జమున భుజంపై చేయి వేసిన సావిత్రి భర్త, జెమినీ గణేషన్ కు స్ట్రాంగ్ వార్నింగ్ ఇచ్చిన స్టార్ హీరోయన్ ?

Published : Nov 11, 2025, 03:30 PM IST

అలనాటి హీరోయిన్ జమున.. మహానటి సావిత్రితో మంచి అనుబంధం కలిగి ఉండేవారు. అక్కా అంటూ ఆప్యాయంగా మాట్లాడేవారు. సావిత్రిని హీరో జెమినీ గణేషన్ ప్రేమించి, పెళ్లాడారు. ఒకసారి ఆయన జమున భజంపై చేయివేస్తే.. ఆమె ఎలా రియాక్ట్ అయ్యిందో తెలుసా? 

PREV
16
మద్రాస్ లో సౌత్ ఫిల్మ్ ఇండస్ట్రీ

ఆ కాలంలో హీరోలు హీరోయిన్లు చాలా మంచి అనుబంధం కలిగి ఉండేవారు. హీరోయిన్లు కూడా వాళ్ల హద్దుల్లో ఉంటూ.. హీరోలతో జాగ్రత్తగా వ్యవహరించేవారు. ఇక తెలుగు, తమిళంతో పాటు.. సౌత్ ఫిల్మ్ ఇండస్ట్రీ అంతా.. ప్రస్తుతం చెన్నైగా పిలవబడుతున్న మద్రాస్ నగరంలో ఉండేది. స్టార్ హీరోలు, హీరోయిన్లు, ఇతర స్టార్ నటులంతా అక్కడే ఉండేవారు. తెలుగు తమిళ హీరోలు, హీరోయిన్ల మధ్య కూడా మంచి అనుబంధం ఉండేది. సావిత్రి, జెమినీ గణేషన్ ల మధ్య ఇలానే స్నేహం పెరిగి, ప్రేమగా మారింది. అది పెళ్లి వరకూ వెళ్ళింది. ఆతరువాత ఏం జరిగిందన్న విషయం అందరికి తెలిసిందే.

26
సావిత్రితో జమున అనుబంధం

అప్పట్లో ఎన్టీఆర్, ఏఎన్నార్, సావిత్రి, జమున, శోభన్ బాబు, కృష్ణ.. ఇలా అందరు తారలు చెన్నైలోనే నివసించారు. మరీ ముఖ్యంగా సావిత్రి,జమున అయితే సొంత అక్క చెల్లెళ్ల కంటే ఎక్కువగా అనుబంధం కలిగి ఉండేవారు. ఎప్పుడు కలిసిమెలిసి, కష్టసుఖాలలో తోడుగా ఉండేవారు. ఏ సమస్య వచ్చినా.. ఇద్దరు ఒకరికి ఒకర అండగా నిలిచేవారు. సంతోషాలను కూడా కలిసి పంచుకునేవారు. సావిత్రిని అక్కా అని పిలిస్తూ.. ఆమె చుట్టూ తిరిగే వారట జమున. అంతే కాదు సావిత్రి, జెమినీ గణేషన్ ల ప్రేమ విషయం కూడా ముందుగా కనిపెట్టింది జమునే. ఈ విషయాలను జమున చాలా ఇంటర్వ్యూల్లో వెల్లడించారు.

36
సావిత్రి, జెమినీ గణేషన్ గురించి జమున కామెంట్స్

అయితే సావిత్రితో తన అనుబంధాన్ని గతంలో జరిగిన ఓ ఇంటర్వ్యూలో గుర్తు చేసుకున్నారు జమున. అంతే కాదు జెమినీ గణేషన్ గురించి కూడా ఆమె కొన్ని కీలక కామెంట్స్ చేశారు. జమున మాట్లాడుతూ.. '' సావిత్రి, జెమినీ గణేషన్ ఎప్పటి నుంచో ప్రేమిచుకున్నారు. కానీ ఆ విషయం అందరికి చాలా లేట్ గా తెలిసింది. కానీ వారు వారు షూటింగ్స్ లో క్లోజ్ గా మూవ్ అవుతుంటే.. అది అందరికి అనుమానంగానే ఉండేది. నాకు అయితే ముందు నుంచే తెలుసు, వీరి మధ్య ఏదో ఉంది అని. కానీ ఆమె పెళ్లి చేసుకున్న విషయం మాత్రం ఎవరీకి తెలియదు. వారిద్దరు పెళ్లి విషయాన్ని చాలా సీక్రేట్ గా ఉంచారు. ఆతరువాత కాలంలో అది అందరికి తెలిసింది. పెళ్లి గురించి సలహా ఇచ్చే టైమ్ కూడా ఆమె ఎవరికీ ఇవ్వలేదు అని జమున అన్నారు.

46
జమున భుజంపై చేయి వేసిన జెమినీ గణేషన్..

జమున మాట్లాడుతూ.. అందరు హీరోల మదిరిగా జెమినీ గణేషన్ కూడా మాతో బాగానే ఉండేవారు. నాతో కూడా సరదాగా ఉంటూ.. ఆటపట్టించే వాడు. ఒక సారి నా బుజం మీద చేయివేసి ఏదో అనబోయాడు. వెంటనే నేను చేతి మీద ఒక్క దెబ్బ కొట్టి.. నేనేమైనా సావిత్రిని అనుకుంటున్నావా.. అని గట్టిగా వార్నింగ్ కూడా ఇచ్చాను. అప్పటికి సావిత్రి జెమినీ గణేషన్ గురించి అందరికి అనుమానం ఉంది. కానీ వారు బయటకు మాత్రం చెప్పలేదు. షూటింగ్ లో మాత్రం చాలా క్లోజ్ గా ఉండేవారు. అందుకే నేను ఆ సందర్బంలో ఆ మాట అన్నాను'' అని జమున ఇంటర్వ్యూలో వెల్లడించారు.

56
జమున రూటే సెపరేట్..

హీరోయిన్లు హీరోలకు కాస్త భయపడుతూ ఉండేవారు. పెద్ద పెద్ద హీరోల మందు మాట్లాడటానికే సంకోచించేవారు. కానీ జమున అలా కాదు. ఆమె ఎవరినీ లెక్కచేసేవారు కాదు. ఎంత పెద్ద హీరో అయినా తన పని తాను చేసుకుని వెళ్లిపోయేది.. అందరిలో కలిసేవారు కాదు. దాంతో ఇండస్ట్రీలో జమునకు పొగరు ఎక్కువ.. గర్వం ఎక్కువ అన్న పేరు పడిపోయింది. మరి కొంత మంది మాత్రం ఆమెకు ఆత్మాభిమానం ఎక్కువ.. ఎవరి ముందు దండాలు పెట్టడం ఇష్టం ఉండదు అని అనేవారు. ఇక జమున అలా ఉండటం వల్లే.. ఆమెతో పిచ్చి పిచ్చి వేషాలు వేయడానికి ఎవరైనా భయపడే వారు. సాధారణంగా ఇండస్ట్రీలో హీరోయిన్లు వేధింపుల వార్తలు వింటుంటాం. కానీ జమునలా స్ట్రిక్ట్ గా ఉండగలిగితే.. ఎవరైనా ఇలాంటి సాహసాలుచేయడం కష్టమే.

66
జమునను దూరం పెట్టిన ఎన్టీఆర్ - ఏఎన్నార్

జమున ఎవరినీ లెక్క చేయకపోవడం, షూటింగ్స్ కు కూడా లేట్ గా వస్తుండటం.. ఎన్టీఆర్ ఏఎన్నార్ లాంటి హీరోలను వెయిట్ చేయించడంతో.. జమునపై వారిలో వ్యతిరేక భావం వచ్చింది. ఇక ఇద్దరు హీరోలు మాట్లాడుకుని.. ఆమెను తమ సినిమాల్లో తీసుకోకూడదు అని నిర్ణయించుకున్నారు. చాలా కాలం జమనను తమ సినిమాల్లో తీసుకోకుండా.. అనధికారికంగా ఆమెను బ్యాన్ చేశారు. ఆతరువాత కాలంలో గుండమ్మ కథ సినిమా కోసం.. నిర్మాతలు,దర్శకులు వారి మధ్య చర్చలు జరిపి, మళ్లీ జమునను తీసుకునేలా చేశారు.ఏం జరిగినా కూడా జమున మాత్రం తన ఆత్మాభిమానం దెబ్బతినేలా ఏ పనిచేసేవారు కాదు. అవసరమైతే సినిమాలు వదిలేసుకునేవారు కానీ..తనకు నచ్చని మనిమాత్రం చేసేవారు కాదు.

Read more Photos on
click me!

Recommended Stories