ఈ నేపథ్యంలో AK ఇప్పుడు మరో కొత్త కారు కొనుగోలు చేశారు. ఈసారి అజిత్ పోర్షే నుంచి GT3 RS మోడల్ కారును కొనుగోలు చేశారు. ఆ కారు ధర 3.51 కోట్లు ఉంటుందని చెబుతున్నారు. ఈ కారు కేవలం 3.2 సెకన్లలో సున్నా నుంచి 100 కి.మీ వేగాన్ని అందుకోగలదు.
ఈ కారు గరిష్ట వేగం గంటకు 296 కి.మీ. ఈ కారు ఫోటోను ఇన్‌స్టాగ్రామ్‌లో పోస్ట్ చేసిన శాలిని, తన కారు, స్టైల్‌తో పాటు తన హృదయాన్ని కూడా గెలుచుకున్నాడని క్యాప్షన్ ఇచ్చారు.