ఆ హీరోతో వద్దు, ఎన్టీఆర్ తో నటించమని జాన్వీ కపూర్ కి సలహా ఇచ్చింది ఎవరో తెలుసా ?

First Published | Sep 13, 2024, 5:21 PM IST

దేవర చిత్రంలో జాన్వీ కపూర్ నటించడం గురించి బాలీవుడ్ లో ఆసక్తికర ప్రచారం జరుగుతోంది. సౌత్ లో నటించాలా వద్దా.. నటిస్తే ఏ హీరోగా ముందుగా నటించాలి అనే కన్ఫ్యూజన్ జాన్వీ కపూర్ కి ఉండేదట.

యంగ్ టైగర్ ఎన్టీఆర్ నటించిన తాజా చిత్రం దేవర. కొరటాల శివ దర్శకత్వంలో ఈ చిత్రం తెరకెక్కింది. ఈ చిత్రంలో ఎన్టీఆర్ కి జోడిగా జాన్వీ కపూర్ నటించింది. మరో రెండు వారాల్లో ఈ చిత్రం ఆడియన్స్ ముందుకు రాబోతోంది. దీనితో ప్రచార కార్యక్రమాలు జోరుగా సాగుతున్నాయి. జాన్వీ కపూర్ కి టాలీవుడ్ ఇదే డెబ్యూ మూవీ. సౌత్ లో కూడా ఆమెకి ఇదే తొలి చిత్రం. 

దేవర చిత్రంలో జాన్వీ కపూర్ నటించడం గురించి బాలీవుడ్ లో ఆసక్తికర ప్రచారం జరుగుతోంది. సౌత్ లో నటించాలా వద్దా.. నటిస్తే ఏ హీరోగా ముందుగా నటించాలి అనే కన్ఫ్యూజన్ జాన్వీ కపూర్ కి ఉండేదట. ఆమె కెరీర్ ఆరంభం నుంచి బడా దర్శక నిర్మాత కరణ్ జోహార్ మెంటర్ గా ఉంటున్నారు. 


సౌత్ లో అడుగుపెట్టాలని జాన్వీ డిసైడ్ అయినప్పుడు ఆమెకి రెండు అవకాశాలు వచ్చాయి. ముందుగా దళపతి విజయ్ చిత్రంలో జాన్వీ కపూర్ కి ఆఫర్ వచ్చిందట. ఆ తర్వాత ఎన్టీఆర్ దేవర చిత్రంలో కూడా ఆఫర్ వచ్చింది. ఈ రెండింటిలో దేనిని ఒకే చేయాలో అర్థం కాక జాన్వీ కన్ఫ్యూజన్ కి గురైందట. 

అప్పుడు ఆమె కరణ్ జోహార్ సలహా తీసుకుంది. కరణ్ జోహార్ వెంటనే ఎన్టీఆర్ చిత్రాన్ని ఓకె చేయ్ అని చెప్పారట. ఆర్ఆర్ఆర్ తర్వాత ఎన్టీఆర్ పాన్ ఇండియా హీరో అయ్యాడు. పైగా ట్యాలెంట్ ఉన్న నటుడు. కాబట్టి ఎన్టీఆర్ తో నటిస్తే అడ్వాంటేజ్ ఉంటుంది అని కరణ్ జోహార్ ఆ సలహా ఇచ్చారని సమాచారం. 

కరణ్ జోహార్ మరో విషయం కూడా జాన్వీ కపూర్ కి చెప్పారట. అదేంటంటే.. మీ తల్లి శ్రీదేవి టాలీవుడ్ లో 80, 90 దశకాల్లో తిరుగులేని హీరోయిన్ గా వెలుగు వెలిగింది. ఆ క్రేజ్ కూడా నీకు ఉపయోగపడుతుంది అని చెప్పారట. దీనితో జాన్వీ కపూర్ ఏమాత్రం ఆలోచించుకుండా ఎన్టీఆర్ దేవర చిత్రానికి సైన్ చేసింది అని టాక్. 

Latest Videos

click me!