ఇక తర్వాత జ్ఞానాంబ (Jnanaamba) పూజారి తో తన కొడుకు కోడలు చేతులమీదుగా కులదైవ పూజను ప్రారంభిస్తుంది. ఇక ఆ పూజను జానకి, రామచంద్రలు ఆనందంగా పూర్తి చేస్తారు. ఇక అత్తా కోడలు ఇద్దరూ కలిసి కోనేరు దగ్గరికి వెళ్తారు. ఈ క్రమంలో జ్ఞానాంబ, జానకి (Janaki) తో ' ఏం జానకి నా కొడుకుని నా నుంచి దూరం చేయాలి అనుకుంటున్నావ.. నా కొడుక్కి నాకు మధ్య మనస్పర్థలు వచ్చి సృష్టించాలి అనుకుంటున్నావా' అని అంటుంది.