తమని ప్రజలు నాణేనికి ఒకవైపు లా మాత్రమే చూస్తారని, గ్లామర్ తారగా చూస్తారని, కానీ మరో కోణంలో మా జీవితంలో అనేక బాధలుంటాయని చెప్పింది జాన్వీ. తాము రాణించేందుకు చాలా శ్రమిస్తామని,ఆ శ్రమని ఎవరూ గుర్తించరని పేర్కొంది. అంతేకాదు ఆడియెన్స్ ముందుకు రావడానికి మేం నిత్యం ఎంతో స్ట్రగుల్ పడతామని, తీవ్రమైన ఒత్తిడికి గురవుతుంటామని, నిత్యం హడావుడిగాఉంటుందని, నిద్రలేని రాత్రులు గడపాల్సి వస్తుందని తెలిపింది. కానీ ఇవన్నీ ఎవరూ పట్టించుకోరని, మేం బర్త్ నే ప్రధానంగా చూస్తారని ఆవేదన వ్యక్తం చేసింది జాన్వీ.