విశాల్‌, సాయి ధన్సిక లవ్‌ స్టోరీ వెనుక క్రేజీ డైరెక్టర్‌.. ఏడిపించి ప్రేమకి పునాది

Published : May 21, 2025, 09:27 AM ISTUpdated : May 21, 2025, 12:14 PM IST

కోలీవుడ్‌ స్టార్‌ విశాల్‌, హీరోయిన్‌ సాయి ధన్సిక పెళ్లి చేసుకోబోతున్నట్టు ప్రకటించిన విషయం తెలిసిందే. దీంతో వీరి ప్రేమ ఎక్కడ స్టార్ట్ అయ్యింది? ఎలా పునాది పడిందనేది ఆసక్తికరంగా మారింది. 

PREV
15
ప్రేమని కన్పమ్‌ చేస్తూ పెళ్లి డేట్‌ ప్రకటించిన విశాల్‌-సాయి ధన్సిక

విశాల్‌, సాయి ధన్సిక ఊహించని విధంగా తమ పెళ్లి ప్రకటన చేసి అందరిని ఆశ్చర్యపరిచారు. అంతకు ముందు విశాల్‌కి చాలా మందితో లవ్‌ ఎఫైర్‌ రూమర్స్ వచ్చాయి. కానీ ఎప్పుడూ సాయి ధన్సిక పేరు వినిపించలేదు. కానీ సడెన్‌గా ఆమె పేరు తెరపైకి రావడం ఆశ్చర్యపరిచింది. అంతే కాదు  'యోగి ద' సినిమా ఆడియో వేడుకలో విశాల్, సాయి ధన్షిక తమ ప్రేమని ప్రకటిస్తూ పెళ్లి డేట్‌ని కూడా వెల్లడించారు. . ఈ ఈవెంట్‌  విశాల్, సాయి  ధన్సికల ఎంగేజ్‌మెంట్‌ వేడుకలా జరిగిందని, అందులో పాల్గొన్న దర్శకుడు పేరరసు  సరదాగా వ్యాఖ్యానించడం విశేషం. 

25
విశాల్ - సాయి ధన్సికల పెళ్లి డేట్‌ ఇదే

విశాల్, సాయి ధన్సిక చాలా కాలం పాటు మంచి స్నేహితులుగా ఉన్నారు. కానీ ఇటీవలే ప్రేమలో పడ్డారని తెలుస్తుంది. ఎట్టకేలకు వీరిద్దరు ఓపెన్‌ అయ్యారు. అందరిని ఆశ్చర్యపరుస్తూ మ్యారేజ్‌ చేసుకోబోతున్నట్టు ప్రకటించారు. విశాల్‌ పుట్టిన రోజు  ఆగస్టు 29న మ్యారేజ్‌ చేసుకోబోతున్నట్టు వెల్లడించడం విశేషం.  తన బర్త్ డే రోజే  తన ప్రియురాలిని పెళ్లాడబోతున్నారు విశాల్. పెళ్లయిన తర్వాత కూడా  సాయి ధన్సిక సినిమాల్లో నటిస్తుందని 'యోగిత' ఆడియో వేడుకలో విశాల్ చెప్పడం విశేషం. 

35
విశాల్ - సాయి ధన్సిక ప్రేమకి పునాది వేసిన టీ రాజేందర్‌

విశాల్, సాయి ధన్సిక ఇప్పటివరకు ఒక్క సినిమాలో కూడా కలిసి నటించలేదు. మరి ఈ ఇద్దరు ఎలా ప్రేమలో పడ్డారనేది ఆసక్తికరంగా మారింది.  దాని వెనుక ఒక సంఘటన ఉంది. 2017లో సాయి ధన్సిక నటించిన 'విజితిరు' సినిమా ప్రమోషన్ కార్యక్రమంలో టీ. రాజేందర్ ముఖ్య అతిథిగా పాల్గొన్నారు. ఆ వేడుకలో సాయి ధన్సిక మాట్లాడుతూ టీ. రాజేందర్ పేరు చెప్పడం మర్చిపోయారు. దీన్ని వెంటనే గమనించిన టీఆర్ ఆమెని ఆటపట్టిస్తూ సరదా కామెంట్లు చేశారు. 

45
సాయి ధన్సికని ఆటపట్టించిన టీఆర్‌

టీ.రాజేందర్ మాటలకు సాయి ధన్సిక క్షమాపణ చెప్పారు. అయినా టీఆర్ ఆమెను ఆటపట్టిస్తూనే ఉన్నారు. అది కాస్త సీరియస్‌ వైపు టర్న్ తీసుకుంది. దీంతో సాయి ధన్సిక స్టేజ్‌ పైనే కన్నీళ్లు పెట్టుకున్నారు. ఈ సంఘటన అప్పట్లో పెద్ద చర్చనీయాంశం అయ్యింది.  అప్పుడు ధన్సికకి సపోర్ట్ గా నిలిచారు విశాల్‌. టీ.రాజేందర్‌ను వ్యతిరేకిస్తూ విశాల్ ఒక ప్రకటన విడుదల చేశారు.

55
సాయి ధన్సికకి సపోర్ట్ గా నిలిచిన విశాల్‌, అదే ప్రేమకి పునాది

 దీంతో విశాల్‌కు థ్యాంక్స్ చెప్పేందుకు ఆయనకు ఫోన్ చేసి మాట్లాడింది ధన్సిక. ఆ తర్వాత ఇద్దరూ స్నేహితులయ్యారు. ఆ స్నేహం కాస్త ప్రేమగా మారి ఇప్పుడు పెళ్లి వరకు వచ్చింది. ఇలా విశాల్, ధన్సిక ప్రేమకు టీ రాజేందర్‌ కారణమయ్యారని చెప్పొచ్చు.

టీ రాజేందర్‌ కోలీవుడ్‌లో దర్శకుడిగా, నిర్మాతగా, నటుడిగా, రైటర్‌గా, మ్యూజిక్‌ డైరెక్టర్‌గా రాణిస్తున్న విషయం తెలిసిందే. ఆయన శింబు ఫాదర్‌ కూడా అని అందరికి తెలిసిందే. 

AR
About the Author

Aithagoni Raju

అయితగోని రాజు 2020 నుంచి ఏషియానెట్‌ తెలుగులో వర్క్ చేస్తున్నారు. ఆయనకు టీవీ, ప్రింట్‌, డిజిటల్‌ జర్నలిజంలో 13ఏళ్ల అనుభవం ఉంది. ప్రధానంగా న్యూస్‌, సినిమా జర్నలిజం, ఎంటర్‌టైన్‌మెంట్‌ రంగంలో ప్రముఖ సంస్థల్లో వర్క్ చేశారు. ప్రపంచ సినిమాని `షో`(నవతెలంగాణ) పేరుతో రాసిన ప్రత్యేక కథనాలు విశేష గుర్తింపుని తెచ్చిపెట్టాయి. ప్రస్తుతం ఏషియానెట్‌ తెలుగులో ఎంటర్‌టైన్‌ మెంట్ టీమ్‌ని లీడ్‌ చేస్తున్నారు. సబ్‌ ఎడిటర్‌గానే రిపోర్టర్ గా సినిమా ఫీల్డ్ అనుభవం ఉంది. ఎంటర్‌టైన్‌మెంట్‌ విభాగంలో సినిమా, టీవీ, ఓటీటీ కి సంబంధించి ఆసక్తికర కథనాలను, సినీ ఇండస్ట్రీలోని విషయాలను, సినిమా రివ్యూలు, విశ్లేషణాత్మక కథనాలు రాయడంలో మంచి పట్టు ఉంది. క్వాలిటీ కంటెంట్‌ని అందిస్తూ, క్వాలిటీ జర్నలిజాన్ని ముందుకు తీసుకెళ్లడంలో తనవంతు కృషి చేస్తున్నారు.Read More...
Read more Photos on
click me!

Recommended Stories