NTR30లో హీరోయిన్‌గా ఆఫర్‌.. ఫస్ట్ టైమ్‌ ఓపెనైన జాన్వీ కపూర్..అసలు విషయం చెబుతూ ఆకాశానికి ఎత్తేసిందిగా!

Published : Aug 04, 2022, 01:56 PM IST

అతిలోక సుందరి శ్రీదేవి తనయ జాన్వీ కపూర్‌ టాలీవుడ్‌ ఎంట్రీకి సంబంధించిన గత కొన్ని రోజులుగా వార్తలొస్తున్నాయి. ఈ నేపథ్యంలో తాజాగా ఓపెన్‌ అయ్యింది జాన్వీ. అసలు విషయం బయటపెట్టింది. 

PREV
16
NTR30లో హీరోయిన్‌గా ఆఫర్‌.. ఫస్ట్ టైమ్‌ ఓపెనైన జాన్వీ కపూర్..అసలు విషయం చెబుతూ ఆకాశానికి ఎత్తేసిందిగా!
Image: Janhvi Kapoor/Instagram

జాన్వీ కపూర్‌(Janhvi Kapoor) బాలీవుడ్‌లో ఓ క్రేజీ యంగ్‌ హీరోయిన్. నెటిజన్లకి ఆమె ఒక హాట్‌ బాంబ్‌. అందాల విస్పోటనంతో ఊపిరాడకుండా చేస్తుంటుంది. అందాల ఆరబోతలో హద్దుల్లేకుండా రెచ్చిపోతూ నెటిజన్లకి, అభిమానులకు విజువల్‌ ట్రీట్‌నిస్తుంటుంది. సోషల్‌ మీడియాలో క్రేజీ బ్యూటీగా నిలుస్తున్న ఈ భామ తాజాగా తెలుగులో సినిమాలు చేయడంపై, ఎన్టీఆర్‌తో సినిమాపై రియాక్ట్ అయ్యింది. 
 

26
Image: Janhvi Kapoor/Instagram

జాన్వీ కపూర్‌ నటించిన `గుడ్‌ లక్‌ జెర్రీ` సినిమా డిస్నీ ప్లస్‌ హాట్‌ స్టార్‌లో స్ట్రీమింగ్‌ అవుతుంది. ఈ చిత్ర ప్రమోషన్‌లో భాగంగా ఓ మీడియాతో మాట్లాడుతూ, ఆసక్తికర విషయాలను వెల్లడించింది. NTR30లో జాన్వీ కపూర్‌ హీరోయిన్‌గా నటించబోతుందనే రూమర్స్‌ వినిపించిన నేపథ్యంలో జాన్వీ కపూర్‌ స్పందించింది. 
 

36

ఎన్టీఆర్‌(NTR) సర్‌తో కలిసి పనిచేసే అవకాశం అంటే మామూలు విషయం కాదు. ఆయనొక లెజెండ్‌. ఆయనతో కలిసి నటించబోతున్నట్టు వస్తోన్న వార్తలు నిజమైతే అంతకంటే అదృష్టవంతురాలు మరొకరుండరు. కానీ బ్యాడ్‌ లక్‌ ఏంటంటే ఆ సినిమా నుంచి నాకు ఇప్పటి వరకు ఎలాంటి ఆఫర్‌ రాలేదు. నేను ప్రస్తుతం మంచి అవకాశం కోసం ఎదురుచూస్తున్నానని తెలిపింది. మరోవైపు సౌత్‌ సినిమాల విషయంలో చాలా ఓపెన్‌గా ఉంటానని, టాలీవుడ్‌లోగానీ, సౌత్‌ లోగానీ సినిమా చేయాలనే ఆసక్తి ఉన్నట్టు చెప్పింది జాన్వీ కపూర్‌. 

46
Image: Janhvi Kapoor/Instagram

జాన్వీ తమిళంలో నటించడంపై చెబుతూ, `మణిరత్నం సర్‌ చిత్రాల తరహాలో ఓ క్లాసిక్‌ సినిమా చేయాలనుకుంటున్నట్టు చెప్పింది. అందులో ఐశ్వర్య రాయ్‌లాగా చాలా సాధారణ దుస్తులతో, పర్వాతాలు, జలపాతం చుట్టూ తిరుగుతుండాలని, బ్యాక్‌ గ్రౌండ్‌లో రెహ్మాన్‌ పాట వస్తుండాలని, ఆ సీన్‌లో చాలా ఎమోషన్స్ ఉంటుందని పేర్కొంది జాన్వీ. మరి ఈ అమ్మడి డ్రీమ్‌ నెరవేరుతుందో లేదో చూడాలి. 
 

56
Image: Janhvi Kapoor/Instagram


అయితే జాన్వీ కపూర్‌.. ఆ మధ్య విజయ్‌ దేవరకొండతోనే `లైగర్‌` సినిమాతో టాలీవుడ్‌ ఎంట్రీ ఇవ్వాల్సి ఉంది. డేట్‌తోపాటు మరికొన్ని కారణాలతో అది కుదరలేదు. దీంతో ఇప్పుడు చాలా తెలుగు సినిమాలకు హీరోయిన్‌గా ఆమె పేరు తెరపైకి వస్తుంది. మరి ఏ సినిమాతో జాన్వీ లాంచ్‌ అవుతుందో చూడాలి. 
 

66

జాన్వీ కపూర్‌ ప్రస్తుతం రాజ్‌కుమార్ రావుతో కలిసి ‘మిస్టర్ అండ్ మిసెస్ మహి’, సన్నీ కౌశల్‌తో కలిసి `మిలీ`, వరుణ్ ధావన్‌తో కలిసి ‘బవాల్’ చిత్రం చేస్తోంది. ఆమె `కాఫీ విత్‌ కరణ్‌ షోలో సందడి చేసిన విషయం తెలిసిందే. 

AR
About the Author

Aithagoni Raju

అయితగోని రాజు 2020 నుంచి ఏషియానెట్‌ తెలుగులో వర్క్ చేస్తున్నారు. ఆయనకు టీవీ, ప్రింట్‌, డిజిటల్‌ జర్నలిజంలో 13ఏళ్ల అనుభవం ఉంది. ప్రధానంగా న్యూస్‌, సినిమా జర్నలిజం, ఎంటర్‌టైన్‌మెంట్‌ రంగంలో ప్రముఖ సంస్థల్లో వర్క్ చేశారు. ప్రపంచ సినిమాని `షో`(నవతెలంగాణ) పేరుతో రాసిన ప్రత్యేక కథనాలు విశేష గుర్తింపుని తెచ్చిపెట్టాయి. ప్రస్తుతం ఏషియానెట్‌ తెలుగులో ఎంటర్‌టైన్‌ మెంట్ టీమ్‌ని లీడ్‌ చేస్తున్నారు. సబ్‌ ఎడిటర్‌గానే రిపోర్టర్ గా సినిమా ఫీల్డ్ అనుభవం ఉంది. ఎంటర్‌టైన్‌మెంట్‌ విభాగంలో సినిమా, టీవీ, ఓటీటీ కి సంబంధించి ఆసక్తికర కథనాలను, సినీ ఇండస్ట్రీలోని విషయాలను, సినిమా రివ్యూలు, విశ్లేషణాత్మక కథనాలు రాయడంలో మంచి పట్టు ఉంది. క్వాలిటీ కంటెంట్‌ని అందిస్తూ, క్వాలిటీ జర్నలిజాన్ని ముందుకు తీసుకెళ్లడంలో తనవంతు కృషి చేస్తున్నారు.Read More...
Read more Photos on
click me!

Recommended Stories