Janaki kalaganaledu: ఇంట్లోనే నాన్ వెజ్ వంటకాలతో దుకాణం పెట్టిన మల్లికా... జెస్సి కోసం రామా జానకిల ప్లాన్!

First Published Sep 26, 2022, 1:28 PM IST

Janaki Kalaganaledu: బుల్లితెరపై ప్రసారమవుతున్న జానకి కలగనలేదు సీరియల్ తెలుగు ప్రేక్షకుల్ని బాగా ఆకట్టుకుంటుంది. ఐపీఎస్ కలను నిజం చేసుకునేందుకు అత్తవారింట్లో జానకి పడే కష్టాలే ఈ సీరియల్ కాన్సెప్ట్. నిత్యం ట్విస్టులతో కొనసాగుతున్న ఈ సీరియల్ ఈ రోజు సెప్టెంబర్ 26వ తేదీ ఎపిసోడ్‌లో ఏం జరిగిందో తెలుసుకుందాం...
 

ఈరోజు ఎపిసోడ్ ప్రారంభంలోనే...జెస్సీ వాళ్ళ తల్లిదండ్రులు జ్ఞానాంబ ఇంటికి వస్తారు. అప్పుడు రామా,భోజనం చేద్దాము రండి అని అనగా వాళ్ళు,మేము పెళ్ళికి నాన్ వెజ్ తో విందు చేసి అందరికీ భోజనం పెడతాము కానీ ఈ పెళ్లి అనుకోని పరిస్థితుల్లో జరిగింది కనుక ఇప్పుడు అవన్నీ స్వయంగా వండి తీసుకు వచ్చాము. మీకోసం చేపల పులుసు, చికెన్ కూర, మటన్ గోంగూర, బొంగుడాల వేపడం చేసి తీసుకువచ్చాను, మా బేబీ కి ఇవన్నీ చాలా ఇష్టం అని అనగా అక్కడున్న వాళ్ళందరూ జ్ఞనాంబ ఎక్కడా కాపాడుతుందో అని కంగారు పడతారు.అప్పుడు మల్లిక మనసులో, ఆ పేర్లు వింటేనే ఇంత ఆకలేస్తుంది  ఆ భోజనం తింటే ఎంత బాగా ఉంటుందో అని అనుకుంటుంది. అప్పుడు జానకి, ఇప్పుడు వద్దులెండి దాని గురించి ఎందుకు ముందు మీరు భోజనం చేయండి అని అనగా మేము ఇవి ఇవ్వడానికే వచ్చాము అమ్మ,తర్వాత9 వస్తాము లేండి అని అవి అక్కడ పెట్టి వెళ్ళిపోతారు.

అప్పుడు జ్ఞానాంబ జానకి తో, ఇవన్నీ వాళ్ళకి ఇప్పుడు తెలియదు కాబట్టి సరిపోయింది వచ్చేసారి నుంచి జరగకూడదు ఇవన్నీ వెళ్లి బయట పారేయండి అని అంటుంది. అప్పుడు మల్లిక,అత్తయ్య గారు ఈ ఒక్క సారికి ఉంచుకుందామా! ఇది బయట పారేస్తే వాళ్లకి అవమానం చేసినట్టు అవుతుంది కదా అని అనగా జ్ఞానాంబ కోపంతో చూస్తుంది. ఒద్దులెండి నేనే స్వయాన నా చేతితో వెళ్లి పారేస్తాను అని బయటకు వెళ్లి హాయిగా ఒక అరిటాకు తెచ్చుకొని, కూర్చొని ప్రతి వంటకాన్ని తింటూ ఎంత బాగా చేశారో, ఎప్పుడూ ఇంత రుచైన భోజనం నేను తినలేదు క్రిస్టియన్లు వంట చాలా బాగుంటుంది, జెస్సి వాళ్ళ అమ్మగారు చేసినట్టున్నారు ఎంత బాగుందో అని అనుకుంటుంది. ఇంతలో విష్ణు అక్కడికి వచ్చి, నువ్వు ఏం చేస్తున్నావు నీకు అర్థం అవుతుందా.

అమ్మ పారేయమంటే ఇక్కడ దుకాణం పెట్టేసి కుక్కలా తింటున్నావు అని అనగా మల్లికా, నేను కడుపుతో ఉన్నాను కదండీ నాకు అన్ని రుచులు తినాలి అని ఉంటాయి. ఇప్పుడు మీరు నన్ను అడ్డుకుంటే నా కడుపులో బాబుని మీరు తిరస్కరించినట్టే ,నేను మీ వంశాన్ని న కడుపులో మొస్తున్నను కదా!మన బాబు కోసం నేను ఈ మాత్రం చేయక తప్పదు. నాకు ఇష్టం లేదు కానీ వాడి కోరిక నేను ఏం చేయగలను అని అంటుంది. అప్పుడు విష్ణు మొన్న నువ్వు కడుపుతో ఉన్న వాళ్ళకి మూడు బాగోదు అని అన్నాను,ఇప్పుడు అన్ని  రుచులు తినాలి అంటున్నావు. నువ్వు ఒక్కొక్కసారి ఒక్కొక్కలా మాట్లాడుతున్నావు అని అనగా, మీరు నన్ను అనుమానిస్తున్నారా! మన కొడుకు మీద కూడా మీకు అనుమానమా? నాకు తినిపించండి అని మారం చేస్తూ ఉంటే విష్ణు ఏం చేయలేక తినిపిస్తాడు.

సరే మిగిలింది మిగిలింది వెళ్లి పారేస్తాను అని విష్ణు అనగా వద్దు మన గదిలో పెట్టండి మన బాబుకి మళ్ళీ తర్వాత తినాలనిపిస్తే మీ అమ్మ గారి చేతి వండుకొని తెస్తారా అని అంటుంది. సరేలే వెళ్లి లోపలి పెడతాను అని అంటాడు విష్ణు.ఆ తర్వాత సీన్లో జానకి తన గదిలో బట్టలు మడతపెడుతూ ఆలోచనలో పడుతుంది.అప్పుడు రామా అక్కడికి వచ్చి, ఏమైంది జానకి గారు ఏదో ఆలోచిస్తున్నట్టు ఉన్నారు అని అనగా, ఇందాక జెస్సి వాళ్ళ తల్లిదండ్రులు వచ్చినప్పుడు ఎక్కడ అత్తయ్య గారు వాళ్ళని తిడతారేమో అని చాలా భయపడ్డాను. అత్తయ్య గారిది కోపం కాదు కేవలం బాధ మాత్రమే. తప్పుచేసి తల్లి మీద ఒట్టు వేసినందుకు అఖిల్ మీద బాధ అని అనగా రామా, అవును జానకి గారు అఖిల్ మీద అమ్మ ఎన్నో ఆశలు పెట్టుకుంది ఒకేసారి ఇవన్నీ జరిగేసరికి తట్టుకోలేకపోయింది అని అంటాడు.
 

అప్పుడు జానకి,మన ప్రయత్నాలు మనం చేద్దాము రామ గారు రేపు ఉండ్రాళ్ళ పండుగ కనుక జెస్సీ నీ అత్తయ్య గారిని దగ్గర అయ్యేలా చేద్దాము అని అంటుంది. అప్పుడు రామ ఆలోచిస్తూ, జెస్సికి మన పద్ధతులు పూజలు ఏవి తెలియదు కదా రేపు జరిగే కార్యక్రమం వల్ల అమ్మకు కోపం తెప్పించే పని ఏమైనా జరిగితే మళ్ళీ వాళ్ళ మధ్య దూరం పెరుగుతుంది కదా అని అంటాడు. అప్పుడు జానకి, అత్తయ్య గారి కోపానికి ఊర్చుకుంటే ఉంటే తప్ప ఫలితం దక్కదు, వాళ్ల పెళ్లి చేయడంతోనే మన బాధ్యత తీరిపోలేదు రామ గారు. వాళ్ళని అత్తయ్య గారితో ఒకటి చేయాలి అప్పుడే మన బాధ్యత తీరినట్టు అని అంటుంది. ఆ తర్వాత సీన్లో మల్లిక కి చిట్కా తినడానికి ఇస్తుంది. అప్పుడు, మల్లికమ్మగారు నిజంగానే మీరు నాన్ వెజ్ అంత బయట పడేసారా లేకపోతే మీ కడుపులోకి పారేసుకున్నారా! 

 అంటే ఎప్పుడూ లేనిది ఈరోజు మధ్యాహ్నం భోజనం కొంచెం లేట్ చేశారు కదా అందుకే అడిగాను అని అనగా మల్లికా, నీ ఎదవ ఆలోచనలన్నీ కాకినాడ సంతలోకి పంపించుకోవే,నేనెందుకు తింటాను అని అంటుంది. పక్కనే ఫోన్లో గేమ్ ఆడుకుంటూ, వెన్నెల వాళ్ళని చూసి నవ్వుకుంటూ ఉంటుంది. ఇంతలో జ్ఞానాంబ అక్కడికి వచ్చి ఏం చేస్తున్నావ్ వెన్నెల అని అనగా ఫోన్ లో గేమ్ ఆడుకుంటున్నాను అమ్మ అని అంటుంది. సమయం చాలా ముఖ్యమైనది వెన్నెల, ఇలా ఖాళీగా గడిపే బదులు ఆడపిల్లవి వెళ్లి వంట పనులు చేయొచ్చు కదా అని అనగా సరే అని అంటుంది వెన్నెల. పక్కనే ఉన్న గోవిందరాజు, మీ అమ్మ చెప్పిన మాట వినమ్మా లేకపోతే మల్లిక లాగా తినడానికి తప్ప దేనికి పనికిరాకుండా పోతావని అంటాడు. 
 

అప్పుడు మల్లికా ఇబ్బందిగా నవ్వుతూ, మావయ్య గారికి నేనంటే చచ్చేంత అభిమానం అందుకే ఎప్పుడూ నా మీద జోకులు వేస్తూ ఉంటారు అని అంటుంది. అదే సమయంలో జానకి, రాముడు అక్కడికి వస్తారు. జానకి జ్ఞానాంబ తో, అత్తయ్య గారు రేపు ఉండ్రాళ్ల పండుగ కదా మన ఇంట్లో కూడా చేద్దాము అని అనగా, వద్దు జానకి రేపు అందరూ వచ్చి అఖిల్ పెళ్లి గురించి నాన మాటలు అంటే నేను తట్టుకోలేను అని అంటుంది. దానికి రామా,అలా కాదమ్మా వాళ్లెవరో అలాగ అనుకుంటారని మన సంప్రదాయాలను మనం మార్చుకోలేము కదా.మనం పూజ చేద్దాం అని అనగా గోవిందరాజు కూడా పూజ చేయడం మంచిదే జ్ఞానం ఇంటికి శుభం జరుగుతుంది అని అంటాడు. అప్పుడు జ్ఞానాంబ, అందరూ ఒప్పుకుంటున్నారు కదా నాకేం అభ్యంతరం లేదు చేపిద్దాము అని అంటుంది. 

ఆ తర్వాత సీన్లో జానకి గోరింటాకు రుబ్బుతూ ఉండగా జస్సి అక్కడికి వచ్చి ఏం చేస్తున్నావ్ అక్క ఇది గోరింటాకు కదా ఇప్పుడు ఎందుకు రుబ్బుతున్నవు అని అంటుంది. అప్పుడు జానకి, రేపు ఉండ్రాళ్ళ పండుగ ఉన్నది అని అనగా అదే సమయంలో జ్ఞానాంబ అటువైపు వెళుతూ వీళ్ళ మాటలు వింటుంది. అప్పుడు జెస్సి, ఈ పండగ ఎందుకు చేస్తారు అక్క అని అనగా, పెళ్లి అయినా భార్యలు తన భర్త పసుపుకుంకలతో చల్లగా ఉండాలి అని, పెళ్లి కాని వాళ్ళు మంచి భర్త రావాలి అని కోరుకుంటారు అని అనగా ఇందులో నేను కూడా పాలుపంచుకోవచ్చు కదా అని జెస్సి అంటుంది. ఇంతటితో ఎపిసోడ్ ముగుస్తుంది.తరువాయి భాగం లో  ఏం జరిగిందో తెలియాలంటే రేపటి వరకు ఎదురు చూడాల్సిందే!

click me!