ఇక వీటిన్నిటికి చెక్ పెడుతూ.. తాజాగా శ్రీతేజ కు భారీ సాయాన్ని ప్రకటించారు అల్లు అర్జున్. అంతే కాదు ఈఆ సాయాన్నివెంటనే చెక్ రూపంలో రేవతి ఫ్యామిలికి అంద చేశారు. ఈక్రమంలో హాస్పిటల్ లో ట్రీట్మెంట్ తీసుకుంటున్న శ్రీతేజను పరామర్శించారు నిర్మాత దిల్ రాజు, అల్లు అరవింద్, పుష్ప ప్రొడ్యుసర్ ఎలమంచిలి రవి. అనంతరం బాలుడు శ్రీతేజ్ తండ్రికి ధైర్యం చెప్పిన నిర్మాతలు.. అతడి కుటుంబానికి రూ.2 కోట్లు పరిహారం అందజేశారు.
ఈ విషయాన్ని నిర్మాత అల్లు అరవింద్ తెలిపారు. అయితే ఈ 2 కోట్ల సాయంలో అల్లు అర్జున్ తరపున 1 కోటి రూపాయలతో పాటు పుష్ప 2 నిర్మాతలు 50 లక్షలు, పుష్ప2 దర్శకుడు సుకుమార్ .50 లక్షలు కలిపి ఇవ్వబోతున్నారు.టాలీవుడ్ స్టార్ ప్రొడ్యూసర్ ఎఫ్డీసీ ఛైర్మన్ దిల్ రాజు, పుష్ప 2 నిర్మాత రవిశంకర్ తో కలిసి అల్లు అరవింద్ కిమ్స్ ఆసుపత్రికి వెళ్లారు.