అప్పుడు జ్ఞానాంబ ,ఈ సంవత్సరానికి చిన్న కోడలిని ,చిన్న కొడుకుని పీటల మీద కూర్చోబెట్టండి. అని పంతులు గారిని అడగగా, ఆచారం ప్రకారం పెద్దవాళ్ళే కూర్చోవాలి అని చెబుతారు పంతులుగారు.కానీ మల్లికా మాత్రం ఆచారాలు మననించే పుట్టుకొచ్చాయి, పైనుంచి ఊడిపడలేదు కదా అని చెప్పి తన భర్తని బలవంతంగా తెచ్చి పీటల మీద కూర్చుంటుంది. అప్పుడు పూజారి మల్లికని కంకణం కట్టుకోమని అంటారు.