లవర్ బాయ్ ఇమేజ్ నుంచి బయట పడటానికి నాగచైతన్య తంటాలు, చైతూకి స్టార్ హీరో స్టేటస్ దక్కుతుందా..?

Published : Jul 21, 2022, 02:26 PM IST

లవర్ బాయ్ ఇమేజ్ నుంచి బయట పడటానికి ప్రయత్నిస్తున్నాడు నాగచైతన్య. మాస్ హీరో అతనిపించుకుని స్టార్ డమ్ సంపాదించాలని చూస్తున్నాడు. ఇంతకీ చైతూ ప్రస్తుతం స్టార్ హీరో కాదా..? దిల్ రాజు కామెంట్ వెనుకు విషయం ఏంటీ..? 

PREV
18
లవర్ బాయ్ ఇమేజ్ నుంచి బయట పడటానికి నాగచైతన్య తంటాలు,  చైతూకి స్టార్ హీరో స్టేటస్ దక్కుతుందా..?

ప్రస్తుతం యంగ్ హీరోలలో మాస్ ఇమేజ్ మాయ పెరిగిపోతోంది. ముఖ్యంగా  పోలీస్ పాత్ర మోజు పెరిగిపోతోంది. ఫెయిల్యూర్స్ ఫేస్ చేస్తున్నా కాని.. మాస్ ఇమేజ్ పై  మనసుపారేసుకుంటున్నారు. ముఖ్యంగా అక్కినేని హీరో నాగచైతన్య మరోసారి మాస్ ఇమేజ్ కోసం పాకులాడుతున్నాడు. ఇప్పటి వరకూ లవర్ బాయ్ ఇమేజ్ తోనే ఉన్న యంగ్ హీరో ఎలాగైనా ఆ ఇమేజ్ పొగోట్టుకోవాలని ప్రయత్నిస్తున్నాడు. 
 

28

నాగచైతన్య లవర్ బాయ్ ఇమేజ్ లో లవ్ స్టోరీస్ చేసినప్పుడే సినిమాలు సక్సెస్ అయ్యాయి. ఆయనకు మాస్ ఇమేజ్ సూట్ అవ్వలేదు.  ఆటోనగర్ సూర్య లాంటి సినిమాలతో మాస్ ఇమేజ్ తెచ్చుకోవాలి ని తెగ ప్రయత్నం చేశాడు. కాని అవి సక్సెస్ అవ్వలేదు. 

38

చైతూ ప్రేమ కథలతో తెరకెక్కిన సినిమాలతోనే సూపర్ సక్సెలు కొట్టాడు. ఏం మాయ చేశావే, నుంచి రీసెంట్ గా లవ్ స్టోరీ వరకు హిట్ కొడుతూ వచ్చాడు. అయితే ఈ సినిమాలతో నాగచైతన్యకు హిట్లు పడుతున్నాయి కాని స్టార్ డమ్ మాత్రం రావడంలేదు అన్న టాక్ ఉంది. మాస్ హీరోగా అయితేనే స్టార్ డమ్ సాధిస్తాము అనుకున్నాడో ఏమో చైతూ మాస్ ఇమేజ్ వైపు వెళ్తున్నాడు. 

48

రామ్ లాంటి హీరోలు కూడా ఇదే ఫార్ములా అప్లై చేశారు. చాక్లెట్ బాయ్ గా ఉన్న రామ్ ఇస్మార్ట్ శంకర్ సినిమాతో మాస్ ఇమేజ్ తో పాటు కాస్తో కూస్తో స్టార్ డమ్ సంపాధించాడు. కాకపోతే ఆతరువాత రెడ్, రీసెంట్ గా రామ్ ది వారియర్  సినిమాలలో మాస్ హీరోగా వచ్చినా.. సక్సెస్ కాలేక పోయాడు. 
 

58

ఇక నాగచైతన్య కూడా త్వరలో పవర్ ఫుల్ పోలీస్ పాత్రలో నటించబోతున్నట్టు ప్రకటించాడు. ఇప్పటి వరకూ చైతూ పోలీస్ పాత్ర చేసింది లేదు. వెంకట్ ప్రభు దర్శకత్వంలో పోలీస్ ఆఫీసర్ పాత్రనే చేస్తున్నట్టుగా తాజా ఇంటర్వ్యూలో చైతూ చెప్పాడు. ఇలా అయినా స్టార్ డమ్ సాధించవచ్చు అన్న్ ఆశలో ఉన్నాడు. 

68

ఈ సినిమాలో తన పాత్ర చాలా పవర్ఫుల్ గా ఉంటుందని అన్నాడు నాగచైతన్య.. సాధారణంగా చైతూని సాఫ్ట్ రోల్స్ లో చూడటానికే ఆడియన్స్ ఎక్కువగా ఇష్టపడతారు. మరి పవర్ ఫుల్ పోలీస్ ఆఫీసర్ పాత్రలో ప్రేక్షకులు ఆయనను ఎలా రిసీవ్ చేసుకుంటారనేది క్వాశ్చన్ మార్క్. 

78

అయితే అటు దిల్ రాజు కూడా పెద్ద హీరో సినిమాలకు టికెట్ రెట్లు ఒక రకంగా.. చిన్న హీరోల సినిమాలు ఒక రకంగా ఉంటాయంటూ.. వ్యాఖ్యానించాడు. నాగచైతన్య సినిమాను చిన్న హీరోల లిస్ట్ లో వేసేశాడు. దాన్ని బట్టి చైతూను స్టార్ హీరోగా చూడటంలేదు అనే అభిప్రాయం వ్యాక్తం అవుతోంది. 
 

88

అందుకే ప్రయోగాలు చేసి అయినా.. ఎలాగైనా మాస్ హీరో ఇమేజ్ తో స్టార్ డమ్ సాధించాలి అనేది చైతూ టార్గెట్ గా పెట్టుకున్నట్టు తెలుస్తోంది. మరి ఈ పవర్ ఫుల్ పోలీస్ పాత్ర నాగచైతన్యకు స్టార్ ఇమేజ్ తెచ్చిపెడుతుందా..? లేదు డిజాస్టర్స్లిస్ట్ లోకి వెళ్తుందా..? చైతూ అనుకున్నట్టు స్టార్ ఇమేజ్ సాధిస్తాడా లేదా చూడాలి. 
 

Read more Photos on
click me!

Recommended Stories