5 లక్షలు విలువ చేసే డ్రెస్ లో అదరగొట్టింది జూనియర్ అతిలోక సుందరి. వింటేజ్ అవతారంలో అద్భుతం చేసిన హీరోయిన్ ను చూసి.. సామాన్యుల దగ్గర నుంచి సెలబ్రిటీల వరకూ రకరకాల కామెంట్లు పెడుతున్నారు.
ఫ్యాషన్ ప్రపంచంలో ఎన్నో అద్భుతాలు చేయవచ్చు. ముఖ్యంగా హీరోయిన్లు ఎప్పటికప్పుడు ఫ్యాషన్ లో కొత్త ప్రయోగాలు చేస్తూనే ఉన్నారు. తాజాగా బాలీవుడ్ బ్యూటీ.. జూనియర్ అతిలోక సందరి జాన్వీ కపూర్ 5 లక్షల విలువైనర డ్రెస్ తో అద్భుతం చేసింది. జాన్వీ కపూర్ ఫ్యాషన్ ప్రపంచంలో ఎప్పుడూ కొత్త ట్రెండ్స్ సృష్టిస్తుంటుంది. తాజాగో మరోసారి ఆమె ఒక వింటేజ్ డ్రెస్ తో అందరినీ ఆశ్చర్యపరిచారు. పరిస్థితికి తగ్గట్టుగా ఫ్యాషన్ ను మర్చుతూ వస్తుంది జాన్వీ కపూర్.. 'సన్నీ సంస్కారీ కీ తులసి కుమారి' సినిమా ప్రమోషన్స్‌లో సంప్రదాయ దుస్తుల్లో కనిపించిన జాన్వీ, అంతే సులభంగా వింటేజ్, బోల్డ్ లుక్ లోకి మారిపోగలదు. రీసెంట్ గా జరిగిన ఇంటర్నేషనల్ ఈవెంట్ లో బ్రాండ్ వింటేజ్ డ్రెస్‌లో మెరిసింది జాన్వీ కపూర్.. ఈవెంట్ కు తగ్గట్టు రెడీ అవుతూ ఉంటుంది.
25
ప్రింటెడ్ మినీ డ్రెస్‌లో జాన్వీ కపూర్
ఇక తాజాగా పసుపు రంగు ప్రింటెడ్ మినీ డ్రెస్‌లో జాన్వీ కపూర్ అదరగొట్టింది. చాలా కాలం నాటి పాత ఫ్యాషన్ లుక్ లో కనిపించి ఫ్యాన్స్ కు కనువిందు చేసింది. జాన్వీ కపూర్ ధరించిన ఈ ప్రత్యేక డ్రెస్, రాబర్టో కవాలి 2003 స్ప్రింగ్ రెడీ-టు-వేర్ (RTW) కలెక్షన్‌లోని వింటేజ్ చైనోసరీ చియోంగ్‌సామ్ సిల్క్. ఎల్లె కలెర్ మినీ డ్రెస్ పై పక్షులు, పూల డిజైన్లను కలిగి ఉంది. క్యాప్ స్లీవ్స్, మాండరిన్ కాలర్, ముందు భాగంలో కట్ అవుట్ డిజైన్, ఫ్లేర్డ్ స్కర్ట్ దీని ప్రత్యేకతలు. జాన్వీ కపూర్‌కు స్టైలిస్ట్ సాన్యా కపూర్ ఈ డ్రెస్‌ను ఎంపిక చేశారు. తక్కువ మేకప్, పింక్ లిప్స్, సున్నితంగా లైన్ చేసిన కళ్ళు, మృదువైన బుగ్గలు, వదిలేసిన అలల జుట్టుతో జాన్వీ కపూర్ మరింత అందంగా కనిపించారు.
35
5 లక్షల డ్రెస్ లో అతిలోక సుందరి
జాన్వీ కపూర్ ధరించిన ఈ చారిత్రాత్మక వింటేజ్ డ్రెస్ ధర సుమారు 3.89 లక్షల రూపాయలు నుండి సుమారు 7.06 లక్షల రూపాయలు వరకు ఉండొచ్చని అంచనా. యూకేకి చెందిన ఒక వెబ్‌సైట్ ఈ డ్రెస్ ధరను 5,39,646.30 రూపాయలుగా పేర్కొంది. ఈ విషయం తెలుసుకున్న నెటిజన్లు.. అబ్బా! ఒక డ్రెస్‌కు ఇంత ధరా అని ఆశ్చర్యపోతున్నారు. అంతే కాదు సామాన్యుల దగ్గర నుంచి సెలబ్రెటీల వరకూ నెట్టింట రకరకాల కామెంట్లు కూడా చేస్తున్నారు.
జాన్వీ కపూర్ వింటేజ్ ఫ్యాషన్ మూమెంట్‌ను సోషల్ మీడియాలో షేర్ చేసిన వెంటనే రకరకాల కామెంట్లతో బాక్స్ నిండిపోయింది. జాన్వీతో నటిచిన సహనటులు, అభిమానుల నుండి చాలా ప్రశంసలు, కామెంట్లు వచ్చాయి. హీరో వరుణ్ ధావన్ "బెస్ట్" అని కామెంట్ చేయగా.. అనుషా దండేకర్ "స్టన్నింగ్" అని కామెంట్ చేసింది. సబా ఖాన్ పటౌడీ హార్ట్ ఎమోజీలను పెట్టారు. మరో వైపు అభిమానులు కూడా రకరకాల కామెంట్స్ రాస్తున్నారు. ఒక అభిమాని, “అభినందనలు….. మీ పని పట్ల చాలా గర్వంగా ఉంది. శ్రీదేవి మేడమ్ ఖచ్చితంగా మీ గురించి గర్వపడతారు” అని రాశారు. మరికొందరు ఆమెను "యెల్లో బార్బీ" అని పిలిచారు. కొంతమంది ఫ్యాషన్ ప్రియులు జాన్వీ కపూర్ ను మెచ్చుకుంటూ, "లవ్ యూ జాన్వీ కానీ మీరు చైనీస్ డ్రెస్‌లో ఉన్నారు. అసలు డ్రెస్‌ను చియోంగ్‌సామ్ అంటారు" అని కామెంట్ చేశారు.
55
జాన్వీ కపూర్ సినిమాల అప్ డేట్స్
జాన్వీ కపూర్ సినిమాల విషయానికొస్తే, ఈ ఏడాది శశాంక్ ఖైతాన్ దర్శకత్వంలో 'సన్నీ సంస్కారీ కీ తులసి కుమారి' చిత్రంలో రోహిత్ సరాఫ్, వరుణ్ ధావన్, సాన్యా మల్హోత్రాతో కలిసి నటించారు.ఇషాన్ ఖట్టర్, విశాల్ జెత్వాలతో 'హోమ్‌బౌండ్', సిద్ధార్థ్ మల్హోత్రాతో 'పరమ్ సుందరి' సినిమాల్లో కూడా జాన్వీ కపూర్ నటించారు. ప్రస్తుతం రామ్ చరణ్‌తో 'పెద్ది' సినిమాల్ నటిస్తోంది జాన్వీ.. త్వరలో యంగ్ టైగర్ ఎన్టీఆర్ తో కలిసి దేవర పార్ట్ 2 షూటింగ్ లో జాయిన్ కాబోతున్నట్టు సమాచారం.