గతం గుర్తు చేసుకుని `జబర్దస్త్` రష్మి కన్నీరు మున్నీరు.. రహస్యాలు బయటపెట్టిన హైపర్‌ ఆది..

Published : Jul 21, 2022, 02:45 PM ISTUpdated : Jul 21, 2022, 10:29 PM IST

యాంకర్ రష్మీ, హైపర్ ఆది, ఆటో రాంప్రసాద్, బులెట్ భాస్కర్ కలిసి పెర్ఫామ్ చేస్తున్న శ్రీదేవి డ్రామా కంపెనీ షో బుల్లితెరపై దూసుకుపోతోంది. ఈ షోకి ప్రముఖ క్యారెక్టర్ ఆర్టిస్ట్ ప్రగతి అథితిగా హాజరవుతున్నారు.

PREV
16
గతం గుర్తు చేసుకుని `జబర్దస్త్` రష్మి  కన్నీరు మున్నీరు.. రహస్యాలు బయటపెట్టిన హైపర్‌ ఆది..

యాంకర్ రష్మీ, హైపర్ ఆది, ఆటో రాంప్రసాద్, బులెట్ భాస్కర్ కలిసి పెర్ఫామ్ చేస్తున్న శ్రీదేవి డ్రామా కంపెనీ షో బుల్లితెరపై దూసుకుపోతోంది. ఈ షోకి ప్రముఖ క్యారెక్టర్ ఆర్టిస్ట్ ప్రగతి అథితిగా హాజరవుతున్నారు. ఈ వారం శ్రీదేవి డ్రామా కంపెనీలో 'అక్కా బావెక్కడ' అనే కాన్సెప్ట్ తో నవ్వించబోతున్నారు. 

26

ఇందులో రష్మీ కీలక పాత్ర పోషించనుంది. తాజాగా దీనికి సంబంధించిన ప్రోమో విడుదలయింది. తనకి పెళ్లి కుదిరింది అని.. కాబట్టి లేడీస్ బ్యాచిలర్ పార్టీ ఇస్తున్నాను అని రష్మీ స్కిట్ లో భాగంగా ప్రకటిస్తుంది. దీనితో లేడి కమెడియన్లు హాట్ డ్యాన్స్ తో మోతెక్కిస్తారు. 

36

తన పెళ్లి ఎలా జరగబోతోందో వివరిస్తూ రష్మీ ఎప్పటిలాగే తెలుగు పాడాలని తప్పుగా పలుకుతుంది. ఆకాశమంత పంది, అంగవంగ అంటూ చెబుతుంది. దీనితో హైపర్ ఆది, రాంప్రసాద్ ఇద్దరూ రష్మీ తెలుగుపై సెటైర్లు వేస్తారు. ఆయా తర్వాత రష్మీ ప్రేమలో విఫలం అయిన ఏఎన్నార్ లాగా మందు సీసాతో పెర్ఫామ్ చేస్తుంది. దీనిపై కూడా హైపర్ ఆది జోకులు వేస్తాడు. 

46

ఇక రష్మీ తన లైఫ్ లో అనుభవించిన కష్టాలని స్కిట్ రూపంలో తెలియజేసే ప్రయత్నం చేశారు. ఈ స్కిట్ లో బుల్లెట్ భాస్కర్, అతడి భార్య రష్మీ తల్లిదండ్రులుగా నటించారు. రష్మీ పాత్రలో భానుశ్రీ నటించింది. రష్మీ చిన్నతనంలోనే తల్లిదండ్రులు ఇద్దరూ విడిపోతారు. రష్మీని వాళ్ళ అమ్మే పెంచుతుంది. 

56

ఇక వయసొచ్చాక తాను సినీ ఇండస్ట్రీకి వెళతానని రష్మీ చెబుతుంది. దీనితో వాళ్ళ అమ్మ కూడా నీకు మంచి చెడు తెలుసు. కాబట్టి నేను అడ్డు చెప్పను.. నీకు ఏం చేయాలనిపిస్తే అది చేయి అని చెబుతుంది. కెరీర్ ఆరంభంలో షూటింగ్స్ కి ఆలస్యం కావడం వల్ల హాస్టల్ కి లేటుగా వెళుతుంది. 

66

అప్పటికే హాస్టల్ మూసేసి ఉంటారు. దీనితో చుట్టూ చీకటిలో ఏడుస్తూ రష్మీ పడ్డ కష్టాలని చూపించారు. తన లైఫ్ ని స్కిట్ లో చూసుకున్న రష్మీ నిజంగానే కన్నీరు మున్నీరుగా ఏడుస్తుంది. ఈ క్రమంలో హైపర్ ఆది రష్మీపై ప్రశంసలు కురిపించారు. తనకి తెలుగు రాదు అనే స్థాయి నుంచి తెలుగు వారంతా రష్మీ గురించి మాట్లాడుకునే స్థాయికి ఎదిగింది అని హైపర్ ఆది ప్రశంసించాడు. 

Read more Photos on
click me!

Recommended Stories