ఈరోజు ఎపిసోడ్ ప్రారంభంలోనే... ఇంట్లో వాళ్ళందరూ వినాయకుడి పూజ కి సిద్ధమవుతూ ఉంటారు. అప్పుడు జ్ఞానాంబ జానకి తో,నేను నిన్ను బరువు బాధ్యతలు మోయమన్నాను అని నువ్వు భయపడాల్సిన అవసరం లేదు, మేమందరం కూడా ఉన్నాము కదా అని ధైర్యం ఇస్తుంది. ఆ తర్వాత సీన్లో జెస్సీ వాళ్ళ తల్లిదండ్రులు జానకికి ఎంత ఫోన్ చేసినా జానకి ఫోన్ ఎత్తదు అప్పుడు జెస్సి వాళ్ళ నాన్న, ఆ అమ్మాయి మనల్ని మాటలతో మోసం చేసింది. ఇప్పుడు మనం పోలీస్ స్టేషన్ కి వెళ్ళక తప్పదు మొన్న ఇంటికి వెళ్లి మాట్లాడుంటే అయిపోయేది. ఇప్పుడు మనల్ని ఇంత మోసం చేసిన తర్వాత పోలీసులే దిక్కు అని అంటాడు. అప్పుడు జెస్సి, వద్దు నాన్న ఈరోజు పండుగ కదా అక్క అందులో బిజీ గా ఉండుంటది అని అనగా,