జానకి, రామచంద్రలకు కూడా నువ్వే ఇవ్వు అని జ్ఞానాంబ భర్త అడగగా "వాళ్ళకి ఇచ్చే అంత పెద్దదాన్ని కాదు నేను" అని చెప్పి వెళ్ళిపోతుంది. మల్లికా ఎవరూ చూడనప్పుడు తన గదిలోకి వెళ్లి చిందులేస్తూ ఉంటుంది. అప్పుడు అక్కడికి చికిత వస్తుంది, వాళ్ళిద్దరి మధ్య సంభాషణ ఎంతో నవ్వులాటగా ముగుస్తుంది. తర్వాత జానకి తన గదిలో ఒంటరిగా కూర్చుని ఇందాక జరిగిన సంఘటన గుర్తు చేసుకుంటూ చాలా బాధపడుతూ ఉంటాది.