ఇక జ్ఞానాంబ (Jnanamba) జానకి దగ్గరికి వచ్చి నా కొడుకుని ఏం చేద్దాం అనుకుంటున్నావు.. వాడు ఒట్టి అమాయకుడివి అని అంటుంది. నేను నా భర్త ప్రతిభ అందరికీ తెలియాలని, అది చూసి మీరు ఎంతో పొంగిపోవాలని నేను ఆరాట పడుతున్నాను అని జానకి (Janaki) అంటుంది. కాదు నీ భర్తని నీ చెప్పుచేతల్లో పెట్టుకోవాలని నువ్వు చూస్తున్నావ్ అని జ్ఞానాంబ అంటుంది.