బాధ లేకుండా ఎలా ఉంటుంది సార్ మీ కన్నా ఎక్కువే బాధపడుతూ ఉంటుంటారు అని వసు అనగా, మరి అంత బాధ ఉన్నప్పుడు నన్ను వదిలి వెళ్ళడం ఎందుకు అయినా జగతి మేడం కూడా తెలివైన వారే కదా చెప్పాలి కదా ఒక మాట అయినా అని అంటాడు రిషి. దానికి వసు, చెప్పలేదని మనం ఎలా అనుకుంటాం సార్. మీ అందరిలోని ఒక లక్షణాలే ఉన్నాయి అందర్నీ బాగా ప్రేమిస్తారు, అభిమానిస్తారు కానీ మొండి వాళ్ళు అంటుంది వసు. అప్పుడు వసు మనసులో, నేను దీనికి ఒక పరిష్కారం ఆలోచిస్తాను మిమ్మల్ని కలుపుతాను అని అనుకుంటుంది.