Guppedantha Manasu: వసు మెడలో దండ వేసిన రిషి.. కోపంతో రగిలిపోతున్న దేవయాని!

Navya G   | Asianet News
Published : Jan 31, 2022, 10:37 AM IST

Guppedantha Manasu: బుల్లితెరపై ప్రసారమవుతున్న గుప్పెడంత మనసు (Guppedantha Manasu) సీరియల్ ప్రేక్షకులను బాగా ఆకట్టుకుంటుంది. మంచి కుటుంబ కథ నేపథ్యంలో ఈ సీరియల్ కొనసాగుతుంది. అంతేకాకుండా రేటింగ్ లో మొదటి స్థానంలలోనే దూసుకెళ్తుంది. ఇక ఈరోజు ఎపిసోడ్ హైలెట్ ఏంటో చూద్దాం.

PREV
16
Guppedantha Manasu: వసు మెడలో దండ వేసిన రిషి.. కోపంతో రగిలిపోతున్న దేవయాని!

ఫణీంద్ర వర్మ జగతి (Jagathi), మహేంద్ర వర్మ కు బట్టలు తీసుకొని రావడంతో దేవయాని అక్కడి నుంచి వెళ్లే ప్రయత్నం చేస్తుంది. ఇక రిషి (Rishi) రావడాన్ని గమనించి తనలో ఉన్న మరో యాంగిల్ ను బయట పెడుతుంది. ఇంటికి వచ్చిన వారికి కొత్త బట్టలు పెట్టడం మన సాంప్రదాయం కదా అని రిషితో అంటూ రిషి మనసులో మంచి దానిలా నిరూపించుకుంటుంది.
 

26

అక్కడి నుంచి పక్కకు వెళ్లిన రిషి (Rishi) అక్కడ ఏం జరుగుతుందో నిల్చొని చూస్తాడు. ఇక దేవయాని జగతి వాళ్లకు బట్టలుపెడుతుంది. చీకటి పడటంతో మహేంద్ర వర్మ ఆనంద క్షణాలను తలుచుకుని సంతోషంగా ఉంటాడు. ఇక రిషి కూడా మహేంద్ర వర్మ (Mahendra Varma) గురించి ఆలోచిస్తూ ఏ రోజు కూడా మీ కళ్ళలో ఇంత ఆనందం చూడలేదు డాడ్ అనుకుంటూ ఉంటాడు.
 

36

వసు (Vasu) గురించి ఆలోచిస్తూ వచ్చిన రోజే దెబ్బ తగిలిందని బాధపడతాడు. మరోవైపు వసు, దేవయాని తమ ఆనంద క్షణాలను తల్చుకుంటూ తెగ సంతోష పడతారు. ఇక ఉదయాన్నే అందరూ భోగి మంటలు వేసుకోవడం కోసం ఏర్పాట్లు చేస్తారు. గౌతమ్ (Gautham) బాగా హడావుడి చేస్తూ ఉంటాడు.
 

46

మహేంద్ర వర్మ జగతితో (Jagathi) భోగి మంటలు వెలిగించని చెబుతాడు. ఇక మహేంద్రవర్మ సంతోషంగా కనిపించటంతో రిషి ఆ సంతోషాన్ని చూసి సంతృప్తి చెందుతాడు. ఇక వసు భోగిమంటల గురించి మళ్లీ పురాణం వదలడంతో రిషి (Rishi) ఆపమని అంటాడు. అందరూ ఆ భోగిమంటల చుట్టూ సందడి చేస్తూ ఉంటారు.
 

56

అక్కడికి దేవయాని (Devayani) వచ్చి మహేంద్ర వర్మను కౌంటర్  వేయడానికి ప్రయత్నిస్తుంది. ఇక మహేంద్రవర్మ కూడా వెటకారంగా మాట్లాడుతాడు. ఇక రిషి, వసు పాత వస్తువుల కోసం స్టోర్ రూమ్ లోకి వెళ్తారు. అక్కడ వసు (Vasu) కు చిన్న గాయం తగలడంతో రిషి వెంటనే తన వేలు నోట్లో పెట్టుకొని నొప్పిని తగ్గిస్తాడు.
 

66

తరువాయి భాగంలో రిషి (Rishi) తోరణం వేస్తుండగా రిషి చేతిలో ఉన్న దండ వసు మెడలో పడుతుంది. ఇక దేవయాని చూసి కోపంతో రగిలిపోతుంది. మరోవైపు దేవయాని (Devayani) చెయ్యి తగలడంతో జగతి, మహేంద్రవర్మ లపై పువ్వులు పడుతాయి.

click me!

Recommended Stories