అలాగే వెబ్ సిరీస్ లు, లేడీ ఓరియెంటెడ్ చిత్రాలు చేస్తున్నారు. ఆమె ప్రధాన పాత్రలో సుందరి చిత్రం తెరకెక్కింది. తమిళంలో పిశాచి 2లో పూర్ణ నటిస్తున్నారు. డిజిటల్ రంగం అత్యంత వేగంగా మార్కెట్ విస్తరించుకుంటూ పోతుండగా, అక్కడ మంచి అవకాశాలు పూర్ణ ఖాతాలో వచ్చి చేరుతున్నాయి.కన్నమూచి అనే సిరీస్ తో పాటు నవరస తమిళ్ వెబ్ సిరీస్ లలో పూర్ణ నటించారు. నవరస ఆంథాలజీ సిరీస్ లో సూర్య, ప్రకాష్ రాజ్, రేవతి, యోగిబాబు, సిద్దార్థ్, విజయ్ సేతుపతి వంటి స్టార్స్ నటించిన విషయం తెలిసిందే.