హీరోల వల్లే బడ్జెట్ పెరుగుతోంది, సగం డబ్బువాళ్లే దోచేస్తున్నారు.. స్టార్ ప్రొడ్యూసర్ సంచలన కామెంట్స్

First Published Jul 7, 2024, 11:05 AM IST

స్టార్ హీరోలపై స్టార్ ప్రొడ్యూసర్ సంచలన వ్యాక్యలు చేశాడు. ఏదో విమర్షించడం కాదు.. ఆయన ఆవేదన వెల్లదించాడు.. నిర్మాతల అందరి ప్రాబ్లమ్ ను తెలిపే ప్రయత్నం చేశాడు. ఇంతకీ స్టార్ హీరోల వల్ల ప్రొడ్యూసర్లకుఏంటీ ఇబ్బంది. 
 

సినిమాల రూపు రేఖలు మారుతున్నాయి. ముక్యంగా తెలుగు సినిమాలు పాన్ ఇండియా రంగును పులిమేసుకున్నాయి. దాంతో నిర్మాత అనేవారు.. ఉన్న డబ్బుతో చిన్న సినిమా చేసేపరిస్థితి లేదు. మీడియమ్ రేంజ్ హీరోతో సినిమా చేయాలన్నీ కోట్లు కుమ్మరించాల్సిందే. అంతే కాదు అన్ని కోట్ల బడ్జెట్ లో హీరోలే సగం తన్నుకుపోతున్నారు. దాంతో నిర్మాతలు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. 

మైఖేల్ జాక్సన్ బయోపిక్‌.. సందీప్ రెడ్డి వంగా డైరెక్షన్.. హీరోగా టాలీవుడ్ స్టార్.. ఎవరు..?

ఇప్పుడు అసలే సమస్య  ఏంటంటే.. స్టార్ హీరోల రెమ్యూనరేషన్. పెద్ద సినిమా కాని.. చిన్న సినిమా కాని.. బడ్డెట్ లో ఎక్కువ భాగం హీరోల రెమ్యూనరేషన్ కే సరిపోతుందట. దాంతో ఉన్నదాంతో సినిమా చేయడం.. అది హిట్ అవ్వకపోతే.. ఆ  వెయిట్ ను నిర్మాతలే మోయాల్సిన పరిస్థితి దాంతో చాలా మంది నిర్మాతల్లో ఈ విధమైన ప్రెస్టేషన్ పెరిగిపోతుంది. ఈ విషయంలో డైరెక్ట్ గానే కామెంట్లు చేశారు  స్టార్ ప్రోడ్యూసర్ కరణ్ జోహార్. ఇంతకీ ఆయనఏమన్నారంటే..? 

భర్త మాటలు విని కోట్లు నష్టపోయిన రోజా, ఆరోజు ఆ పని చేయకుండా ఉంటే...?

Latest Videos


ఆయన ఏమన్నారంటే.. ఒకట్రెండు సినిమాలు చేసిన హీరోలు కూడా నెక్ట్స్ సినిమాల కోసం  కోటి రూపాయలకు పైగా డిమాండ్ చేస్తున్నారని, ఇది సరైనది కాదని కరణ్ జోహార్ అన్నారు. ఆయన ఫస్ట్ నుంచి ఈ విషయంలో అభ్యంతరాలు వ్యక్తం చేస్తూనే ఉన్నారు. ఈ కారణంగానే కొందరు నటీనటులు కూడా తమ సినిమాల నుంచి తప్పుకున్నారు. ఇప్పుడు ఇదే విషయంపై మరోసారి కరణ్ జోహార్ అన్నారు. 
 

ఆయన  మాట్లాడుతూ, సినిమాల కథ విషయంలో ప్రేక్షకుల టేస్ట్ మారిపోయింది. గతంలో మాదిరిలేదు. ఆడియన్స్ కూడా రకరకాల రుచులు కోరుకుంటున్నారు..  వారికి భిన్నమైన సినిమా కావాలి. కానీ సినిమా ప్రొడ్యూసర్‌గా తీయాలనుకున్నా మీ సినిమా ఏ,బీ,సీ సెంటర్లలో పర్ఫామెన్స్ చేయదు. కేవలం మల్టీప్లెక్స్‌లలోనే సినిమా నడిస్తే సరిపోదు కదా అన్నారు. అంతే కాదు రాను రాను బడ్జెట్ పెరుగుతుంది. అది నిర్మాతలకు భారంగా మారింది అన్నారు. 
 

బాలీవుడ్ లో దాదాపు 10 మంది ప్రతిభావంతులైన నటులు ఉన్నారు. వారందరికీ భారీ మొత్తంలో పారితోషికం ఇవ్వాల్సి వస్తుంది. ఆ నటీనటులకు రెమ్యూనరేషన్ చెల్లించి, ఆ తర్వాత సినిమా నిర్మాణానికి డబ్బు పెట్టి.. ఆ తర్వాత సినిమా ప్రమోషన్ కోసం కూడా కోట్లు ఖర్చు చేయాల్సి వస్తోంది.  పెట్టాలి. ఇక సినిమా బాక్సాఫీస్ వద్ద ఆశించిన స్థాయిలో హిట్ కాకపోవడమే కాకుండా అనుకున్నంత వసూళ్లు రాబట్టలేదు. 
 

35 కోట్లు అడుగుతున్న నటీనటుల సినిమాలు తొలిరోజు 3 కోట్లు కూడా వసూలు చేయడం లేదు అని అన్నారు కరణ్ జోహార్. స్టార్ హీరోలు రెమ్యూనరేషన్ విషయంలో ఆలోచించుకోవల్సిన అవసరం ఉంది అన్నారు కరణ్. అన్ని ఇండస్ట్రీలలో పరిస్థితి ఇలానే ఉంది.  మరి ఈ విషయంల ఎవరు ఏం కామెంట్లు చేస్తారో చూడాలి.  
 

‘సినిమా నిర్మాణంలో లెక్కలు అర్థంకాదు. కొన్ని ఖర్చులను ఎలా నియంత్రించాలి అనేది తెలియదు..? అయినా మేము నిర్మాతలుగా సినిమాలు చేస్తూనే ఉండాలి. ప్రొడక్షన్ విషయాల గురించి చర్చిస్తూనే ఉండాలి. ఈ సినిమా తీయడం వెనుక చాలా డ్రామా ఉంది. సినిమా కథాంశం అంతకు మించి ఉంటుంది’’ అని కరణ్ జోహార్ అన్నారు.

click me!