ఈరోజు ఎపిసోడ్ ప్రారంభంలోనే... జెస్సీ అన్న మాటలకు అఖిల్ ఆశ్చర్యంతో ఉంటాడు. పక్కకి వచ్చి దాని గురించి ఆలోచిస్తూ ఉండగా జానకి అక్కడికి వస్తుంది పండగ చాలా బాగా అయింది కదా అందరం చాలా సరదాగా గడిపాము నువ్వు కూడా అప్పటివరకు బానే ఉన్నావు తర్వాత ఎందుకు మొఖం మార్చేసావు అని అడగగా ఏమీ లేదు వదినా నేను బానే ఉన్నాను అని అంటాడు అఖిల్ అప్పుడు జానకి, జెస్సి రావడం నేను చూశాను అని చెప్తుంది వదిన అంతా వినేసి ఉంటదా అని భయపడతాడు. అంతలో జానకి, జెస్సి ఎందుకు వచ్చింది అఖిల్ నీ అంతట నువ్వే చెప్పు అసలేం జరుగుతుంది నువ్వేమో స్నేహం అంటావు తనేమో ప్రేమ అంటుంది అని జానకి అంటుంది.
ఆ వినలేదు అన్నమాట అని అనుకుని, ఏమీ లేదు వదిన, తను ఊరికే చూద్దామని వచ్చింది కానీ అమ్మ కి జెస్సీ అంటే నచ్చదు కదా అని బలవంతంగా పంపించేసాను అని అంటాడు.అక్కడ నేను చూసిన దానికి నువ్వు చెప్పిన దానికి ఏ సంబంధం లేదు అఖిల్. నీ అంతటి నువ్వే నిజం చెప్పు అయినా ఇదంతా వదిలేసి చదువుకుంటే మంచిది అని అక్కడ నుంచి వెళ్ళిపోతుంది. ఆ తర్వాత సీన్లో జానకి,అఖిల్ గదిలోకి వెళ్లి ఏ ఒక్కొక సాక్ష్యం దొరికినా సరే నిలదీసి అడిగి తన తప్పుని సరిదిద్దుకునేలా చేయాలి అని అనుకోని అంతా వెతుకుతాది. ఇంతలో అఖిల్ అక్కడికి వస్తాడు.
జానకి, జెస్సీ అఖిల్ కలిసి ఉన్న ఫోటోలు ఉన్న పుస్తకం తీస్తున్నప్పుడు అఖిల్ పుస్తకాలు లాక్కొని నా మీద నీకు నమ్మకం లేదా వదినా అని అంటాడు. నమ్మకం అనేది మాటల్లో రాదు అఖిల్, ప్రవర్తనలో వస్తాది. అసలు నీ ఫ్యూచర్ ప్లాన్స్ ఏంటి అని అడగగా సంబంధం లేని మాటలు చెప్తాడు అఖిల్. ముందు చదువు మీద ధ్యాస పెట్టు అఖిల్ ఇలాంటివన్నీ తర్వాత పరీక్షలు దగ్గరికి వస్తున్నాయి కదా రేపటి నుంచి చదివిన ప్రతిదీ నువ్వు నాకు చెప్పాలి అని అంటాది.తర్వాత అఖిల్ ఫోటోలన్నీ చింపేసి వదినకి అనుమానం వచ్చింది. ఇవి చూస్తే నా పని అయిపోతుంది అని అనుకుంటాడు. ఆ తర్వాత సీన్ లో గోవిందరాజు, ఙ్ఞానాంబ ఇంట్లో కూర్చుని ఉండగా అఖిల్ జెస్సీ తో మాట్లాడడానికి వెళ్తాడు.
ఇంతట్లో గోవిందరాజు అఖిల్ ఫోన్ ని అడుగి నిన్న ఫోటోలు తీసుకున్నాను కదరా నీ ఫోన్లోని చూస్తాము ఫోన్ ఇవ్వు అని అంటాడు. తర్వాత ఇస్తాను అని అఖిల్ అంటాడు కానీ గోవిందరాజు బలవంతంగా ఫోన్ తీసుకుంటాడు.అప్పటికే జెస్సి ఫోన్ చేస్తూ ఉంటాది. జాషువా అని ఫీడ్ చేసుకుంటాడు అఖిల్. ఇందాకటి నుంచి ఫోన్ చేస్తున్నారు ఎవరు రా వీళ్లు అని అడగగా ఫోన్ కట్ చేసేస్తాడు అఖిల్. మళ్ళీ అక్కడి నుంచి ఫోన్ వస్తుంది వీడి బాధ ఏంటి అని జ్ఞానాంబ అడగగా సినిమాకి వెళ్దామని అంటున్నాడు అమ్మ. నేను చదువుకుంటాను అని చెప్తున్నాను అయినా బలవంతంగా ఫోన్ చేస్తున్నాడు వదిలే అని అంటాడు.
అప్పుడు జ్ఞానంబ, ఫోన్ లాక్కోని నేను మాట్లాడుతాను చదువుకునే సమయంలో సినిమాలు షికార్లు ఏంటి అని ఫోన్ ఎత్తడానికి చూసేలోగ ఫోన్ కట్ అయిపోతుంది. ఇన్ని సార్లు చేసిన ఫోన్ ఎత్తడం ఎందుకు పైగా ఫోన్ కట్ చేస్తున్నాడు నాకు చాలా భయంగా ఉంది ఏం చేయాలి అని అనుకోని ఇంట్లో పరిస్థితి చేయి జారిపోయేలా ఉన్నది ఏదో ఒక పరిష్కారం చెప్పు అఖిల్ అని వాయిస్ మెసేజ్ పంపుతుంది జెస్సీ. ఇంతలో గోవిందరాజు వాళ్ళు ఫోటోలు అన్నీ చూసి తిరిగి అఖిల్ కి ఫోన్ చేస్తారు. జానకి,జెస్సీ ఏ ఫోన్ చేసి ఉంటుంది అని మనసులో అనుకుంటుంది. ఆ తర్వాత అఖిల్ గదిలోకి వెళ్లి ఆ మెసేజ్ విని నాకు దీనికో పరిష్కారం దొరికింది మనం ఎప్పుడూ కలిసే చోటికి రేపు వచ్చేయి అని చెప్తాడు.
ఆ తర్వాత రోజు ఉదయం జానకి రామాలు బండిమీద కాలేజ్ కి వెళ్ళడానికి బయలుదేరినప్పుడు అఖిల్ అక్కడికి వచ్చి అన్నయ్య నాకు బండి కావాలి ఫ్రెండ్ తో కలిసి చదువుకోడానికి వెళ్తున్నాను అని అనగా జానకి, ఇంత ఉదయాన్నే కలిసి చదువుకోవడం ఎందుకు అఖిల్ అని అంటుంది. నువ్వే కదా వదినా చదువుకోమన్నావు అదే కలిసి చదువుకుంటే డౌట్స్ అన్ని క్లియర్ అవుతాయి అని అంటాడు అప్పుడు రామా మీరు దిగండి జానకి గారు అఖిల్ చదువుకోడానికే కదా వెళ్తానంటున్నాడు అని జానకిని దింపేస్తాడు. బండిని అఖిల్ కి ఇస్తాడు.
ఆ తర్వాత అఖిల్ వెళ్ళిపోతాడు అప్పుడు రామా జానకి తో, నేను చదువుకోలేదని బాధపడుతున్న అఖిల్ చదువుకుంటున్నాడు అనే ఆనందంతో ఉన్నాడు. అఖిల్ చదువుకి ఏ ఆటంకాలు ఉండకూడదు అని అలా చేశాను అని అంటాడు. అప్పుడు జానకి మనసులో, ఈయన అఖిల్ గురించి చాలా అసలు పెట్టుకున్నారు. అఖిల్ ఏమో ఇలాంటి పనులు చేస్తున్నాడు అని బాధపడుతూ ఉంటుంది.ఇంతటితో ఎపిసోడ్ ముగుస్తుంది. తర్వాయి భాగంలో ఏం జరిగిందో తెలియాలంటే రేపటి వరకు ఎదురు చూడాల్సిందే!