ఈరోజు ఎపిసోడ్ లో జానకి మాట్లాడుతూ ఇది మిమ్మల్ని బాధ పెట్టడానికి కాదు రామ గారు భవిష్యత్తులో ఎవరిని బాధ పెట్టకుండా ఉండడానికి,తనకి నేను కారణం కాకుండా ఉండడానికి అని అంటుంది. తనకి అంటే ఐపీఎస్ కాదు కేవలం రామచంద్ర భార్య భార్య మాత్రమే అని అనడంతో ఆ మాటలు విన్న మల్లిక సంతోష పడుతూ ఉంటుంది. అప్పుడు రామచంద్ర సరే జానకి గారు రెండే రెండు రోజుల్లో మిమ్మల్ని కాలేజీకి వెళ్లేలా చేయకపోతే నేను జానకి భర్తనే కాదు అంటూ శపదాలు చేస్తాడు రామచంద్ర. వారి మాటలు విన్న మల్లిక సంతోషంతో గెంతులు వేస్తూ సంతోషపడుతూ ఉంటుంది.