Bigg Boss 10 Wild Card Entry: వైల్డ్ కార్డ్ ద్వారా బిగ్‌ బాస్‌ హౌజ్‌లోకి వచ్చేది వీళ్లే.. ఇప్పుడే అసలు మజా

Published : Oct 07, 2026, 03:57 PM IST

Bigg Boss 10 Wild Card Entry: బిగ్‌ బాస్‌ తెలుగు 10 షోకి వైల్డ్ కార్డ్ ఎంట్రీస్‌ రాబోతున్నాయి. ఈ వారంలోనే వైల్డ్ కార్డ్ ఎంట్రీ ఉంటుంది. మరి ఎవరెవరు రాబోతున్నారనేది చూస్తే, క్రేజీ కంటెస్టెంట్లు రాబోతున్నారట.

PREV
14
బిగ్‌ బాస్‌ హౌజ్‌లోకి వైల్డ్ కార్డ్ ఎంట్రీల హడావుడు షురూ

బిగ్ బాస్ తెలుగు 10 సీజన్ రోజురోజుకూ ఆసక్తికరంగా మారుతోంది. ఇప్పటికే నాలుగు వారాల ఎలిమినేషన్లు పూర్తవగా.. ఐదో వారంలోకి అడుగుపెట్టిన షోలో నామినేషన్లు, గొడవలు, టాస్కులతో హౌస్‌లో సందడి కొనసాగుతోంది. ఈ క్రమంలో ఇప్పుడు అందరి దృష్టి వైల్డ్ కార్డ్ ఎంట్రీలపై పడింది. కొత్త కంటెస్టెంట్ల రాకతో బిగ్ బాస్ హౌస్‌లో గేమ్ పూర్తిగా మారిపోయే అవకాశం ఉందనే చర్చ జరుగుతోంది. తాజాగా అందుతున్న సమాచారం ప్రకారం రామకృష్ణ, నీతూ నటరాజ్ వైల్డ్ కార్డ్ కంటెస్టెంట్లుగా హౌస్‌లోకి ఎంట్రీ ఇవ్వబోతున్నట్టు ప్రచారం జరుగుతోంది. వీరితోపాటు మొదటి వారంలోనే ఎలిమినేట్‌ అయిన `చైత్రరాయ్‌`ని కూడా మళ్లీ హౌజ్‌లోకి తీసుకొచ్చే ప్లాన్‌ జరుగుతుంది.

24
వైల్డ్ కార్డ్ ఎంట్రీ కన్ఫమ్‌ అయిన కంటెస్టెంట్లు వీళ్లే

ఇందులో రామకృష్ణ ఇప్పటికే ‘బిగ్ బాస్ అగ్నిపరీక్ష’ ద్వారా ప్రేక్షకులకు పరిచయమైన వ్యక్తి. అగ్నిపరీక్షలో ఎంపికైన వారిలో రామకృష్ణ పేరు కూడా ఉంది. ఈ కారణంగా బిగ్ బాస్ తెలుగు 10లో ఆయన వైల్డ్ కార్డ్ ఎంట్రీపై మొదటి నుంచే ఆసక్తి నెలకొంది. గతంలో కూడా రామకృష్ణ, మిథిలేష్, అపూర్వ పేర్లు వైల్డ్ కార్డ్ ఎంట్రీ ఇచ్చారు. మూడో వారంలోనే వచ్చాడు. కానీ సెలెక్ట్ కాలేకపోయాడు. ఈ నేపథ్యంలో అతన్ని వైల్డ్ కార్డ్ ద్వారా తీసుకొచ్చే ప్లాన్‌లో బిగ్‌ బాస్ ఉన్నారట. మరోవైపు నీతూ నటరాజ్ పేరు కూడా ఇప్పుడు హాట్ టాపిక్‌గా మారింది. డ్యాన్సర్‌గా గుర్తింపు తెచ్చుకున్న నీతూ గతంలో ‘ఆట’ కార్యక్రమంలో పాల్గొన్నట్టు సమాచారం. కొరియోగ్రాఫర్, మాజీ బిగ్‌బాస్ కంటెస్టెంట్ నటరాజ్ మాస్టర్‌ భార్యనే నీతూ నటరాజ్‌ కావడం విశేషం.

34
వీళ్లు కూడా వచ్చే ఛాన్స్ ఉందా?

వీరితోపాటు చైత్ర రాయ్‌ని తీసుకొచ్చేందుకు ప్లాన్‌ చేస్తున్నారు. ఆమె ఆల్మోస్ట్ కన్ఫమ్‌ అంటున్నారు. అలాగే టీవీ నటుడు శివకుమార్‌ కూడా వస్తున్నాడట. గతంలో బిగ్‌ బాస్‌లోకి వచ్చిన ప్రియాంక జైన్‌ ప్రియుడే శివకుమార్‌. అతను బిగ్‌ బాస్‌ హౌజ్‌లోకి రావడానికి పెద్దగా ఆసక్తి చూపించడం లేదు. కానీ ఆయన కూడా కన్ఫమ్‌ అయినట్టు తెలుస్తోంది. వీరితోపాటు జబర్దస్త్ కామెడీ షో నుంచే కెవ్వు కార్తీక్‌ రాబోతున్నట్టు సమాచారం. అలాగే రాకింగ్‌ రాకేష్‌ పేరు వినిపిస్తుంది. అలాగే మరో టీవీ నటి కావ్యశ్రీ కూడా వైల్డ్ కార్డ్ ఎంట్రీ ఇచ్చే ఛాన్స్ ఉందంటున్నారు. ఆమె `చెఫ్‌` ప్రోగ్రామ్‌ నుంచి బయటకు వచ్చిందని, అది బిగ్‌ బాస్‌ షో కోసమే అని టాక్‌ నడుస్తుంది. ఇందులో నిజమెంతా అనేది తెలియాల్సి ఉంది.

44
బిగ్‌ బాస్‌ హౌజ్‌లో అసలు మజా షురూ ?

డిజిటల్ కంటెంట్ క్రియేటర్ సోనియా సింగ్, టీవీ నటి సౌందర్య రెడ్డి, జబర్దస్త్ కమెడియన్లు నూకరాజు పేర్లు కూడా సోషల్ మీడియాలో చక్కర్లు కొట్టాయి. సీరత్ కపూర్, మౌనీషాలకు వైల్డ్ కార్డ్ అవకాశం ఇచ్చినా వారు తిరస్కరించినట్టు తెలుస్తోంది. ఇక వైల్డ్ కార్డ్ కంటెస్టెంట్ల రాకతో ప్రస్తుతం ఉన్న కంటెస్టెంట్లకు గట్టి పోటీ ఎదురయ్యే అవకాశం ఉంది. కొత్తవారు బయట జరుగుతున్న పరిణామాలపై కొంత అవగాహనతో హౌస్‌లోకి అడుగుపెడితే.. ఇప్పటికే ఉన్న కంటెస్టెంట్ల గేమ్ ప్లాన్లు కూడా మారే అవకాశముంది. బిగ్‌ బాస్‌ హౌజ్‌లో అసలు మజా ఇప్పుడు స్టార్ట్ కాబోతుందని చెప్పొచ్చు. ఈ వైల్డ్ కార్డ్ ఎంట్రీ ఐదో వారంలో ఉంటాయి. దీనికోసం మినీ ఈవెంట్‌ని నిర్వహిస్తారు. వచ్చే ఆదివారం ఈ ఈవెంట్‌ ఉండే అవకాశాలున్నాయి.

AR
About the Author

Aithagoni Raju

అయితగోని రాజు 2020 నుంచి ఏషియానెట్‌ తెలుగులో వర్క్ చేస్తున్నారు. ఆయనకు టీవీ, ప్రింట్‌, డిజిటల్‌ జర్నలిజంలో 13ఏళ్ల అనుభవం ఉంది. ప్రధానంగా న్యూస్‌, సినిమా జర్నలిజం, ఎంటర్‌టైన్‌మెంట్‌ రంగంలో ప్రముఖ సంస్థల్లో వర్క్ చేశారు. ప్రపంచ సినిమాని `షో`(నవతెలంగాణ) పేరుతో రాసిన ప్రత్యేక కథనాలు విశేష గుర్తింపుని తెచ్చిపెట్టాయి. ప్రస్తుతం ఏషియానెట్‌ తెలుగులో ఎంటర్‌టైన్‌ మెంట్ టీమ్‌ని లీడ్‌ చేస్తున్నారు. సబ్‌ ఎడిటర్‌గానే రిపోర్టర్ గా సినిమా ఫీల్డ్ అనుభవం ఉంది. ఎంటర్‌టైన్‌మెంట్‌ విభాగంలో సినిమా, టీవీ, ఓటీటీ కి సంబంధించి ఆసక్తికర కథనాలను, సినీ ఇండస్ట్రీలోని విషయాలను, సినిమా రివ్యూలు, విశ్లేషణాత్మక కథనాలు రాయడంలో మంచి పట్టు ఉంది. క్వాలిటీ కంటెంట్‌ని అందిస్తూ, క్వాలిటీ జర్నలిజాన్ని ముందుకు తీసుకెళ్లడంలో తనవంతు కృషి చేస్తున్నారు.Read More...
Read more Photos on
click me!

Recommended Stories