Devatha: మాధవ్ మళ్లీ కొత్త ప్లాన్ వేశాడా? రుక్మిణి అజ్ఞాతం గురించి జానకమ్మ ప్రశ్నలు!

First Published Aug 25, 2022, 1:54 PM IST

Devatha: బుల్లితెరపై ప్రసారమవుతున్న దేవత సీరియల్ ప్రేక్షకుల్ని ఆకట్టుకుంటుంది. చెల్లి కోసం భర్తను త్యాగం చేసిన మహిళ కథతో ప్రేక్షకుల ముందు వచ్చింది. నిత్యం ట్విస్టులతో కొనసాగుతున్న ఈ సీరియల్ ఈ రోజు ఆగస్ట్ 25వ తేదీ ఎపిసోడ్‌లో ఏం జరిగిందో హైలెట్స్ తెలుసుకుందాం..
 

ఈరోజు ఎపిసోడ్ ప్రారంభంలోనే... రుక్మిణి ఆదిత్య మాట్లాడుకుంటూ ఉంటారు. అప్పుడు రుక్మిణి ఈరోజు ఇక్కడికి రావడం నాకు చాలా ఆనందంగా ఉన్నది అందర్నీ చూసినట్టైంది అని అంటుంది. అప్పుడు ఆదిత్య ఈరోజు దేవి అందర్నీ నానమ్మ, తాతయ్య, పిన్ని, పెద్దమ్మని వరుసలు పెట్టి పిలుస్తుంటే నాకు ఎక్కడా లేని ఆనందం అంతా వస్తుంది. అదే సమయంలో నేనేం పాపం చేశాను నన్ను నాన్న అని పిలవలేదు అని బాధేస్తోంది. నా కూతురు నోరార నన్ను నాన్న అని పిలిచే రోజు కోసం ఎదురు చూస్తున్నాను అని ఆదిత్య అంటాడు. దగ్గర్లోనే వస్తది పెనిమిటి అని రుక్మిణి అంటుంది. ఆ తర్వాత మాధవ్ రుక్మిణి తనతో,మా అత్తమ్మ గుండెల్లో పగిలే అంత వరుకు వస్తే నేను నీ తలకాయ కోస్తాను అన్న మాటలు గుర్తు తెచ్చుకొని రగిలిపోతూ ఉంటాడు.
 

ఇంతట్లో దేవి, చిన్నయి మాధవ్ దగ్గరికి వచ్చి నాయినా చూసావా అక్కడ వాళ్ళు మమ్మల్ని అంత బాగా చూసుకున్నారో, మా ఇద్దరికీ బంగారు గాజులు కూడా కానుకగా ఇచ్చారు. సొంత ఇంటి మనుషుల్లా చూసుకుంటున్నారు అని చెప్తారు. ఈ మాటలన్నీ విన్న రుక్మిణి అంతా ఆనందపడుతుంది ఇంతట్లో పిల్లలు రుక్మిణి దగ్గరికి వెళ్లి అమ్మ నిన్ను రమ్మంటే రాలేదు కానీ మేము అక్కడ చాలా ఎంజాయ్ చేసాము. అవ్వ నిన్ను ఎన్నిసార్లు అడిగిందో తెలుసా? చిన్న పాప చాలా బాగుంది అని చెప్పి మాకు బహుమతిగా గాజులు కూడా ఇచ్చారు అని అంటారు. దిష్టి తగులుతుంది  పాప లోపలికి వెళ్ళండి అని రుక్మిణి వాళ్ళని పంపించేసి మాధవ్ దగ్గరికి వచ్చి చూసావా అక్కడికి వచ్చినప్పుడే దేవి ఇంత ఆనందంగా ఉన్నది అదే తన సొంత ఇల్లు అని తెలిస్తే ఇంకెంత సంతోషంగా ఉంటుందో అని అంటుంది.
 

అప్పుడు మాధవ్, ఈరోజు రాత్రి నువ్వు ఆనందంగా పడుకోవచ్చు కానీ రేపు అనే ఒక రోజు ఉన్నది ఆ రోజు నాది రేపు మాత్రం ఈ రోజుల ఉండదు అని మాధవ్ రుక్మిణి తో అంటాడు. ఆ తర్వాత రోజు ఉదయం మాధవ్ పంచ కట్టుకొని ఇంట్లో పూజ చేస్తూ ఉంటాడు. మాధవ్ నువ్వేనా ఇలాగ ఎందుకు ఇప్పుడు పూజ చేస్తున్నావు అని జానకమ్మ అనగా ఈరోజు నేను పరీక్షకు వెళ్తున్నాను అది బాగా జరగాలని కోరుకోండి అని అంటాడు మాధవ్. ఈ మధ్య నాకు నీ మాటలు అసలు అర్థం కావట్లేదు మాధవ్, పరీక్ష అంటావు గెలవాలి అంటావు, అసలు ఏం జరుగుతుంది అని జానకమ్మ అంటుంది. మీకే తెలుస్తుందిలే అమ్మ అని మాధవ్ అంటాడు.
 

ఇంతట్లో దేవి అక్కడికి వచ్చి నాయనా నువ్వు ఏ పరీక్ష రాసిన అది బాగా జరగాలని నేను దేవుడిని కోరుకుంటాను అని అంటుంది. చిన్నపిల్లలు కోరుకుంటే జరుగుతుంది అని మాధవ్ అంటాడు. ఇంతటిలో మాధవ్ పిల్లలు ఇద్దరు స్కూల్లోకి దింపుతాను అని అంటాడు.ఇంతట్లో పిల్లలు తయారవ్వడానికి వెళుతుండగా మాధవ్ రుక్మిణి తో ఈరోజు నాది. నిన్న నీ నవ్వు తో ముగిసింది ఈరోజు నా నవ్వుతో ముగుస్తుంది. వెయిట్ చేస్తూ ఉండు అని అంటాడు. రుక్మిణి అనుమానంతో ఉంటుంది.ఆ తర్వాత సీన్లో ఆదిత్య భోజనం చేస్తూ ఉండగా సత్య, నిన్న నువ్వు ఎవరికోసమో ఎదురు చూస్తూ ఉండటం గమనించాను ఎవరు అని అడగగా ఆదిత్య నీకు అలా అనిపించినట్టు ఉంది.
 

నేను ఎవరి గురించి నేను చూడట్లేదు అని అంటాడు ఇంతట్లో ఒక ఫోన్ వస్తుంది. ఆదిత్య బయటికి వెళ్లి మాట్లాడుతాడు. అప్పుడు సత్య ఏవైనా ఉంటే ఇక్కడే మాట్లాడొచ్చు కదా.అని అనుకుంటుంది అప్పుడు రుక్మిణి ఆదిత్య కి ఫోన్ చేసి జరిగినదంతా చెప్పి మాధవ్ ప్రవర్తన బాలేదు అని అంటుంది.అప్పుడు ఆదిత్య మళ్లీ ఏదో ప్లాన్ చేసినట్టు ఉన్నాడు నువ్వు చాలా జాగ్రత్తగా ఉండాలి రుక్మిణి అని అంటాడు. నేను చాలా ధైర్యంగానే ఉన్నాను,విషయం చెప్పడానికి మాత్రమే నీకు ఫోన్ చేశాను భయంతో ఏమీ కాదు అని చెప్పి ఫోన్ పెట్టేస్తుంది. ఆ తర్వాత సీన్ లో జానకమ్మ,రుక్మిణి దగ్గరికి వచ్చి ఎందుకు రాధా బయటికి రావడానికి నువ్వు ఇబ్బంది పడుతున్నావు.
 

అక్కడ నిన్న అందరూ నీ గురించి అడిగారు.ఎందుకు రాధ రావడం లేదు అని ఇది మన ఊరు రాదా నువ్వు బయటకు వెళ్లడానికి భయపడాల్సిన అవసరం లేదు, నీ భర్త చూసి ఏమైనా అంటారు అని నువ్వు అనుకుంటున్నావా? పోనీ నీ భర్త ఎవరో చెప్తే మనం ఒకసారి వెళ్లి మాట్లాడదాము అని అంటుంది. నాకు బయటకు రావడం ఇష్టం లేదు నన్ను నాలాగే ఉండనివ్వండి అని రుక్మిణి అనగా అప్పుడు జానకమ్మ,వాళ్ళ స్థాయికి నీ గురించి ఆలోచించాల్సిన అవసరం లేదు కానీ నిన్ను చూడాలని పదేపదే తపన పడుతున్నారు అలాంటి వారిని నిరాశపరచడం మంచిది కాదు. మన కోసం ఆలోచించే వారి కోసమైనా మనం ఆలోచించాలి కదా అని అంటుంది.
 

అప్పుడు రుక్మిణి మనసులో, నేను ఎందుకు రావడం లేదు అంటున్నాను మీకు తెలియడం లేదు అని అనుకుంటుంది. అప్పుడు జానకమ్మ నీ భర్త ఎవరో చెప్పమ్మా పోనీ అంత భయపడుతున్నప్పుడు నేను వెళ్లి మాట్లాడుతాను అని అంటుంది.అప్పుడు రుక్మిణి,ఎవరో ఏదో అంటారు అని నేను బయటకు రావడం లేదు నాకు రావాలనిపించ రావడం లేదు అని అంటుంది. నేను నిన్ను ఇబ్బంది పెట్టాలని కాదమ్మా ఆఫీసర్ గారి వాళ్ళ తల్లి నిన్ను చూడాలనుకుంటున్నారు ఒకసారి కనిపించకూడదూ? అని అంటుంది. ఇంతటితో ఎపిసోడ్ ముగుస్తుంది. తరువాకంలో ఏం జరిగిందో తెలియాలంటే రేపటి వరకు ఎదురు చూడాల్సిందే!

click me!