#KrishnamRaju:కృష్ణంరాజు మృతి... ఆర్జీవీ షాకింగ్ ట్వీట్లు, సిగ్గు..సిగ్గు...ఉమ్మేసుకోవటమే

First Published Sep 12, 2022, 11:01 AM IST

  ప్రతీ విషయానికి తనదైన శైలిలో స్పందించే రామ్ గోపాల్ వర్మ  ఈసారి ....మరోసారి ట్వీట్స్ తో వార్తల్లో నిలిచారు. ఆ ట్వీట్స్ కు కొందరు సపోర్ట్ గా నిలుస్తూంటే మరికొందరు వోడ్కా ట్వీట్స్ అంటూ కొట్టిపారేస్తున్నారు. ఇంతకీ వర్మ ఏమి ట్వీట్ చేసారంటే...


రెబెల్ స్టార్ కృష్ణంరాజు ఆదివారం తెల్లవారుజామున కన్నుమూశారు. హైదరాబాద్ గచ్చిబౌలిలోని ఏఐజీ ఆస్పత్రిలో చికిత్స పొందుతూ తుదిశ్వా స విడిచారు.  సోమవారం మధ్యాహ్నం కృష్ణంరాజు అంత్యక్రియలు జరుగుతాయి అని కుటుంబ సభ్యులు ప్రకటించారు. 


ఇదిలా ఉంటే ప్రతీ విషయానికి తనదైన శైలిలో స్పందించే రామ్ గోపాల్ వర్మ  ఈసారి ....మరోసారి ట్వీట్స్ తో వార్తల్లో నిలిచారు. ఆ ట్వీట్స్ కు కొందరు సపోర్ట్ గా నిలుస్తూంటే మరికొందరు వోడ్కా ట్వీట్స్ అంటూ కొట్టిపారేస్తున్నారు. ఇంతకీ వర్మ ఏమి ట్వీట్ చేసారంటే...

భక్త కన్నప్ప, కటకటాల రుద్రయ్య, బొబ్బిలి బ్రహ్మన్న, తాండ్ర పాపారాయుడు లాంటి అత్యంత గొప్ప చిత్రాలని అందించిన మహా నటుడు, గొప్ప నిర్మాత కోసం ఒక్క రోజు కూడా షూటింగ్ ఆపలేని అత్యంత స్వార్ధపూరిత తెలుగు సినిమా పరిశ్రమ కి నా జోహార్లు. సిగ్గు! సిగ్గు!

కృష్ణగారికి,మురళీమోహన్ గారికి, చిరంజీవిగారికి , మోహనబాబుగారికి, బాలయ్యకి , ప్రభాస్ కి,మహేష్,కల్యాణ్కి నేను ఈ విషయం మీద మనవి చేసేదేంటంటే రేపు ఇదే దుస్థితి మీలో ఎవరికీ కూడా తప్పదు. ఒక మహోన్నత కళాకారుడికి ఇవ్వలేని మహోన్నత వీడ్కోలు మన మీద మనమే ఉమ్మేసుకోవడం లాంటిది.

కృష్ణం రాజు 1974లో 17 సినిమాలను రిలీజ్ చేశారు


నేను కృష్ణగారికి, మురళీమోహన్ గారికి, మహేష్ బాబు, పవన్ కళ్యాణ్, మోహన్ బాబు, చిరంజీవి, బాలయ్యకి , ప్రభాస్ కి ఈ విషయం మీద మనవి చేసేదేంటంటే రేపు ఇదే దుస్థితి మీలో ఎవరికీ కూడా తప్పదు. ఒక మహోన్నత కళాకారుడికి ఇవ్వలేని మహోన్నత వీడ్కోలు మన మీద మనమే ఉమ్మేసుకోవడం లాంటిది.

మనసు లేకపోయినా ఓకే. కనీసం మన చావుకి విలువ ఉండాలంటే పోయిన కృష్ణంరాజుగారి లాంటి పెద్దమనిషికి విలువ ఇద్దాం .. కనీసం రెండు రోజులు షూటింగ్ ఆపుదాం. డబ్బు ఎక్కువ ఖర్చు అయిపోతోంది అని నెలరోజులు షూటింగ్ ఆపేసిన పరిశ్రమ మనది

krishnamraju birthday celebrations

మన చావుకి విలువ ఉండాలంటే పోయిన కృష్ణంరాజుగారి లాంటి పెద్దమనిషికి విలువ ఇద్దాం .. కనీసం రెండు రోజులు షూటింగ్ ఆపుదాం అంటూ రామ్ గోపాల్ వర్మ వరస ట్వీట్స్ చేసారు. ఇప్పుడీ ట్వీట్స్ వైరల్ అవుతున్నాయి. 


ఇక కార్డియాక్ అరెస్ట్ వల్లే కృష్ణంరాజు మృతి చెందినట్లు ఆసుపత్రి ఒక ప్రకటన విడుదల చేసింది.   ‘‘82 ఏళ్ల కృష్ణంరాజు మధుమేహం, కోవిడ్ అనంతర సమస్యల వల్ల కార్డియాక్ అరెస్ట్ కావడంతో చనిపోయారు. చాలా కాలంగా గుండె సంబంధిత సమస్యతో బాధపడుతున్నారు. గతేడాది ఆయన కాలికి శస్త్రచికిత్స జరిగింది. దీర్ఘకాలంగా మూత్రపిండాలు, ఊపిరితిత్తుల సమస్యలూ ఉన్నాయి. కోవిడ్ సమస్యతో గత నెల 5వ తేదీన ఆస్పత్రిలో చేరారు. కిడ్నీ పనితీరు పూర్తిగా దెబ్బ తినడంతో ఆస్ప త్రిలో చేరినప్పటి నుంచి వెంటిలేటర్ పై చికిత్స అందించాం. ఆదివారం తెల్లవారుజామున 3.16గం టలకు తీవ్రమైన గుండెపోటు రావడంతో కృష్ణంరాజు తుదిశ్వాస విడిచారు.” – ఇది హాస్పిటల్ ప్రకటన సారాంశం.

click me!