Janhvi Kapoor: అతిలోక సుందరి శ్రీదేవి వారసురాలిగా బాలీవుడ్‌లో ఎంట్రీ ఇచ్చింది జాన్వీ కపూర్. ప్రస్తుతం స్టార్ హీరోలతో వరుసగా పెద్ద ప్రాజెక్ట్స్ చేస్తూ క్రేజ్‌ని సంపాదిస్తోంది. ఇటీవల జాన్వీ కామెంట్స్ సోషల్ మీడియాలో తెగ వైరలవుతున్నాయి. ఇంతకీ ఏమన్నారంటే?
Janhvi Kapoor: దివంగత స్టార్ హీరోయిన్ శ్రీదేవి వారసురాలిగా బాలీవుడ్‌లో ఎంట్రీ ఇచ్చింది జాన్వీ కపూర్. ‘దఢక్’ సినిమాతో హీరోయిన్‌గా పరిచయం అయింది. తరువాత పలు బాలీవుడ్ మూవీస్‌లో నటించి క్రేజ్ సంపాదించింది. తెలుగులో కూడా ఎన్టీఆర్ సరసన ‘దేవర’తో ఎంట్రీ ఇచ్చి ఆకట్టుకుంది. ప్రస్తుతం రామ్ చరణ్‌తో కలిసి బుచ్చి బాబు దర్శకత్వంలో తెరకెక్కుతున్న RC16లో హీరోయిన్‌గా నటిస్తోంది. ఇటీవల హీరోయిన్ చేసిన కామెంట్స్ సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతున్నాయి. ఇంతకీ ఏమన్నారంటే?
25
స్పెషల్ స్టార్డమ్
బాలీవుడ్ బ్యూటీ జాన్వీ కపూర్ ప్రస్తుతం స్టార్ హీరోల సరసన వరుసగా పెద్ద ప్రాజెక్ట్స్ చేస్తూ క్రేజ్‌ని సంపాదిస్తోంది. ఇటీవలే ఆమె నటించిన ‘పరమ్ సుందరి’ సినిమా ఆగస్టు 29న గ్రాండ్ రిలీజ్ అయింది. బాలీవుడ్ మాత్రమే కాకుండా ఇతర భాషల్లోనూ విడుదలైన ఈ చిత్రం పాజిటివ్ రివ్యూలు అందుకుంటోంది. ఇందులో జాన్వీ విభిన్న షేడ్స్ ఉన్న పాత్రతో ఆకట్టుకుంది. అయితే, సినిమా ప్రమోషన్స్‌లో జాన్వీ చేసిన వ్యక్తిగత కామెంట్స్ ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్‌గా మారాయి.
35
జాన్వీ కపూర్ ఓపెన్ కామెంట్స్
గతంలోనే ఓ ఇంటర్వ్యూలో జాన్వీ తన భవిష్యత్‌లో మూడు పిల్లలను కనాలనుకుంటున్నట్లు చెప్పింది. ఇప్పుడు ఆ మాటల వెనుక కారణం వివరించింది. “నా లక్కీ నంబర్ 3. అందుకే నాకు ముగ్గురు పిల్లలు ఉండాలి. ఇద్దరు పిల్లలు గొడవ పడితే మూడోవాడు ఎవరికి సపోర్ట్ చేస్తాడో చూడాలని ఉంటుంది. ఇలా వాళ్లు ఒకరికొకరు అండగా నిలుస్తారు. అందుకే నేను ముగ్గురు పిల్లలను కనాలని అనుకుంటున్నాను” అని స్పష్టం చేసింది. ఈ కామెంట్స్‌తోపాటు, జాన్వీ పెళ్లి గురించి కూడా చర్చ మొదలైంది. అయితే, హీరోయిన్ మాత్రం ప్రస్తుతం సినిమాలపైనే ఫోకస్ పెట్టిందని క్లారిటీ ఇచ్చింది. “ఇంకా పెళ్లికి టైమ్ ఉంది. ముందుగా నా కెరీర్‌ని బలపర్చుకోవాలి”అని తెలిపింది.
జాన్వీ తెలుగు కెరీర్ వైపు చూస్తే.. జూనియర్ ఎన్టీఆర్ సరసన ‘దేవర’లో ఇప్పటికే మెరిసిన జాన్వీ. ఈ మూవీ బ్లాక్ బస్టర్ గా మారిన జాన్వీకి మాత్రం అంతగా గుర్తింపు రాలేదనే చెప్పాలి. ప్రస్తుతం రామ్ చరణ్ – బుచ్చిబాబు కాంబినేషన్‌లో వచ్చే RC16 (పెద్ది) మూవీ లో హీరోయిన్‌గా నటిస్తోంది. ఈ చిత్రం 2026 మార్చిలో రిలీజ్ కానుంది. అదేవిధంగా ‘దేవర 2’లోనూ జాన్వీనే హీరోయిన్‌గా కొనసాగనుంది. ఇక అల్లు అర్జున్ – అట్లీ కాంబోలో తెరకెక్కనున్న బిగ్ బడ్జెట్ ప్రాజెక్ట్‌లోనూ జాన్వీ ని హీరోయిన్ గా ఎంపికైనట్లు టాక్.
55
బాలీవుడ్ లోనూ వరుస అవకాశాలు
బాలీవుడ్ లో జాన్వీకి వరుస అవకాశాలు వస్తూనే ఉన్నాయి. ఇటీవల బాలీవుడ్ స్టార్ సిద్ధార్థ్ మల్హోత్రాతో ‘పరమ్ సుందరి’ నటించింది. ఈ మూవీలో తన నేచురల్ పెర్ఫార్మెన్స్ తో ప్రేక్షకులను మెప్పించింది. మాడాక్ ఫిల్మ్స్ నిర్మించిన ఈ రొమాంటిక్ కామెడీ మూవీకి మంచి వసూళ్లు రావడం విశేషం. ప్రస్తుతం జాన్వీ స్టార్‌డమ్‌ను ఆస్వాదిస్తూ కెరీర్ పైనే దృష్టి పెట్టినా, తాను ప్యూచర్ లో ‘ముగ్గురు పిల్లలు’ కనాలనే కామెంట్స్ మాత్రం అభిమానుల్లో ఆసక్తికర చర్చకు కారణమవుతున్నాయి.