దసరాకు మొదలైన రజనీ, విజయ్ - రష్మికల సందడి.. దీపావళి వరకు తగ్గేదే లే..

Published : Oct 26, 2026, 07:00 AM IST

బాక్సాఫీస్ దగ్గర 'జైలర్ 2', 'రణబాలి' సినిమాలు దుమ్మురేపుతున్నాయి. ఈ వారం పెద్ద సినిమాలేవీ రిలీజ్ కాకపోవడంతో దసరా సినిమాల హవానే కొనసాగేలా ఉంది. పూర్తి వివరాలు చూద్దాం.

PREV
13
దీపావళి వరకు తగ్గేలా లేదు!

దసరా పండుగకు రిలీజైన సినిమాలకు బాక్సాఫీస్ దగ్గర మరో వారం కూడా కలిసొచ్చేలా ఉందా? రజనీకాంత్ 'జైలర్ 2', విజయ్ దేవరకొండ 'రణబాలి' సినిమాలు భారీ కలెక్షన్లతో దూసుకుపోతున్నాయి. ప్రస్తుతానికి ఈ సినిమాల జోరుకు బ్రేకులు పడేలా కనిపించడం లేదు. ఈ వారం థియేటర్లలో పెద్ద సినిమాలేవీ రిలీజ్ కావడం లేదు. కాబట్టి ఈ వీకెండ్ కూడా దసరా సినిమాలదే హవా అని చెప్పొచ్చు.

దసరా బరిలో దిగిన 'జైలర్ 2', 'రణబాలి' సినిమాలు రెండో వారంలోకి అడుగుపెట్టినా బాక్సాఫీస్ దగ్గర భారీగా వసూళ్లు రాబడుతున్నాయి. 'జైలర్ 2' ఏకంగా రూ.600 కోట్ల కలెక్షన్ల మార్క్‌కు దగ్గరవుతోంది. అటు 'రణబాలి' కూడా రూ.75 కోట్ల మైలురాయిని చేరుకునే దిశగా దూసుకెళ్తోంది. దీన్నిబట్టి రెండో వారంలోనూ ఈ రెండు సినిమాలు తమ సత్తా చాటుతున్నాయని అర్థమవుతోంది.

23
'రణబాలి'కి ప్రేక్షకుల బ్రహ్మరథం!

'రణబాలి' సినిమాకు ఆడియన్స్ నుంచి వస్తున్న అద్భుతమైన రెస్పాన్స్ చూసి చిత్రబృందం ఫుల్ ఖుషీగా ఉంది. ప్రేక్షకులకు కృతజ్ఞతలు చెపుతున్నారు. ఇక ఈ వారం బాక్సాఫీస్ రేసును గమనిస్తే.. దసరా సినిమాలకు గట్టి పోటీ ఇచ్చే పెద్ద సినిమాలేవీ రిలీజ్ కావడం లేదు. దీంతో 'జైలర్ 2', 'రణబాలి' సినిమాలకు మరో వారం పాటు మంచి కలెక్షన్లు రాబట్టుకునే ఛాన్స్ దొరికింది.

33
ఈ వారం థియేటర్లలోకి వచ్చే సినిమాలు ఇవే..

మైత్రీ మూవీ మేకర్స్ నిర్మించిన '418' సినిమా ఈ వారం రిలీజ్ కాబోతోంది. దీనికి తోడు 'కోర్ట్' సినిమాలో నటించిన శ్రీదేవి ప్రధాన పాత్రలో తెరకెక్కిన 'హైకూ' అనే చిన్న బడ్జెట్ సినిమా ఇప్పటికే థియేటర్లలోకి వచ్చింది. ఈ రెండు సినిమాలు మినహాయిస్తే, బాక్సాఫీస్ దగ్గర పెద్ద స్థాయిలో పోటీ ఇచ్చే వేరే సినిమాలేవీ ప్రస్తుతానికి కనిపించడం లేదు.

కాబట్టి దసరా సినిమాలకు థియేటర్ల సంఖ్య పెద్దగా తగ్గే అవకాశం లేదని తెలుస్తోంది. కొత్త సినిమాల నుంచి గట్టి పోటీ లేకపోవడంతో ఈ వీకెండ్ కూడా బాక్సాఫీస్ దగ్గర 'జైలర్ 2', 'రణబాలి' సినిమాల సందడే కొనసాగేలా ఉంది. దసరాకు మొదలైన ఈ కలెక్షన్ల సునామీ దీపావళి వరకు ఇలాగే కొనసాగుతుందా లేదా అనేది వేచి చూడాలి!

Read more Photos on
click me!

Recommended Stories