జాక్ పాట్ కొట్టిన జాన్వీ కపూర్, ఎన్టీఆర్, చరణ్ తో పాటు..మరో భారీ తెలుగు ప్రాజెక్ట్ లో బాలీవుడ్ బ్యూటీ.. ?

First Published | Apr 15, 2024, 10:29 AM IST

లక్ అంటే జాన్వీ కపూర్ దే.. నక్క తోక తోక్కి వచ్చిందో ఏంటో తెలియదు కాని.. టాలీవుడ్ లో అడుగుపెట్టిన వేళా విషేశం.. జాన్వీ కి బాగా కలిసి వస్తున్నట్టుంది. ఇప్పటికే రెండు భారీ ప్రాజెక్ట్ లలో జాయిన అయిన ఈ బ్యూటీ.. ముచ్చటగా మూడో సినిమాకు సైన్ చేసిందని తెలుస్తోంది. 
 

ఎవరికైనా అదృష్టం ఒక్క సారి తలుపు తడుతుంది. కాని జాన్వీ కపూర్ కు టాలీవుడ్ రూపంలో మూడోసారి అదృష్టం తలుపు కాస్త గట్టిగా తట్టింది. అవును ఇప్పటికే ఎన్టీఆర్ దేవర సినిమాతో టాలీవుడ్ ఎంట్రీకి రెడీ అయిన జాన్వీకి చరణ్ RC16 సినిమాతో రెండో అవకాశం అదృష్టంగా వరించింది.  ఇక ఈ షూటింగ్ స్టార్ట్ కాకముందే.. జాన్వీ మరో భారీ ప్రాజెక్ట్ లో భాగం కాబోతున్నట్టు వార్తలు వైరలు అవుతున్నాయి. 
 

శ్రీదేవి వారసురాలిగా వచ్చిన జాన్వీ కపూర్ బాలీవుడ్ లో పెద్దగా కమర్షియల్ హిట్లు కొట్టింది లేదు. ఆర్ట్ సినిమాలు చేసుకుంటూ వెళ్లింది. కెరీర్ బిగినింగ్ లోనే ఆమె బాయోపిక్ లు, ఎక్స్ పెర్మెంట్ మూవీస్ వైపు చూసింది. కాని కమర్షియల్ గా బాలీవుడ్ లో  పేరు తెచ్చుకోలేకపోుయింది. ఇక సౌత్ లోనే ఆమె తన ప్రతాపం చూపించాలని అనుకుంటోంది. 

హీరో ధనుష్ భార్య రెండో పెళ్ళి..? ఐశ్వర్య రజనీకాంత్‌కి కాబోయే వరుడు ఎవరంటే..?


టాలీవుడ్ లో పక్కా కమర్షియల్ ట్యాగ్ తగిలించుకుంది  జాన్వీ కపూర్. దేవర సినిమాతో పాటు రామ్ చరణ్ సినిమా రెండూ పాన్ ఇండియా మూవీస్ కావడం..ఈసినిమాలో జాన్వీ రెచ్చిపోబోతోంది అంటూ.. ముందే చెప్పేస్తున్నారు ఆడియన్స్. బాలీవుడ్ లో ఎలా ఉన్నా.. సౌత్ లో మాత్రం కమర్షియల్ హీరోయిన్ గా ఎదగాలి అని చూస్తోంది. ఇక్కడి నుంచే పాన్ ఇండియాను రూల్ చేయాలని అనుకుంటుంది జాన్వీ. 

ఇక ఈక్రమంలోనే ఆమె సౌత్ నుంచి వచ్చే కథలను వదలకుండా వింటోందట. ఇంకా ఛాన్స్ ల కోసం చూస్తున్న జాన్వీకి.. బంపర్ ఆఫర్ తగిలిందని టాలీవుడ్ లో టాక్ గట్టిగ నడుస్తోంది. అది కూడాజక్కన్న సినిమా రూపంలో అదృష్టం వరించింది అంటున్నారు. అవును రాజమౌళి మహేష్ బాబు కాంబోలో రాబోతున్న సినిమాలో జాన్వీ కపూర్ సెలక్ట్ అయ్యిందన్న వార్తలు వినిపిస్తున్నాయి. 

భారీ అడ్వెంచర్స్ మూవీ గా ఈ సినిమా తెరకెక్కబోతుంది . ఈ సినిమాలో వన్ ఆఫ్ ద హీరోయిన్ గా  జాన్వి కనిపించబోతుందట .  అయితే ఈ విషయంలో బోనికపూర్ గట్టిగా ప్రయత్నం చేశాడటన్న మాట కూడా వినిపిస్తోంది. ఆయన మాటమీదనే రాజమౌళి  జాన్వి పేరును ఒకే  చేశారట . 

రాజమౌళి కూడా దాదాపు జాన్వీ పేరును ఓకే చేసినట్లు తెలుస్తుంది . అఫీషియల్ గా దీనిపై ఎటువంటి సమాచారం లేదు కాని.. సోషల్ మీడియాలో మాత్రం  ఈ వార్త బాగా వైరల్ అవుతోంది. మరి ఇందులో ఎంత వరకూ నిజం ఉందో తెలియాలంటే అధికారిక ప్రకటన వచ్చే వరకూ వెచి చూడాల్సిందే. 

జాన్వీ రేంజ్ టాలీవుడ్ లో అమాంతం పెరిగిపోతోంది. ఈమూవీ  నిజంగా ఓకే అయితే ఆమెను పట్టుకోవడం కష్టమే. బాలీవుడ్ లో రాని గుర్తింపు ఆమెకు తెలుగుసినిమా అందించబోతోంది. 

Latest Videos

click me!