Jalsa Movie: జల్సాలోని 'చలొరే చలొరే చల్' పాటలో ఇంత అర్థం ఉందా.. మనిషి మృగానికన్నా దారుణం అని తేల్చేసిన కవి

Published : Oct 07, 2026, 04:28 PM IST

పవన్ కళ్యాణ్ జల్సా మూవీలోని చలోరే చలోరే చల్ పాటలో లోతైన అర్థం ఉంది. సిరివెన్నెల సాహిత్యం అందించిన ఈ పాట అర్థం తెలిస్తే హ్యాట్సాఫ్ అనాల్సిందే. అంత గొప్పగా లిరిక్స్ ఉంటాయి.

PREV
15
పవన్ కళ్యాణ్ జల్సా మూవీ

పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ నటించిన జల్సా మూవీ 2008లో విడుదలై మంచి విజయం సాధించింది. త్రివిక్రమ్ శ్రీనివాస్, పవన్ కళ్యాణ్ కాంబినేషన్ లో తెరకెక్కిన తొలి చిత్రం ఇదే. ఇలియానా, పార్వతి మెల్టన్ హీరోయిన్లుగా నటించారు. ప్రకాష్ రాజ్, ముకేశ్ రుషి, తనికెళ్ళ భరణి కీలక పాత్రలో నటించారు. పవన్ కళ్యాణ్ వరుస ఫ్లాపుల్లో ఉన్న టైంలో జల్సా మూవీ అభిమానులకు ఊరటగా నిలిచింది. సైలెంట్ గా ఈ చిత్రం బాక్సాఫీస్ వద్ద సునామీ సృష్టించింది.

25
మ్యూజిక్ తో దేవిశ్రీ మ్యాజిక్, సిరివెన్నెల అద్భుతమైన సాహిత్యం

ఈ సినిమా కంటే ఇందులోని పాటలో ప్రేక్షకులని ఒక ఊపు ఊపేశాయి. ఈ చిత్రానికి దేవిశ్రీ ప్రసాద్ సంగీత దర్శకుడు. దేవిశ్రీ ప్రసాద్ అందించిన బెస్ట్ ఆల్బమ్స్ లో జల్సా ఒకటి. సిరివెన్నెల సీతా రామ శాస్త్రి అందించిన సాహిత్యం, దేవిశ్రీ ప్రసాద్ మ్యూజిక్ ఈ మూవీ పాటలని నెక్స్ట్ లెవల్ కి తీసుకెళ్లాయి. ఈ మూవీలో చలోరే చలోరే చల్ అనే సాంగ్ సాహిత్యం పరంగా ది బెస్ట్ అని చెప్పొచ్చు. సిరివెన్నెల ఈ పాటని లోతైన అర్థంతో ప్రస్తుతం మానవ జాతి స్వభావాన్ని తెలియజేసేలా రాశారు.

35
చలోరే చలోరే చల్ పాట తెలుగు లిరిక్స్ ఇవే..

చలొరే చలొరే చల్ .. చలొరే చలొరే చల్ ..

చలొరే చలొరే చల్ .. చల్.. చల్

చలొరే చలొరే చల్ .. చలొరే చలొరే చల్ ..

చలొరే చలొరే చల్ .. చల్.. చల్

నీ పయనం ఎక్కడికో నీకు తెలియాలిగా..

ఏ సమరం ఎవ్వరితో తేల్చుకో ముందుగా ..

చలొరే చలొరే చల్ .. చలొరే చలొరే చల్ ..

చలొరే చలొరే చల్ .. చల్.. చల్

చంపనిదే బతకవనీ, బతికేందుకు చంపమనీ,

నమ్మించే అడివిని అడిగేం లాభం బతికే దారెటనీ ..

చలొరే చలొరే చల్ .. చలొరే చలొరే చల్ ..

చలొరే చలొరే చల్ .. చల్.. చల్

సంహారం సహజమనీ, సహవాసం స్వప్నమనీ,

తర్కించే తెలివికి తెలిసేనా తానే తన శత్రువనీ ..

చలొరే చలొరే చల్ .. చలొరే చలొరే చల్ ..

చలొరే చలొరే చల్ .. చల్.. చల్

నీ పయనం ఎక్కడికో నీకు తెలియాలిగా..

ఏ సమరం ఎవ్వరితో తేల్చుకో ముందుగా ..

ధీరులకి దీనులకి, అమ్మవడి ఒక్కటే,

వీరులకీ చోరులకీ కంటతడి ఒక్కటే ..

చలొరే చలొరే చల్ .. చలొరే చలొరే చల్ ..

చలొరే చలొరే చల్ .. చల్.. చల్

అపుడెపుడో ఆటవికం, మరి ఇపుడో అధునికం,

యుగయుగాలుగా మృగాలకన్నా ఎక్కువ ఏమెదిగాం ..

చలొరే చలొరే ..చల్ .. చలొరే చలొరే ..

చలొరే చలొరే.. చల్.. చలొరే చలొరే ..

రాముడిలా ఎదగగలం, రాక్షసులని మించగలం ..

రకరకాల ముసుగులు వేస్తూ మరిచాం ఎపుడో సొంత ముఖం ..

చలొరే చలొరే ..చల్ .. చలొరే చలొరే ..

చలొరే చలొరే.. చల్.. చలొరే చలొరే ..

తారలనే దించగలం తలుచుకుంటే మనం ..

రవికిరణం చీల్చగలం రంగులుగా మార్చగలం …

చలొరే చలొరే చల్ .. చలొరే చలొరే చల్ ..

చలొరే చలొరే చల్ .. చల్.. చల్

45
మనిషి స్వభవాన్ని తెలియజేసే పాట, అర్థం ఇదే

“చలోరే చలోరే” పాట సాధారణంగా వినిపించే మాస్ సాంగ్ కాదు. ఇది జీవిత తత్వం, మనిషి స్వభావం, యుద్ధం, శాంతి, అభివృద్ధి గురించి ఆలోచింపజేసే పాట. సిరివెన్నెల సీతారామశాస్త్రి గారి రచనలో లోతైన అర్థాలు ఉన్నాయి. ఒక్కో భాగం అర్థం ఇలా ఉంది:

“నీ పయనం ఎక్కడికో నీకు తెలియాలిగా.. ఏ సమరం ఎవ్వరితో తేల్చుకో ముందుగా”

జీవితంలో ముందుకు వెళ్లే ముందు మన లక్ష్యం ఏమిటో తెలుసుకోవాలి. అలాగే మన పోరాటం ఎవరితో ఉందో కూడా గుర్తించాలి. చాలా సార్లు మనిషి బయట శత్రువులను వెతుకుతాడు, కానీ అసలు పోరాటం తనలోని భయం, కోపం, అహంకారం, స్వార్థంతోనే ఉంటుంది.

“చంపనిదే బతకవనీ, బతికేందుకు చంపమనీ, నమ్మించే అడివిని అడిగేం లాభం బతికే దారెటనీ”

ప్రకృతిలో బలవంతుడు బలహీనుడిని జయించడం సహజం. అడవి ధర్మం అదే. కానీ మనిషి కూడా అదే ఆలోచనతో బతికితే సమాజం ఎలా ఉంటుంది? అడవి నియమాలను అనుసరించి మన జీవన మార్గం తెలుసుకోవాలని ప్రయత్నించడం వల్ల ప్రయోజనం ఉండదని కవి చెబుతున్నారు.

“సంహారం సహజమనీ, సహవాసం స్వప్నమనీ, తర్కించే తెలివికి తెలిసేనా తానే తన శత్రువనీ”

మనిషి వినాశనం సహజం, శాంతి కేవలం కల మాత్రమే అని అనుకుంటాడు. కానీ తెలివైన మనిషి అసలు శత్రువు బయట ఎవరూ కాదని, తనలోని దుర్గుణాలేనని గ్రహించాలి. కోపం, అసూయ, లోభం, అహంకారం — ఇవే మనిషి నిజమైన శత్రువులు.

“ధీరులకి దీనులకి, అమ్మవడి ఒక్కటే, వీరులకీ చోరులకీ కంటతడి ఒక్కటే”

ధైర్యవంతుడైనా, పేదవాడైనా తల్లి ప్రేమ ఒకటే. వీరుడైనా, దొంగైనా కన్నీటి విలువ ఒకటే. అంటే మనుషుల మధ్య ఉన్న తేడాలు పైకి మాత్రమే; బాధలు, ప్రేమ, భావోద్వేగాలు అందరికీ ఒకేలా ఉంటాయి.

“అపుడెపుడో ఆటవికం, మరి ఇపుడో అధునికం, యుగయుగాలుగా మృగాలకన్నా ఎక్కువ ఏమెదిగాం”

మనిషి ఆటవిక దశ నుంచి ఆధునిక యుగానికి వచ్చాడు. విజ్ఞానం, సాంకేతికతలో ఎంతో ఎదిగాడు. కానీ స్వార్థం, హింస, ద్వేషం విషయంలో ఇప్పటికీ జంతువుల స్థాయిని పూర్తిగా దాటలేకపోయాడని కవి ప్రశ్నిస్తున్నారు.

“రాముడిలా ఎదగగలం, రాక్షసులని మించగలం, రకరకాల ముసుగులు వేస్తూ మరిచాం ఎపుడో సొంత ముఖం”

మనిషిలో దైవత్వం కూడా ఉంది, రాక్షసత్వం కూడా ఉంది. మంచివాడిగా ఎదగగల శక్తి ఉంది, చెడులో మరింత దిగజారే అవకాశం కూడా ఉంది. కానీ సమాజంలో అనేక ముసుగులు వేసుకుంటూ తన అసలు స్వరూపాన్ని మరిచిపోయాడని ఈ పంక్తి చెబుతోంది.

“తారలనే దించగలం తలుచుకుంటే మనం, రవికిరణం చీల్చగలం రంగులుగా మార్చగలం”

మనిషికి అపారమైన శక్తి ఉంది. ఆకాశంలోని నక్షత్రాలను చేరగలడు. సూర్యకాంతిని కూడా విభజించి రంగులను కనుగొనగలడు. అంటే విజ్ఞానం, సంకల్పం ఉంటే అసాధ్యం అనేది ఏదీ లేదని భావం.

55
అవార్డులు లేవు

అసలు నిజంగా మనిషి ఎవరు ? నాగరికత సాధించాడా ? బలవంతుడు బలహీనుణ్ణి జయించడం నాగరికత కాదు, మనిషిలోపల కూడా దైవత్వం ఉంది అని ప్రశ్నిస్తూ లోతైన అర్థాన్ని తెలియజేసే పాట ఇది. జల్సా సినిమాలో పాటలన్ని అద్భుతంగా ఉంటాయి. ఈ పాట, ఇందులోని సాహిత్యం నెక్స్ట్ లెవల్. కానీ దేవిశ్రీ ప్రసాద్ కి కానీ ఈ మూవీ ద్వారా చెప్పుకోదగ్గ అవార్డు ఒక్కటి కూడా రాలేదు.

Read more Photos on
click me!

Recommended Stories