కాన్స్ 2025: జాన్వీ కపూర్ స్టన్నింగ్ లుక్ వైరల్, ఆమె డ్రెస్ మోసేందుకు సిబ్బంది కష్టాలు చూడండి

Published : May 21, 2025, 11:11 AM IST

కాన్స్ 2025: ఫ్రాన్స్‌లోని కాన్స్ సిటీలో కాన్స్ ఫిల్మ్ ఫెస్టివల్ జరుగుతోంది. జాన్వీ కపూర్ రెడ్ కార్పెట్ పై అదరగొట్టింది. ఆమె డ్రెస్ ని మోసేందుకు సిబ్బంది పడుతున్న కష్టాలు వైరల్ అవుతున్నాయి.

PREV
16
రెడ్ కార్పెట్ పై జాన్వీ కపూర్ మెరుపులు

ఫ్రాన్స్‌లోని కాన్స్ సిటీలో జరుగుతున్న కాన్స్ ఫిల్మ్ ఫెస్టివల్‌లో జాన్వీ కపూర్ గ్రాండ్ గా ఎంట్రీ ఇచ్చింది. రెడ్ కార్పెట్ పై ఆమె అందంగా కనిపించింది. 

26
పింక్ డ్రెస్ లో జాన్వీ స్టన్నింగ్ లుక్

కాన్స్ రెడ్ కార్పెట్ పై జాన్వీ కపూర్ డిజైనర్ తరుణ్ తహిలియాని డిజైన్ చేసిన మెటాలిక్ పింక్ గౌనులో కనిపించి అందరినీ ఆకర్షించింది. జాన్వీ స్టన్నింగ్ లుక్ కి ప్రతి ఒక్కరూ ఫిదా అవుతున్నారు.

36
జాన్వీ చిరునవ్వులు చిందిస్తూ ఇలా..

జాన్వీ కపూర్ పింక్ గౌనుపై గ్లిటర్, సీక్వెన్స్, ఎంబ్రాయిడరీ ఉన్నాయి. ప్రత్యేక ఆకర్షణ కోసం జాన్వీ కొన్ని ఆభరణాలు కూడా ధరించింది. ఈ డ్రెస్ లో జాన్వీ చిరునవ్వులు చిందిస్తూ దేవతలా మెరిసింది.

46
తెలుగులో జాన్వీ కపూర్ హవా

కాన్స్ రెడ్ కార్పెట్ పై జాన్వీ కపూర్ కాన్ఫిడెంట్ గా కనిపించింది. పాన్ ఇండియా స్థాయిలో హీరోయిన్ గా గుర్తింపు సొంతం చేసుకున్న జాన్వీ.. ఇప్పుడు అంతర్జాతీయ స్థాయిలో చర్చనీయాంశంగా మారింది.ఇప్పటికే జాన్వీ దేవర చిత్రంలో నటించింది. ప్రస్తుతం రాంచరణ్ సరసన పెద్ది చిత్రంలో నటిస్తోంది. తెలుగులో జాన్వీ కపూర్ హవా మొదలైంది.

56
జాన్వీ డ్రెస్ మోసేందుకు సిబ్బంది కష్టాలు

జాన్వీ కపూర్ లాంగ్ డ్రెస్ ధరించడంతో ఆమె డ్రెస్ ని మోసేందుకు సిబ్బంది ఇబ్బందులు పడ్డారు. ఆ దృశ్యాలు కూడా వైరల్ అవుతున్నాయి.

66
కాన్స్ లో ఇషాన్, కరణ్ జోహార్

కాన్స్ ఫిల్మ్ ఫెస్టివల్ లో ఇషాన్ ఖట్టర్, కరణ్ జోహార్ కూడా పాల్గొన్నారు. ఇద్దరూ వెరైటీ లుక్ లో కనిపించారు. 

Read more Photos on
click me!

Recommended Stories