మై`, `రాక్ ఆన్`, `రా వన్`, `భాగ్ మిల్కా భాగ్` చిత్రాలు ప్రధానంగా ఉన్నాయి.