రాంచరణ్ నటించిన తాజా చిత్రం పెద్ది. ఈ చిత్రం నుంచి ఆ మధ్యన విడుదలైన చికిరి అనే సాంగ్ యూట్యూబ్ లో దూసుకుపోతోంది. ఈ సాంగ్ లో రాంచరణ్ డ్యాన్స్ మూమెంట్స్ పై జానీ మాస్టర్ ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు.
టాలీవుడ్‌లో పాటలు, డాన్స్ స్టెప్స్ ప్రేక్షకులను ఎంతగానో ఆకట్టుకుంటాయి. ముఖ్యంగా స్టార్ హీరోలు కొత్త స్టెప్స్ చేస్తే అవి ట్రెండ్ అవ్వడం సహజం. తాజాగా అలాంటి ట్రెండ్ సృష్టించిన పాటే చికిరి చికిరి. ఈ పాటలో చేసిన హుక్ స్టెప్ గురించి వచ్చిన తాజా సమాచారం అభిమానుల్లో మరింత ఆసక్తి కలిగిస్తోంది. ఈ పాటలో నటించిన రాంచరణ్ తనే ఈ స్టెప్ డిజైన్ చేయడం ఇప్పుడు హాట్ టాపిక్‌గా మారింది.
25
జానీ మాస్టర్ కొరియోగ్రఫీ
ఈ విషయాన్ని ప్రముఖ కొరియోగ్రాఫర్ జానీ మాస్టర్ ఒక డాన్స్ షోలో వెల్లడించారు. ఆయన చెప్పిన ప్రకారం, ఈ పాటలో వైరల్ అయిన ‘బ్యాట్ స్టెప్’ పూర్తిగా రామ్ చరణ్ ఆలోచనట. బ్యాట్ పట్టుకుని చేసే ఆ క్యూట్, ఫన్నీ మూవ్‌మెంట్స్ అన్నీ చరణ్ డిజైన్ చేసినవే అని తెలిపారు. కేవలం ఆలోచన చెప్పడమే కాకుండా, చరణ్ స్వయంగా ఆ స్టెప్ ప్రాక్టీస్ చేసి జానీ మాస్టర్‌కు చూపించారట. ప్రేక్షకులకు ఇది బాగా కనెక్ట్ అవుతుందని ఆయన అప్పుడే నమ్మకంగా చెప్పారని జానీ మాస్టర్ గుర్తు చేసుకున్నారు.
35
ఎమోషనల్ అయిన జానీ మాస్టర్
ఈ సంఘటనను గుర్తు చేసుకుంటూ జానీ మాస్టర్ భావోద్వేగానికి గురయ్యారు. చరణ్ తానే స్టెప్ క్రియేట్ చేసినప్పటికీ, ఎప్పుడూ క్రెడిట్ కొరియోగ్రాఫర్‌లకే ఇస్తారని చెప్పారు. స్టార్ హీరో అయినప్పటికీ, ఇలాంటి వినయం చూపించడం ఆయన గొప్ప మనసును చూపిస్తుందని తెలిపారు. ఈ విషయాలు అభిమానుల్లో చరణ్ పై మరింత గౌరవాన్ని పెంచుతున్నాయి.
ఈ పాట పెద్ది సినిమాకు సంబంధించినది. ఈ సినిమాను దర్శకుడు బుచ్చిబాబు సానా తెరకెక్కిస్తున్నారు. గ్రామీణ బ్యాక్‌డ్రాప్‌తో వస్తున్న ఈ సినిమా మీద ఇప్పటికే భారీ అంచనాలు ఉన్నాయి. పాట విడుదలైన వెంటనే సోషల్ మీడియాలో ట్రెండ్ అవ్వడం కూడా సినిమా హైప్‌ను పెంచింది.
55
ఏఆర్ రెహమాన్ మ్యూజిక్
ఈ పాటకు సంగీతం అందించింది ప్రపంచ ప్రఖ్యాత సంగీత దర్శకుడు ఏఆర్ రెహమాన్. ఆయన మ్యూజిక్‌కు డాన్స్ స్టెప్స్ కలవడంతో పాట మరింత ఆకర్షణీయంగా మారింది. ఈ సాంగ్ లో జాన్వీ కపూర్ డ్యాన్స్ గ్లామర్ కూడా ఆకర్షణీయంగా మారింది. ఆమె స్క్రీన్ ప్రెజెన్స్ కూడా పాటకు అదనపు అందాన్ని తీసుకొచ్చింది.