తనను ఇంట‌ర్వ్యూ చేయ‌డానికి వ‌చ్చిన యాంక‌ర్ నే పెళ్లి చేసుకున్న బిచ్చ‌గాడు హీరో

Published : Sep 01, 2022, 12:45 PM IST

తెలుగు ప్రేక్షకులకు  బిచ్చ‌గాడు సినిమాతో దగ్గరయ్యాడు   విజ‌య్ ఆంటోని.  చాలా మంది అభిమానులు అయ్యారు. ఆ త‌ర‌వాత త‌న సినిమాల‌న్నీ తెలుగులో డ‌బ్ చేయ‌డంలో.. టాలీవుడ్ లో కూడా హీరో మెటీరియర్ అని నిరూపిచుకున్నారు విజయ్ ఆంటోనీ. రీసెంట్ గా ఓ ఇంటర్వ్యూలో విజయ్ తన పెళ్ళి సీక్రేట్ తో పాటు.. తాను పడిన కష్టాల గురించి వివరించారు. 

PREV
17
తనను ఇంట‌ర్వ్యూ చేయ‌డానికి వ‌చ్చిన యాంక‌ర్ నే పెళ్లి చేసుకున్న బిచ్చ‌గాడు హీరో

రీసెంట్ గా జరిగిన ఓ ఇంటర్వ్యూలో విజయ్.. తన పెళ్ళి గురించి... చిన్నప్పటి నుంచి తను అనుభవించిన కష్టాల గురించి విరించారు.  విజయ్  ఆంటోనీ వివాహం  అప్పట్లో సంచలనం సృష్టించింది. ఫాతిమా అనే ఒక జర్నలస్టుని ఆయన ప్రేమించి పెళ్ళాడాడు.  విజయ్ ని ఇంటర్వూ చేయడానికి వచ్చిన  ఆమెతో ప్రేమలో పడి 2006 లో ప్రేమ వివాహం చేసుకున్నాడు . వీరికి లారా అనే కూతురు కూడా ఉంది.
 

27

మ్యూజిక్ డైరెక్ట‌ర్ గా ఫిల్మ్ ఇండస్ట్రీలోకి ఎంటర్ అయిన విజయ్.. ఆతరువాత నటుడుగా... హీరోగా..  సినిమా ఎడిటర్ గా నిర్మాతగా అనేక రకాలుగా సక్సెస్ లు చూసి..  ఒక్కొక్క మెట్టు ఎదుగుతూ వచ్చారు.చిన్న వయసులోనే ఎన్నో కష్టాలు అనుభవించాడు విజయ్ ఆంటోనీ.. చాలా చిన్న వయస్సులో  తండ్రిని కల్పోయి, తినడానికి తిండి లేక అనేక ఇబ్బందులు ఎదురుకున్నాడు. 
 

37

ప్ర‌స్తుతం హీరోగా బిజీగా ఉన్నాడు  విజ‌య్ ఆంటోనీ.. తన  తండ్రి మరణించే నాటికి ఆయ‌న‌కు వయస్సు  కేవ‌లం ఏడు సంత్సరాలు మాత్ర‌మే... అమ్మ చెల్లి తనకు లోకం. విజయ్  త‌ల్లి ఉద్యోగం చేస్తు పిల్లలను చదివించేది. ఉద్యోగం కోసం వేరే ఊరికి వెళ్లాల్సి వచ్చినా పిల్లల చదువు దెబ్బతింటుందని ఉన్న‌ చోటు నుండే  డైలీ సర్వీస్ చేస్తూ.. పిల్లల ఆలనా పాలనాచూసుకుందట. 
 

47

విజయ్ ఆంటోనీ  చదువులో అద్భుతమైన ప్రతిభ కనబరిచేవాట. లాయోల కాలేజి ఆఫ్ ఆర్ట్స్ అండ్ సైన్స్ లో విజయ్ తన స్టడీస్ ను కంప్లీట్ చేశారు.. తరువాత  సౌండ్ ఇంజనీరింగ్ లో గ్రాడ్యూయోట్ అయ్యాడు. ఇక తన తల్లి తన తల్లి ఉద్యోగ రీత్యా ట్రైనింగ్ కోసం వెళ్లవలసి రావడంతో.. విజయ్ మకాం హాస్టల్ కు మారింది. 
 

57

అప్పుడు తన పరిస్థితి ఇంకా ధారుణంగా ఉండేదన్నారు విజయ్..  అనుకోకుండా స్కూల్ కు హాస్టల్స్ కు  సెలవులు వచ్చాయని అప్పుడు తన వార్డెన్ సలహా మేరకు శ్రీలంక శరణార్థుల శిబిరంలో తల దాచుకున్నాన‌ని విజ‌య్ ఇంట‌ర్యూలో తెలిపారు. తన జీవితమంతా ఇలాంటి కష్టాలు చాలా చూశానన్నారు విజయ్ ఆంటోనీ. 

67

ఒక టైమ్ లో తన దగ్గర పైసా కూడా లేక ఇబ్బందులు పడ్డానని.. ఏదో విధంగా అరటి పండు సాధించి.. అది తింటూ జీవనం సాగించానంటూ తాను ప‌డిన‌ కష్టాల గురించి చొప్పుకొచ్చారు. ఇక తన చదువు అయిపోయిన వెంటనే  సినిమాల మీద ఇంట్రెస్ట్ తో ఇంటస్ట్రీ ఎంట్రీ ఇచ్చినట్టు ఆయన పేర్కొన్నారు. 2012 లె నాన్ అనే తమిళ సినిమా ద్వారా తెరకు  ప‌రిచ‌యం అయ్యాడు. 

77

ఆ త‌ర‌వాత న‌టించిన సలీం సినిమాతో విజ‌య్ అంటోనికి ఓఒరేంజ్ లోగుర్తింపు వ‌చ్చింది. అంతే కాదు బిచ్చగాడు సినిమాతో విజయ్ స్టార్ డమ్ అందుకున్నాడు. ఈ సినిమా తమిళనాడుతో ఫాటు.. తెలుగు రాష్టంలో కూడా.. విజయ్ ఆంటోనీకి విపరీతమైన క్రేజ్ తెచ్చి పెట్టింది. 
 

click me!

Recommended Stories