రామ్‌ చరణ్‌తో `జగదేక వీరుడు అతిలోక సుందరి` రీమేక్‌.. చిరుకి, ఆ డైరెక్టర్‌కి ఝలక్‌ ఇచ్చిన జాన్వీ కపూర్‌

Published : Jul 07, 2024, 01:12 PM IST

రామ్‌ చరణ్‌, జాన్వీ కపూర్‌లతో `జగదేక వీరుడు అతిలోక సుందరి` సినిమాని రీమేక చేయాలని చిరంజీవి, రాఘవేంద్రరావులు కోరుకున్నారు. కానీ వాళ్లకి పెద్ద షాకిచ్చింది శ్రీదేవి కూతురు.   

PREV
16
రామ్‌ చరణ్‌తో `జగదేక వీరుడు అతిలోక సుందరి` రీమేక్‌.. చిరుకి, ఆ డైరెక్టర్‌కి ఝలక్‌ ఇచ్చిన జాన్వీ కపూర్‌

మెగాస్టార్‌ చిరంజీవి, అతిలోక సుందరి శ్రీదేవి కలిసి నటించిన బిగ్గెస్ట్ బ్లాక్‌ బస్టర్‌ `జగదేక వీరుడు అతిలోకసుందరి`. దర్శకేంద్రుడు రాఘవేంద్రరావు సృష్టించిన అద్భుతమైన కళాఖండం ఈ మూవీ. సోషియో ఫాంటసీగా రూపొందిన ఈ సినిమా 1990లో విడుదలై సంచలన విజయాన్ని సాధించి ఇండస్ట్రీ రికార్డులు తిరగరాసింది. చిరంజీవి నుంచి ఇలాంటి ఓ విభిన్నమైన సినిమా రావడం, శ్రీదేవి దేవకన్యగా నటించడం ఆడియెన్స్ ని ఆద్యంతం కట్టిపడేసింది. 
 

26

`కల్కి 2898 ఏడీ` చిత్రాన్ని నిర్మించిన అశ్వినీదత్‌ ఈ మూవీని నిర్మించారు. ఆయన కెరీర్‌లోనే బెస్ట్ మూవీగా ఇప్పటికీ చెబుతుంటారు. కేవలం రెండు కోట్లతో తెరకెక్కిన ఈ మూవీ ఏకంగా 15కోట్లు వసూలు చేసింది. కాసుల వర్షం కురిపింది. ఇప్పట్లో అయితే 1500 కోట్లకు సమానమని చెప్పొచ్చు. అంతటి సంచలనాలు క్రియేట్‌ చేసిన ఈ మూవీకి సంబంధించిన రీమేక్‌ చర్చ ఎప్పుడూ జరుగుతూనే ఉంటుంది. రీమేక్‌ చేయాలని ఉందని నిర్మాత అశ్వినీదత్‌, దర్శకుడు కే రాఘవేంద్రరావు కూడా తమ ఇంట్రెస్ట్ ని వెల్లడించారు. 
 

36

`సౌందర్యలహరి` కార్యక్రమంలో చిరంజీవి కూడా ఈ రీమేక్‌పై కామెంట్‌ చేశారు. రామ్‌ చరణ్‌, తమన్నాతో కలిసి చేస్తే బాగుంటుందని ఆయన వెల్లడించారు. అదే సమయంలో ఇప్పుడు శ్రీదేవి కూతురు జాన్వీ కపూర్‌ సినిమాల్లోకి రావడంతో రామ్‌ చరణ్‌, జాన్వీ కపూర్‌ జంటగా `జగదేక వీరుడు అతిలోక సుందరి` రీమేక్‌ చేస్తే బాగుంటుందనే ఆలోచనని వ్యక్తం చేశారు. దీనిపై తరచూ చర్చ నడుస్తూనే ఉంది. 
 

46

అయితే తాజాగా దీనిపై శ్రీదేవి కూతురు, `దేవర` హీరోయిన్‌ జాన్వీ కపూర్‌ స్పందించింది. రీమేక్‌ చేస్తే బాగుంటుందని తెలిపింది. కానీ రామ్‌ చరణ్‌, తాను రీమేక్‌ చేయాలనుకుంటున్నారని యాంకర్‌ అడగ్గా, బిగ్‌ షాకించే వ్యాఖ్యలు చేసింది. తాను రీమేక్‌ చేయనని తెలిపింది. అమ్మ నటించిన ఏ సినిమాని తాను రీమేక్‌ చేయనని వెల్లడించింది. ఆమె చేసిందంటే అవన్నీ ఐకానిక్‌ మూవీస్‌, ఐకానిక్‌ రోల్స్. వాటిని అలా గానీ, దానికంటే బెటర్‌గా గానీ రీప్లేస్‌ చేయడం, రీక్రియేట్‌ చేయడం సాధ్యం కాదని చెప్పింది జాన్వీ కపూర్‌. తాను అందులో నటించలేనని స్పష్టం చేసింది. ఓ రకంగా జాన్వీ.. చిరు, రాఘవేంద్రరావు, అశ్వినీదత్‌లకు పెద్ద షాకిచ్చిందని చెప్పొచ్చు. 
 

56

 ప్రస్తుతం జాన్వీ కపూర్‌.. తెలుగులోకి ఎంట్రీ ఇస్తూ ఎన్టీఆర్‌ సరసన `దేవర` చిత్రంలో నటిస్తుంది. ఇది సెప్టెంబర్‌ 27న విడుదల కానుంది. జాన్వీ మొదటి తెలుగు సినిమా ఇది. దీంతో తెలుగు ఆడియెన్స్ కి పరిచయం కాబోతుంది. పాన్‌ ఇండియా మూవీగా ఇది రూపొందుతున్న విషయం తెలిసిందే. కొరటాల శివ దీనికి దర్శకత్వం వహిస్తున్నారు.

66

దీంతోపాటు రామ్‌ చరణ్‌తో మరో సినిమా చేస్తుంది. బుచ్చిబాబు సానా దర్శకత్వంలో రూపొందుతున్న సినిమాలో హీరోయిన్‌గా చేస్తుంది. `జగదేవక వీరుడు అతిలోక సుందరి` చిత్ర రీమేక్‌లో రామ్‌ చరణ్‌తో చేయకపోయినా, మరో సినిమాలో ఈ ఇద్దరు కలిసి నటిస్తుండటం విశేషం. 
 

AR
About the Author

Aithagoni Raju

అయితగోని రాజు 2020 నుంచి ఏషియానెట్‌ తెలుగులో వర్క్ చేస్తున్నారు. ఆయనకు టీవీ, ప్రింట్‌, డిజిటల్‌ జర్నలిజంలో 13ఏళ్ల అనుభవం ఉంది. ప్రధానంగా న్యూస్‌, సినిమా జర్నలిజం, ఎంటర్‌టైన్‌మెంట్‌ రంగంలో ప్రముఖ సంస్థల్లో వర్క్ చేశారు. ప్రపంచ సినిమాని `షో`(నవతెలంగాణ) పేరుతో రాసిన ప్రత్యేక కథనాలు విశేష గుర్తింపుని తెచ్చిపెట్టాయి. ప్రస్తుతం ఏషియానెట్‌ తెలుగులో ఎంటర్‌టైన్‌ మెంట్ టీమ్‌ని లీడ్‌ చేస్తున్నారు. సబ్‌ ఎడిటర్‌గానే రిపోర్టర్ గా సినిమా ఫీల్డ్ అనుభవం ఉంది. ఎంటర్‌టైన్‌మెంట్‌ విభాగంలో సినిమా, టీవీ, ఓటీటీ కి సంబంధించి ఆసక్తికర కథనాలను, సినీ ఇండస్ట్రీలోని విషయాలను, సినిమా రివ్యూలు, విశ్లేషణాత్మక కథనాలు రాయడంలో మంచి పట్టు ఉంది. క్వాలిటీ కంటెంట్‌ని అందిస్తూ, క్వాలిటీ జర్నలిజాన్ని ముందుకు తీసుకెళ్లడంలో తనవంతు కృషి చేస్తున్నారు.Read More...
Read more Photos on
click me!

Recommended Stories