జైలు నుంచి బయటకు వచ్చాక అల్లు అర్జున్‌ని కలిశారా? జానీ మాస్టర్‌ రియాక్షన్‌ ఇదే

First Published | Dec 25, 2024, 4:41 PM IST

సంధ్య థియేటర్‌ తొక్కిసలాట ఘటనలో గాయపడ్డ శ్రీతేజని జానీ మాస్టర్‌ పరామర్శించారు. ఈ క్రమంలో అల్లు అర్జున్‌ని కలవడంపై ఆయన రియాక్ట్ అయ్యారు. 
 

జానీ మాస్టర్‌ వేధింపుల ఆరోపణల కేసులో జైలుకి వెళ్లిన విషయం తెలిసిందే. కొంత కాలం రిమాండ్‌లో ఉన్న ఆయన ఇటీవలే విడుదలయ్యారు. తాజాగా ఆయన కిమ్స్ లో చికిత్స పొందుతున్న శ్రీతేజని పరామర్శించారు. శ్రీతేజ కోలుకుంటున్నాడని తెలిపారు. కదులుతున్నాడని, చూస్తున్నాడని, రియాక్ట్ అవుతున్నాడని, త్వరలోనే మామూలు మనిషి అవుతాడని తెలిపారు జానీ మాస్టర్. కిమ్స్ ఆసుపత్రి వద్ద ఆయన మీడియాతో ముచ్చటిస్తూ ఈ వ్యాఖ్యలు చేశారు.
 

 శ్రీతేజ ఫ్యామిలీకి తమ వంతు సహాయాన్ని అందిస్తామని తెలిపారు. కొరియోగ్రాఫర్స్ అసోసియేషన్‌ తరఫున సహాయం చేస్తామని  వెల్లడించారు జానీ మాస్టర్‌, తాము ఎప్పుడూ అండగా ఉంటామన్నారు. అందరికి వచ్చి పరామర్శించాలని ఉంటుంది, కానీ కొన్ని పరిధిలు ఉంటాయి, దాని కారణంగా రాలేకపోతారు. ఇప్పుడు అందరు వస్తున్నారు కాబట్టి చాలా హ్యాపీ అని చెప్పాడు. 


అల్లు అర్జున్‌ని కలవడంపై జానీ మాస్టర్‌ స్పందించారు. సంధ్య థియేటర్‌ తొక్కిసలాట ఘటనకి అల్లు అర్జున్‌ కారణమంటున్నారు. అలాగే మీ కేసు విషయంలో అల్లు అరవింద్‌ పేరు వినిపించింది. ఈ క్రమంలో మీరు ఆసుపత్రికి వచ్చి శ్రీతేజని పరామర్శించడం ట్రోల్‌ అయ్యే ఛాన్స్ ఉంది, వివాదంగా మారే అవకాశం ఉందనే ప్రశ్నకి జానీ మాస్టర్‌ స్పందించారు. తమ కేసు కోర్ట్ పరిధిలో ఉంది కాబట్టి తాను ఈ విషయంపై ఏమీ మాట్లాడలేనని తెలిపారు. తన సైడ్‌ నుంచి లీగల్‌గా సమస్య ఉందని, తాను ఇంత వరకే మాట్లాడగలను అని అన్నారు. 
 

అయితే అల్లు అర్జున్‌ జైల్లో ఒక్క రాత్రి ఉండి వచ్చిన తర్వాత ఇండస్ట్రీకి చెందిన చాలా మంది వెళ్లి ఆయన్ని కలిశారు. మీరు కలిశారా? అనే ప్రశ్నకి జానీ మాస్టర్‌ స్పందిస్తూ, తాను బయటకు వచ్చాక ఫ్యామిలీతోనే గడిపాను అని, బయటకు వెళ్లే అవకాశం రాలేదు అని తెలిపారు.

తనకు వచ్చిన సాంగ్స్ రిహార్సల్స్ చేసుకుంటూ, ఫ్యామిలీని చూసుకుంటూ ఉన్నాననని తెలిపారు. మొత్తానికి అల్లు అర్జున్‌  ని కలవలేదనే విషయాన్ని ఆయన చెప్పకనే చెప్పారు. 
 

Jani Master

తన వద్ద పనిచేసే లేడీ కొరియోగ్రాఫర్‌ ని వేధించాడనే ఆరోపణలు ఎదుర్కొన్నారు జానీ మాస్టర్‌.  తనని చాలా రోజులుగా లైంగికంగా వేధిస్తున్నారనే ఆరోపణలు చేసింది. ఇది కేసు అయ్యింది. ఈ కేసులో కొన్నాళ్లపాటు జైలుకి కూడా వెళ్లి వచ్చారు జానీ మాస్టర్‌.

అయితే ఇదంతా జానీ మాస్టర్‌ని ఇరికించే ప్రయత్నమనే రూమర్స్ వచ్చాయి. అల్లు అరవింద్‌, అల్లు అర్జున్‌ పేర్లు తెరపైకి వచ్చాయి. కానీ వాళ్లకి సంబంధం లేదనేది టీమ్ నుంచి వినిపించే మాట. ఈ నేపథ్యంలో ఇప్పుడు శ్రీతేజని జానీ మాస్టర్‌ పరామర్శించడం పెద్ద హాట్ టాపిక్‌ అవుతుంది.

 `పుష్ప 2` బెనిఫిట్‌ షోస్‌ సమయంలో సంధ్య థియేటర్ వద్ద తొక్కిసలాట జరిగిన విషయం తెలిసిందే. ఇందులో రేవతి అనే మహిళ మృతి చెందారు. ఆమె కొడుకు శ్రీతేజ గాయపడి ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నారు. ఇది పెద్ద వివాదంగా మారింది. స్టేట్‌ మొత్తాన్ని షేక్‌ చేస్తుంది.

ఇది రాజకీయరంగు పులుముకుంది. ఇది కూడా కేసు కావడంలో అల్లు అర్జున్‌ని అరెస్ట్ చేశారు. నాంపల్లి కోర్ట్ రిమాండ్‌ విధించగా, హైకోర్ట్ మధ్యంతర బెయిట్‌ విడుదల చేసింది. మంగళవారం ఈ కేసులోనే పోలీసుల విచారణకు బన్నీ హాజరైన విషయం  తెలిసిందే. 

read more: రేవంత్ రెడ్డి దగ్గరరే తేల్చుకుంటాం.. రంగంలోకి దిల్ రాజు

also read: తొక్కిసలాట ఘటనలో మరో ట్విస్ట్, అల్లు అర్జున్ సిబ్బందిలో ఒకరు అరెస్ట్!

Latest Videos

click me!