సాయి పల్లవి, రష్మిక, శ్రీలీల, అనుపమా, రీతూ వర్మ.. ఈ హీరోయిన్లు కోరుకుంటున్న పాత్రలేంటో తెలుసా?

Published : Jul 07, 2024, 11:36 AM IST

హీరో, హీరోయిన్, నటీనటులు ఎవరికైనా సినిమాల్లో డ్రీమ్‌ రోల్స్ ఉంటాయి. మరి సాయిపల్లవి, రష్మిక, శ్రీలీల, అనుపమా, రీతూ వర్మల డ్రీమ్ రోల్స్ ఏంటో తెలుసుకుందాం. 

PREV
15
సాయి పల్లవి, రష్మిక, శ్రీలీల, అనుపమా, రీతూ వర్మ.. ఈ హీరోయిన్లు కోరుకుంటున్న పాత్రలేంటో తెలుసా?

సహజమైన నటనతో మెప్పిస్తుంది సాయిపల్లవి. అద్భుతమైన డాన్స్‌తో పిచ్చెక్కిస్తుంది. లేడీ పవర్ స్టార్‌ ట్యాగ్‌తో రాణిస్తున్న ఈ అమ్మడు ఇప్పటి వరకు లవర్‌గానే నటించింది. `విరాటపర్వం`లోనూ ఆమె ప్రేమికురాలిగా మెప్పించడం విశేషం. అయితే ఆమెకి డ్రీమ్‌రోల్‌ మాత్రం కామెడీ పాత్ర చేయడమట. పూర్తి స్థాయి కామెడీ పాత్ర చేయాలని ఉందని వెల్లడించింది సాయిపల్లవి. 

25

నేషనల్‌ క్రష్‌గా రాణిస్తుంది రష్మిక మందన్నా. ఆమె వరుస పాన్‌ ఇండియా విజయాలతో దూసుకుపోతుంది. త్వరలో `పుష్ప 2`తో రాబోతుంది. ఈ నేపథ్యంలో రష్మిక డ్రీమ్‌ రోల్‌ ఏంటో తెలుసా? తాను సౌందర్యకి పెద్ద అభిమాని. ఆమె సినిమాలు చూస్తూ పెరిగింది. ఆమె నుంచి కొన్ని యాక్టింగ్‌ స్కిల్స్ కూడా నేర్చుకుందట. వాళ్ల నాన్న కూడా తనని సౌందర్యలా ఉంటావని చెబుతుంటాడట. అందుకే తనకు సౌందర్య బయోపిక్‌ చేస్తే అందులో సౌందర్యలా నటించాలనేది తన డ్రీమ్‌ రోల్ అని చెప్పింది రష్మిక. 
 

35
Actress Sreeleela

ఇటీవల యంగ్‌ సెన్సేషన్‌గా మారింది శ్రీలీల. ఒక్కసారిగా ఉవ్వెత్తున ఎగిసి పడిన కెరటంలా పడిపోయింది. మళ్లీ కెరీర్‌ని బిల్డ్ చేసుకుంటున్న శ్రీలీలకి ఓ డ్రీమ్‌ రోల్‌ ఉంది. తనకు పాతతరం సినిమాలంటే బాగా నచ్చుతుందట. అందులో పల్లెటూరి నేపథ్యంలో వచ్చిన సినిమాలంటే బాగా ఇష్టపడతానని చెప్పింది. ఈ క్రమంలో తాను పల్లెటూరి నేపథ్యంలో రూపొందిన సినిమాలో పల్లెటూరి అమ్మాయిగా కనిపించాలనేది తన డ్రీమ్‌ అని చెప్పింది శ్రీలీల. దీంతోపాటు హిస్టారికల్‌ మూవీస్‌లోనూ నటించాలని ఉందని చెప్పిందీ యంగ్‌ బ్యూటీ. 
 

45

అనుపమా పరమేశ్వరన్‌ ఇటీవల తనలోని 2.0 చూపిస్తున్న విషయం తెలిసిందే. `రౌడీ బాయ్‌` నుంచి చాలా మారిపోయింది. `టిల్లు స్వ్కేర్‌`లో మరింత బోల్డ్ గా కనిపించి షాకిచ్చింది. ఈ భామ హోమ్లీ బ్యూటీ నుంచి బోల్డ్ భామలా మారిపోయింది. ఈ బ్యూటీకి నెగటివ్‌ షేడ్స్ ఉన్న రోల్స్ చేయాలని ఉందట. అలాగే `క్వీన్‌`లో కంగనా రనౌత్‌ లాంటి పాత్రలు చేయాలని ఉందని చెప్పింది అనుపమా పరమేశ్వరన్‌. 

55

 రీతూ వర్మ.. `పెళ్లి చూపులు`తో ఫేమస్‌ అయ్యింది. చాలా సెలక్టీవ్‌గా సినిమాలు చేస్తూ రాణిస్తుంది. గ్లామర్‌కి దూరంగా ఉండే ఈ భామ యాక్షన్‌ సినిమా చేయాలని ఉందట. పూర్తి స్థాయి యాక్షన్‌ మూవీలో యాక్షన్‌ రోల్‌ చేయాలని ఉందని చెప్పింది రీతూ. మరి ఈ భామల కోరికలు ఎప్పుడు నెరవేరుతాయో చూడాలి. 

 

AR
About the Author

Aithagoni Raju

అయితగోని రాజు 2020 నుంచి ఏషియానెట్‌ తెలుగులో వర్క్ చేస్తున్నారు. ఆయనకు టీవీ, ప్రింట్‌, డిజిటల్‌ జర్నలిజంలో 13ఏళ్ల అనుభవం ఉంది. ప్రధానంగా న్యూస్‌, సినిమా జర్నలిజం, ఎంటర్‌టైన్‌మెంట్‌ రంగంలో ప్రముఖ సంస్థల్లో వర్క్ చేశారు. ప్రపంచ సినిమాని `షో`(నవతెలంగాణ) పేరుతో రాసిన ప్రత్యేక కథనాలు విశేష గుర్తింపుని తెచ్చిపెట్టాయి. ప్రస్తుతం ఏషియానెట్‌ తెలుగులో ఎంటర్‌టైన్‌ మెంట్ టీమ్‌ని లీడ్‌ చేస్తున్నారు. సబ్‌ ఎడిటర్‌గానే రిపోర్టర్ గా సినిమా ఫీల్డ్ అనుభవం ఉంది. ఎంటర్‌టైన్‌మెంట్‌ విభాగంలో సినిమా, టీవీ, ఓటీటీ కి సంబంధించి ఆసక్తికర కథనాలను, సినీ ఇండస్ట్రీలోని విషయాలను, సినిమా రివ్యూలు, విశ్లేషణాత్మక కథనాలు రాయడంలో మంచి పట్టు ఉంది. క్వాలిటీ కంటెంట్‌ని అందిస్తూ, క్వాలిటీ జర్నలిజాన్ని ముందుకు తీసుకెళ్లడంలో తనవంతు కృషి చేస్తున్నారు.Read More...
Read more Photos on
click me!

Recommended Stories