ఈరోజు ఎపిసోడ్ లో రామచంద్ర(rama cjandra),జానకిని అకాడమీకి తీసుకుని వెళుతూ ఉండగా ఇంతలో జ్ఞానాంబ వాళ్ళు అక్కడే ఉంటారు. అప్పుడు జ్ఞానాంబ ఈ సమయంలో ఎక్కడికి వెళ్తున్నారు రామచంద్ర జానకి గారు అలా కాసేపు బయటకు వెళ్దామని అన్నారు అందుకే వెళ్తున్నాము అని అనడంతో అంతలోనే మల్లిక(mallika) అక్కడికి వచ్చి వారిపై లేనిపోని చాడీలు చెప్పడానికి ప్రయత్నిస్తుంది. అప్పుడు గోవిందరాజులు మల్లిక పై సెటైర్లు వేస్తాడు.