Janaki Kalaganaledu: మీకు మనవడిని ఇస్తాను అత్తయ్య గారు.. జ్ఞానాంబకు మాట ఇచ్చిన జానకి!

Published : Jun 29, 2022, 12:58 PM IST

Janaki Kalaganaledu: బుల్లితెరపై ప్రసారమవుతున్న జానకి కలగనలేదు (Janaki Kalaganaledu) సీరియల్ మంచి పరువుగల కుటుంబ నేపథ్యంలో కొనసాగుతూ ప్రేక్షకులను బాగా ఆకట్టుకుంటుంది. ఇక ఈ రోజు జూన్ 29 ఎపిసోడ్ లో ఏం జరిగిందో తెలుసుకుందాం.  

PREV
16
Janaki Kalaganaledu: మీకు మనవడిని ఇస్తాను అత్తయ్య గారు.. జ్ఞానాంబకు మాట ఇచ్చిన జానకి!

 ఈరోజు ఎపిసోడ్ లో జ్ఞానాంబ(jnanamba)ఇంటికి వారసుడు ఇవ్వడానికి మీకు ఏమైనా కారణాలు ఉంటే చెప్పండి కన్నతల్లిలాగా అర్థం చేసుకోగలను అనడంతో వెంటనే జానకి ఈ ఇంటికి వారసుడు నేను ఇస్తాను అంటూ జ్ఞానాంబకు మాట ఇస్తుంది. ఆ మాటకు రామచంద్ర షాక్ అవడంతో ఇంట్లో అందరూ సంతోషంగా ఫీల్ అవుతూ ఉంటారు. అప్పుడు మల్లిక(mallika) కూడా నేను కూడా వారసుడిని ఇస్తాను అంటూ జ్ఞానాంబ కు మాట ఇస్తుంది.
 

26

అప్పుడు జ్ఞానాంబ ఒక విషయం గురించి మాట్లాడుతూ మనకు ఒక ప్రదేశంలో స్థలం ఉంది ఎవరైతే ముందుగా వారసుడిని నా చేతిలో పెడతారో వారికి రాసిస్తాను అని అనడంతో మల్లిక(mallika) ఆనంద పడుతూ లెక్కలు కూడా వేసుకుంటుంది. ఆ తర్వాత రామచంద్ర జానకి(janaki)ని లోపలికి తీసుకుని వెళ్లి మీ చదువు గురించి మర్చిపోయి మాట ఇచ్చారా అని అనడంతో అప్పుడు జానకి కోడలిగా నా బాధ్యత అంటూ అత్తయ్య మనసులో చాలా బాధ ఉంది.
 

36

 అది తీర్చే బాధ్యత నాది అంతేకాకుండా తాను గట్టి శపథం  కూడా చేసింది అని అనడంతో రామచంద్ర (rama chandra)కాస్త దిగాలుగా కనిపిస్తాడు. అప్పుడు జానకి చదువును పక్కన పెట్టలేదు రెండు బాధ్యతలు చూసుకుంటాను అని చెబుతుంది. ఆ తర్వాత ఆ మరుసటిరోజు అందించే అసైన్మెంట్ ఉండటంతో అది వాయిదాల వల్ల పూర్తి కాకపోవడంతో రోజు రాత్రి అంతా పూర్తి చేస్తాను అని అంటుంది జానకి(janaki).
 

46

 ఒకవైపు ఆనందంగా మల్లిక(mallika) తినుకుంటూ పాటలు పాడుతూ ఉంటుంది. ఇంతలో విష్ణు అక్కడికి వచ్చి తనతో వేరే కాపురం పెట్టే వరకు పిల్లలు కనను అన్నావు కదా మరి ఇప్పుడు ఎలా మాట ఇచ్చావు అని అడగడంతో వెంటనే మల్లికా వచ్చే డబ్బు కోసం మాట ఇచ్చాను అని అంటుంది. మరొకవైపు రామచంద్ర జానకి(janaki) ఐపీఎస్ చదువు కోసం అడగటంతో దానికి అలా ఏమీ కాదు నేను చూసుకోగలను మీరు టెన్షన్ పడకండి అని చెబుతు ఉండగా ఇంతలో జ్ఞానాంబ వస్తుంది.
 

56

అప్పుడు జ్ఞానాంబ (jnanamba)ఏం జరిగింది అని అనగా అప్పుడు మల్లిక ఏదో ఒక సాకు చెప్పి తప్పించుకుంటుంది. ఇంతలో లడ్డూలు ఆర్డర్ ఇచ్చిన అతను లడ్డు తీసుకోవడానికి జ్ఞానాంబ ను పిలవగా నాకు ఈ విషయం తెలియదు అని అనగా మీ చిన్న కోడలు కి చెప్పాను అని అనడంతో అప్పుడు మల్లిక(mallika) ఆ విషయం గురించి చెప్పడం మర్చిపోయాను అని అనగా జ్ఞానాంబ, మల్లికా పై గట్టిగా అరుస్తుంది.
 

66

అప్పుడు వెంటనే జానకి(janaki) ఆ లడ్డూలు ఉదయం వరకు చేసి పెడతాను అని అతడికి మాట ఇస్తుంది. అందరూ కలిసి పని చేస్తే పూర్తవుతుంది అని ఇంట్లో వాళ్లందరికీ చెబుతుంది. అప్పుడు రామచంద్ర మళ్లీ జానకిని లోపలికి తీసుకొని వెళ్లి ఏదో ఏది ఉంది అన్నారు కదా మరి లడ్డూలు ఎలా చేస్తారు అనగా నేను రెండు చేయగలను అని అంటుంది. అలాగే అత్తయ్య ఇచ్చిన మాటను కూడా పూర్తి చేస్తాను అనడంతో రామచంద్ర(rama chandra)సిగ్గుపడుతూ ఉంటాడు.

click me!

Recommended Stories