Janaki Kalaganaledu: జ్ఞానాంబ, గోవిందా రాజుల ముందు జానకి, రామచంద్ర రొమాన్స్.!

Published : Jul 18, 2022, 01:28 PM IST

Janaki Kalaganaledu: బుల్లితెరపై ప్రసారమవుతున్న జానకి కలగనలేదు (Janaki Kalaganaledu) సీరియల్ ప్రేక్షకులను బాగా ఉంటుంది. మంచి కుటుంబ కథతో ఈ సీరియల్ కొనసాగుతుంది. ఇక ఈ రోజు జులై 18 ఎపిసోడ్ లో ఏం జరిగిందో తెలుసుకుందాం.

PREV
17
Janaki Kalaganaledu: జ్ఞానాంబ, గోవిందా రాజుల ముందు జానకి, రామచంద్ర రొమాన్స్.!

 ఈరోజు ఎపిసోడ్ లో జానకి(janaki) రామచంద్రను పూలు తెచ్చారా అని అడగగా రామచంద్ర తేలేదు అని చెప్పడంతో జానకి వచ్చేటప్పుడు తీసుకొని రమ్మని చెప్పాను కదా అయినా భర్త ఇంటికి వచ్చేటప్పుడు భార్య కోసం పూలు తీసుకుని రావాలి అని తెలియదా అని అంటుంది. అప్పుడు రామచంద్ర అకాడమీ కి వెళ్ళాలి బయలుదేరమని చెప్పగా నేను వెళ్ళను నువ్వు పూలు తీసుకొని రాలేదు అని అనడంతో రామచంద్ర(rama chandra)బయలుదేరమని చెబుతాడు.
 

27

జానకి (janaki)మాత్రం నేను రాను అంటే రాను ఎందుకంటే ఈరోజు మా అకాడమీకి సెలవు అని అనడంతో రామచంద్ర సరే అని అంటాడు. ఆ తర్వాత జానకి రామచంద్ర కు చేతిలో పూలు పెట్టి జడలో పెట్టమని చెబుతుంది. అప్పుడు రామచంద్ర పూలు పెట్టిన తర్వాత జానకి ఒకసారి వాసన చూడమని చెబుతుంది. అప్పుడు రామచంద్ర(rramachandra) చూస్తూ ఉండగా జానకి ఇటువైపు తిరిగి రామచంద్ర కలలోకి కళ్ళు పెట్టి చూస్తూ ఉంటుంది.
 

37

 అప్పుడు జానకి (janaki)రామచంద్ర(rama chandra)ఒకరి కళ్ళల్లో ఒకరి కళ్ళు పెట్టుకొని చూస్తూ మాట్లాడుతూ ఉండగా అప్పుడు రామచంద్ర ఉలిక్కిపడి స్నానం చేయాలి అంటూ పరుగులు తీస్తాడు. ఆ తర్వాత జానకి రామచంద్ర ఇద్దరు నిద్రపోతూ ఉండగా అప్పుడు జానకి మాత్రం జానకి వైపు చూస్తూ ఉండగా రామచంద్ర కూడా మేలుకొని ఏం జరుగుతుందో అని చూస్తూ ఉంటాడు. జానకిని చూసి ఆనంద పడుతూ ఉంటాడు రామచంద్ర.
 

47

మళ్లీ జానకి(Janaki)కి ముద్దు పెట్టాలి అనే దగ్గరికి వెళ్లి వద్దు అని అనుకుంటూ ఉంటాడు. ఆ తర్వాత జానకి గిద్ద లేవుగా ఇద్దరు ఒకరి కళ్ళల్లో ఒకరి కళ్ళు పెట్టి చూసుకుంటారు. అప్పుడు జానకి రామచంద్ర ప్రవర్తన చూసి నవ్వుతూ ఉంటుంది. ఇక మరుసటి రోజు ఉదయం వెన్నెల,అఖిల్ ఎదురు భోజనం చేస్తూ ఉండగా ఇంతలో అక్కడికి మల్లిక(mallika) వస్తుంది. అప్పుడు జానకిని ఎలా అయినా ఇరికించాలి అని ప్లాన్ వేస్తుంది.
 

57

అప్పుడు వెన్నెల, అఖిల్(akhillతో మాట్లాడుతూ ఉండగా ఇంతలోనే అక్కడికి జ్ఞానాంబ దంపతులు వస్తారు. అప్పుడు మల్లిక జానకిపై చాడీలు చెప్పగా వెంటనే జ్ఞానాంబ సీరియస్ అవుతుంది. అప్పుడు మల్లిక తిట్టినా కూడా పర్లేదు కానీ జానకిని కాలేజీ నుంచి ఫోన్ వచ్చిన విషయం గురించి అడగండి అని రెచ్చగొడుతుంది. అప్పుడు గోవిందరాజులు(govindarajulu)ఎందుకమ్మా పొద్దున్నే పెట్రోల్ పొసే కార్యక్రమం మొదలు పెట్టావు అంటూ మల్లికా పై మండి పడతాడు. 
 

67

అప్పుడు మల్లిక గోవిందరాజుకీ ఎదురు చెప్పగా ఇంతలో జ్ఞానాంబ(jnanamba)సీరియస్ అవుతుంది. ఇందులో విష్ణువు వచ్చి మల్లికను తిట్టి అక్కడి నుంచి వెళ్లిపోతాడు. ఇంతలోనే అక్కడికి జానకి, రామచంద్ర అక్కడికి రావడంతో మల్లిక కూడా వెళ్లి భోజనానికి కూర్చుంటుంది. ఆ తర్వాత భోజనం చేస్తూ రామచంద్ర జానకి(janaki) ఇద్దరు సరసాలు ఆడుకుంటూ ఉంటారు. అప్పుడు రామచంద్ర మాత్రం జానకి చేసే పనికి టెన్షన్ పడుతూ ఉంటాడు.
 

77

 అప్పుడు ఇద్దరూ సైలెంట్ గా మాట్లాడుతూ మల్లిక(mallika)మాత్రం ఏదో జరుగుతుంది అని అనుకుంటూ ఉంటుంది. అప్పుడు జానకి కాల్ టచ్ చేస్తూ ఉండగా ప్లీజ్ జానకి గారు అని అంటూ ఉంటాడు రామచంద్ర. ఇంతలోనే జానకి,రామచంద్ర నడుము గిల్లడంతో రామచంద్ర(rama chandra)బైటికి చెప్పుకోలేక టెన్షన్ పడుతూ ఉంటాడు జానకి మాత్రం నవ్వుతూ ఉంటుంది. ఇప్పుడు మల్లికా మాత్రం తెగ ఆలోచిస్తూ ఉంటుంది. అప్పుడు జానకి మళ్ళీ రామచంద్రను గిల్లడానికి ప్రయత్నిస్తుంది.

click me!

Recommended Stories