కొడాలి నాని చెప్పడంతో ఎన్టీఆర్ నన్ను వదిలించుకోవాలనుకున్నాడు.. కానీ చివరికి, వివి వినాయక్ కామెంట్స్

Published : Jul 18, 2022, 12:29 PM IST

ఎన్టీఆర్ తో మాస్ డైరెక్టర్ వివి వినాయక్ ఆది, సాంబ, అదుర్స్ లాంటి చిత్రాలు చెశారు. వీటిలో ఆది, అదుర్స్ అద్భుతమైన విజయాలుగా నిలిచాయి.

PREV
16
కొడాలి నాని చెప్పడంతో ఎన్టీఆర్ నన్ను వదిలించుకోవాలనుకున్నాడు.. కానీ చివరికి, వివి వినాయక్ కామెంట్స్

యంగ్ టైగర్ ఎన్టీఆర్ సినీ ప్రయాణం ఎలా మొదలైందో అందరికి తెలిసిందే. తొలి చిత్రం 'నిన్ను చూడాలని' నిరాశ పరిచినప్పటికీ ఆ తర్వాత తారక్ తిరుగులేని హీరోగా దూసుకుపోయాడు. స్టూడెంట్ నెంబర్ 1, ఆది, సింహాద్రి చిత్రాలు బాక్సాఫీస్ ని షేక్ చేశాయి. ఇప్పుడు ఎన్టీఆర్ టాలీవుడ్ లో తిరుగులేని మాస్ హీరో. 

 

26

ఎన్టీఆర్ తో మాస్ డైరెక్టర్ వివి వినాయక్ ఆది, సాంబ, అదుర్స్ లాంటి చిత్రాలు చెశారు. వీటిలో ఆది, అదుర్స్ అద్భుతమైన విజయాలుగా నిలిచాయి. సింహాద్రి కంటే ముందే ఎన్టీఆర్ కి ఆది చిత్రం మాస్ ఫాలోయింగ్ తెచ్చిపెట్టింది. వివి వినాయక్ ఆది చిత్రం విషయంలో జరిగిన ఆసక్తికర సంఘటనని తాజాగా ఓ ఇంటర్వ్యూలో పంచుకున్నారు. 

36

నేను డైరెక్టర్ కాక ముందు సాగర్ గారికి అసిస్టెంట్ డైరెక్టర్ గా పనిచేస్తున్నా. అప్పట్లో టాలీవుడ్ లో రాఘవేంద్ర రావు గారికి అసిస్టెంట్ అంటే వెంటనే అవకాశాలు వచ్చేవి. కానీ సాగర్ గారికి అసిస్టెంట్ అంటే కొంచెం ఆలోచించేవాళ్ళు. నేను కూడా డైరెక్టర్ అవుదామని ఒక ప్రేమ కథ రాసుకున్నా. అనుకోకుండా ఫారెన్ లో ఎన్టీఆర్ ని కలిశాను. 

46

నల్లమలపు బుజ్జి ద్వారా ఎన్టీఆర్ కి కథ చెప్పే అవకాశం వచ్చింది. 20 నిమిషాలు టైం.. వెంటనే కథ చెప్పేయాలి అని ఎన్టీఆర్ అన్నారు. కథ చెప్పగానే ఎన్టీఆర్ కి నచ్చింది. కానీ ఇంతలో మా మధ్యలోకి మరో క్యారెక్టర్ ఎంటర్ అయింది. అది ఎవరో కాదు కొడాలి నాని. ఈ ప్రేమ కథలు వర్కౌట్ కావు రిజెక్ట్ చేసేయ్ అని కొడాలి నాని ఎన్టీఆర్ కి చెప్పాడు. కొడాలి నాని ఎన్టీఆర్ కి బాగా క్లోజ్. 

56

కొడాలి నాని చెప్పడంతో నన్ను ఎలా వదిలించుకోవాలా అని ఎన్టీఆర్ తడబడుతూ ఉన్నాడు. దీనితో నేను వెంటనే బాబు.. ఈ కథ ప్రాబ్లంగా ఉంటే 2 రోజులు టైం ఇవ్వండి. మరో కథ చెబుతా అని అడిగా. దీనికి ఎన్టీఆర్ ఓకె అన్నాడు. ఎలాగైనా సినిమా చేయాలి అని డిసైడ్ అయి ఉన్నా. నా అవసరం అలాంటిది. 

66
Kodali Nani

అప్పటికి కేవలం రెండే సన్నివేశాలు మైండ్ లో ఉన్నాయి. ఆ రెండు సీన్స్ తో ఆది కథని రెండు రోజుల్లో ఫినిష్ చేశా. ఈ కథ చెప్పగానే ఎన్టీఆర్, కొడాలి నాని అందరూ ఓకె చెప్పేశారు. కొన్ని అద్భుతమైన కథలు అలా వెంటనే పుట్టేస్తాయి అని వినాయక్ అన్నారు. పోకిరి చిత్రం అందుకు మరో ఉదాహరణ. పోకిరి కథని పూరి ఒకరోజులోనే ఫినిష్ చేశారు.  పూరి జగన్నాధ్ గారి స్పీడ్ అందుకోవడం ఎవరి వల్లా కాదు అని వినాయక్ ప్రశంసలు కురిపించారు. 

click me!

Recommended Stories