ప్రభాస్‌-మారుతి సినిమాకి బిగ్‌ షాక్‌.. `బైకాట్‌` అంటూ ఫ్యాన్స్ ఆగ్రహం..మహేష్‌ ఫ్యాన్స్ కూడానా?

Published : Aug 25, 2022, 12:55 PM IST

పాన్‌ ఇండియా స్టార్‌ ప్రభాస్‌ ఇరకాటంలో పడ్డారు. ఆయనకు అభిమానుల నుంచి తీవ్రమైన నిరసన సెగ తగులుతుంది. నెక్ట్స్ సినిమా విషయంలో వారు పూర్తిగా అసహనం వ్యక్తం చేస్తున్నారు.   

PREV
17
ప్రభాస్‌-మారుతి సినిమాకి బిగ్‌ షాక్‌.. `బైకాట్‌` అంటూ ఫ్యాన్స్ ఆగ్రహం..మహేష్‌ ఫ్యాన్స్ కూడానా?

ప్రభాస్‌(Prabhas) వరుసగా పాన్‌ ఇండియా సినిమాలు చేస్తున్నారు. మధ్యలో ఓ కమర్షియల్‌  సినిమా చేయాలనుకున్నారు. ఎంటర్‌టైన్‌మెంట్‌ చిత్రాలకు కేరాఫ్‌గా నిలిచే మారుతి(Maruthi)  దర్శకత్వంలో ఓ సినిమాకి కమిట్‌ అయ్యారు. తాజాగా ఈ చిత్రాన్ని ప్రారంభించారు. గురువారం ప్రభాస్‌, మారుతి సినిమా ప్రారంభమైనట్టు తెలుస్తుంది. మరో రెండు మూడు నెలలు  మంచి రోజులు  లేకపోవడంతో హడావుడిగా ఈ సినిమాని ప్రారంభించినట్టు తెలుస్తుంది. దీనికి పీపుల్‌ మీడియా ఫ్యాక్టరీ నిర్మాతగా  వ్యవహరిస్తుంది.

27

ప్రభాస్‌ ప్రస్తుతం విదేశాల్లో ఉన్నారు. దీంతో చిత్ర దర్శకుడు, నిర్మాతలు,  ఇతర టెక్నీషియన్ల  సమక్షంలో  ఈ  సినిమా ప్రారంభమైనట్టు సమాచారం. ప్రస్తుతం ప్రభాస్‌ నటిస్తున్న `సలార్‌` షూటింగ్‌ పూర్తయిన తర్వాత ఈ సినిమా రెగ్యూలర్‌ షూటింగ్‌ ప్రారంభం కానుందని సమాచారం. ప్రస్తుతం ప్రీ ప్రొడక్షన్‌  వర్క్ జరుగుతుందని,  బౌండెడ్‌ స్క్రిప్ట్ రెడీ చేసే పనిలో మారుతి ఉన్నారట. 

37

ఇదిలా ఉంటే ఈ సినిమాకి పెద్ద షాక్‌ తగులుతుంది. ప్రభాస్‌ ఫ్యాన్స్ నుంచే తీవ్రమైన వ్యతిరేకత వ్యక్తమవుతుంది. మారుతితో సినిమా చేయడంపై వాళ్లు అసహనం వ్యక్తం చేస్తున్నారు. అంతేకాదు దర్శకుడు మారుతిని తెలుగు చిత్ర  పరిశ్రమ నుంచి బైకాట్‌ చేయాలని నిరసన వ్యక్తం చేస్తున్నారు. ఈ మేరకు ట్విట్టర్‌లో `#BoycottMaruthiFromTFI` యాష్‌ ట్యాగ్‌ని ట్రెండ్‌ చేస్తున్నారు. 

47

ఇప్పటికే వరుస పరాజయాలతో ఉన్నారు మారుతి. ఆయన రూపొందించిన చివరి చిత్రం `పక్కా కమర్షియల్‌` పరాజయం చెందింది. అంతకు ముందు చేసిన `మంచి రోజులొచ్చాయ్‌` గొప్పగా ఆడలేదు. `ప్రతి రోజు పండగే` ఫర్వాలేదనిపించుకుంది. ఏదైనా మారుతి చిన్నగా ఎంటర్‌టైన్‌మెంట్‌ సినిమాలు చేయగలడని, కానీ ప్రభాస్‌ లాంటి పాన్‌ ఇండియా  స్టార్‌ని డీల్ చేయలేడని అంటున్నారు. 

57

అందుకే ట్విట్టర్‌ వంటి  సామాజిక మాధ్యమాల వేదికగా నిరసన తెలియజేస్తున్నారు. ఈ సినిమా చేయొద్దని ప్రభాస్‌  ఫ్యాన్స్ గగ్గోలు పెడుతున్నారు. దీనికితోడు మహేష్‌ అభిమానులు కూడా కలవడం గమనార్హం. దీంతో ఈ ఇద్దరు కలిసి మారుతిని ఓ రేంజ్‌లో ఆడుకుంటున్నారు. మరి ఫ్యాన్స్ అభిప్రాయాన్ని ప్రభాస్‌ కన్సిడర్‌ చేస్తాడా? అనేది చూడాలి. 

67

ప్రభాస్‌ ప్రస్తుతం నటిస్తున్న చిత్రాలన్నీ భారీ ప్రాజెక్ట్ లే. ప్రస్తుతం నటిస్తున్న `ఆదిపురుష్‌` 500కోట్ల బడ్జెట్‌తో తెరకెక్కుతుంది. ఈ సినిమా జనవరిలో రిలీజ్‌ కాబోతుంది.  దీంతోపాటు ప్రశాంత్‌ నీల్‌ డైరెక్షన్‌లో చేస్తున్న `సలార్‌` చిత్రం సైతం భారీ సినిమానే. దీనికి మూడు వందల కోట్లు దాటుతుందని సమాచారం. మరోవైపు నాగ్‌ అశ్విన్‌తో చేస్తున్న `ప్రాజెక్ట్ కే` బడ్జెట్‌ కూడా సుమారు ఐదు వందల కోట్లు ఉంటుందని సమాచారం. పైగా ఇది ఇంటర్నేషనల్‌ మార్కెట్‌ని టార్గెట్‌ చేసుకుని రూపొందుతుంది. 

77
Prabhas

`అర్జున్‌రెడ్డి` ఫేమ్‌ సందీప్‌ రెడ్డి వంగా డైరెక్షన్‌లో `స్పిరిట్‌` అనే చిత్రం చేయనున్నారు ప్రభాస్‌. ఇన్ని భారీ సినిమాల మధ్య చిన్న సినిమా చేయడం పట్ల డార్లింగ్‌ అభిమానులు జీర్ణించుకోలేకపోతున్నారు. తమ నిరసనని  ఈ రూపంలో తెలియజేస్తున్నారు. మరి ఈ ప్రాజెక్ట్ ఏ తీరం చేరుతుందో చూడాలి. 

AR
About the Author

Aithagoni Raju

అయితగోని రాజు 2020 నుంచి ఏషియానెట్‌ తెలుగులో వర్క్ చేస్తున్నారు. ఆయనకు టీవీ, ప్రింట్‌, డిజిటల్‌ జర్నలిజంలో 13ఏళ్ల అనుభవం ఉంది. ప్రధానంగా న్యూస్‌, సినిమా జర్నలిజం, ఎంటర్‌టైన్‌మెంట్‌ రంగంలో ప్రముఖ సంస్థల్లో వర్క్ చేశారు. ప్రపంచ సినిమాని `షో`(నవతెలంగాణ) పేరుతో రాసిన ప్రత్యేక కథనాలు విశేష గుర్తింపుని తెచ్చిపెట్టాయి. ప్రస్తుతం ఏషియానెట్‌ తెలుగులో ఎంటర్‌టైన్‌ మెంట్ టీమ్‌ని లీడ్‌ చేస్తున్నారు. సబ్‌ ఎడిటర్‌గానే రిపోర్టర్ గా సినిమా ఫీల్డ్ అనుభవం ఉంది. ఎంటర్‌టైన్‌మెంట్‌ విభాగంలో సినిమా, టీవీ, ఓటీటీ కి సంబంధించి ఆసక్తికర కథనాలను, సినీ ఇండస్ట్రీలోని విషయాలను, సినిమా రివ్యూలు, విశ్లేషణాత్మక కథనాలు రాయడంలో మంచి పట్టు ఉంది. క్వాలిటీ కంటెంట్‌ని అందిస్తూ, క్వాలిటీ జర్నలిజాన్ని ముందుకు తీసుకెళ్లడంలో తనవంతు కృషి చేస్తున్నారు.Read More...
Read more Photos on
click me!

Recommended Stories