మహిళలకు ప్రతినెలా పీరియడ్స్ రావడం సహజంగా జరిగేదే. దీని గురించి పురుషులందరికీ తెలుసు. అయితే.. మహిళలు నెలసరి సమయంలో పడేనొప్పిని కొందరు మగాళ్లు వెటకారం చేయడం, మహిళల ప్రవర్తన, మాటలను అర్థం చేసుకోలేకపోతున్నారని ప్రముఖ నటి జాన్వీ కపూర్ మండిపడుతున్నారు. ఇటీవల పీరియడ్స్ అంశంపై అనేక మంది హీరోయిన్లు బహిరంగంగా మాట్లాడుతున్నారు. రీసెంట్‌గా సమంతా కూడా ఈ అంశం గురించి ప్రస్తావించింది. వారేమంటున్నారంటే..