Karthika Deepam: దీపను చంపాలని ప్లాన్ వేసి అడ్డంగా దుర్గ కి దొరికిపోయిన వాణి.. మోనితకు వార్నింగ్ ఇచ్చిన దుర్గ!

Published : Oct 29, 2022, 07:50 AM IST

Karthika deepam:బుల్లితెరపై ప్రసారమవుతున్న కార్తీకదీపం సీరియల్,కుటుంబ కథా నేపథ్యంతో కొనసాగుతూ ప్రేక్షకుల్ని బాగా ఆకట్టుకుంటుంది. ఇక ఈరోజు అక్టోబర్ 29వ తేదీన ఏం జరుగుతుందో తెలుసుకుందాం.  

PREV
18
Karthika Deepam: దీపను చంపాలని ప్లాన్ వేసి అడ్డంగా దుర్గ కి దొరికిపోయిన వాణి.. మోనితకు వార్నింగ్ ఇచ్చిన దుర్గ!

ఈరోజు ఎపిసోడ్ ప్రారంభంలోనే.. వాణి జరిగిన విషయం అంత మోనితకు చెప్తుంది. అప్పుడు మోనిత, ఎట్టి పరిస్థితుల్లోని వాళ్ళు పావని కలవకూడదు వాణి వాళ్ళ పాపని కలిస్తే నా జీవితం నాశనం అయిపోతుంది వాళ్ళ జీవితానికి ఇంకే అడ్డు ఉండదు అని అంటుంది. దానికి వాణి, అయితే నిజంగానే ఆ పాప వాళ్ళిద్దరి పాప! కార్తీక్ దీప భర్తా! అని ఆశ్చర్యపోతుంది. అప్పుడు మోనిత జరిగిన విషయం అంతా వాణి కి చెప్తూ, నేను అమర ప్రేమికురాన్ని వాణి. కార్తీక్ కోసం ఎన్నో చేశాను కార్తీక్ మీద ప్రేమతోనే బిడ్డను కూడా కన్నాను ఎన్ని నేరాలు అన్ని గోరాలు చేసింది కేవలం కార్తీక్ కోసమే. తీరా ఇన్ని రిస్కులు తీసుకున్న తర్వాత కార్తీక్ ని తీసుకొచ్చేసి ఇక్కడ హాయిగా ఉంటే మళ్ళీ ఆ దీప వచ్చి అంతా పెంట చేస్తుంది. దాంతో పాటు దుర్గ కూడా వచ్చి నాకు నరకం చూపిస్తున్నారు అని అనగా, మీరేం భయపడొద్దు మేడం ఈ వాళ్తేరు వాణి ఉండగా మీకు ఎవరు హాని చేయలేరు ఈరోజు రాత్రి కల్లా నేను వాళ్ళ పని ముగించేస్తాను. 

28

రేపు సూర్యోదయం చూడకముందే వాళ్ళు దేవుడి దగ్గరికి వెళ్ళిపోతారు అని అంటుంది వాణి. దానికి మోనిత, నిజంగా అలా చేస్తే రెండు లక్షలు ఇస్తా అన్నాను కదా కాదు పది లక్షలు ఇస్తాను అని చెప్పి వెళ్ళిపోతుంది మోనిత. ఆ తర్వాత సీన్లో దీప పిండి వంటలు అన్ని చేస్తూ ఉండగా కార్తీక్ వచ్చి దీప ఆరాటం తట్టుకోలేకపోతున్నాను. శౌర్య నీ చూస్తున్నాను అని అనగానే మొఖం వెలిగిపోతుంది అని అనుకుంటాడు. ఇదంతా శౌర్య కోసమేనా అని అడగగా అవును డాక్టర్ బాబు శౌర్య. ని చూసి చాలా రోజులైంది నన్ను చూడగానే శౌర్య ఎలాగా ఉంటుందో మనం దూరమయ్యాము అనుకున్న వ్యక్తి మళ్లీ మన దగ్గరికి వస్తే ఎంత ఆనందంగా ఉంటుందో కదా అని అనగా అవును మన శౌర్య అని కార్తీక్ అనగా దీప కార్తిక్ వైపు చూస్తుంది. 

38

అదే నువ్వు నీ శౌర్య ని చూడ్డానికి ఎంత అరాటపడుతున్నావో నాకు అర్థం అవుతుంది నాకు కూడా పాప ఎలా ఉంటుందో చూడాలని ఉన్నది అని కార్తీక్ కప్పిపుచ్చుకుంటాడు. ఇంతలో వాణి అక్కడికి వస్తుంది పాప కోసం మాట్లాడుకుంటున్నారా అని అడుగుతుంది. అవును అని వాళ్ళు అంటారు. ఇంతలో దీప, ఎప్పుడు బయలుదేరుదాం డాక్టర్ బాబు రేపు అని అనగా, సూర్యోదయం అవ్వగానే వెళ్ళిపోదాము అని కార్తీక్ అంటాడు. ముందు బతికి ఉండాలి కదా అని అనుకుంటుంది వాణి. ఆ తర్వాత సీన్లో మోనిత రాత్రి తన గదిలో కూర్చుని ఆలోచిస్తూ కార్తీక్ ప్రవర్తన చూస్తే కొన్ని కొన్ని సార్లు గతం గుర్తొచ్చేటట్టు మాట్లాడుతున్నాడు ఈమధ్య పూర్తి అనుమానాలు పెరిగిపోయాయి. అనుమానాలు తొలగించేసరికే సమయం అయిపోతుంది. 

48

 ఒకప్పుడు ఏం చెప్పినా నమ్మేవాడు ఇప్పుడు ప్రతి దానికి అనుమానిస్తున్నాడు.  ఒకవేళ నిజంగా గతం గుర్తొస్తే నన్ను అసలు పట్టించుకుంటాడా నిజంగా గతం గుర్తొచ్చేసి ఉంటాదా? ఒకవేళ గుర్తొస్తే నన్ను ఇలా పక్కన పెట్టకూడదు కదా? ముందు ఆ దుర్గ, దీపాలు పోతే మనశాంతిగా ఉంటుంది.ఈరోజు రాత్రికి వాళ్ళ గోల వదిలిపోతుంది అంటుంది మోనిత. ఆరోజు రాత్రి దీపని పడుకున్నప్పుడు వాణి దీప ఇంటి మీద ని పెట్రోల్ పోసి తగలబెడదాము అని అగ్గిపుల్ల విసురుతుంది. కానీ అగ్గిపుల్ల ఆగిపోతుంది.పెట్రోల్ అనుకుంటున్నావేమో అవి నీళ్లు అని దుర్గా అంటాడు. దుర్గ ను చూసిన వాణి ఆశ్చర్య పోతుంది. ఎంతగా తెగించారే పోలీసులను చూసి దాక్కునప్పుడు నాకు నీ మీద అనుమానం వచ్చింది నువ్వు నాకన్నా పెద్ద ముదురు అని నాకు అర్థమైంది. నువ్వు, మోనిత ఒక పార్టీయే కదా మీరు కుర్చీలు పెట్టి కొట్టుకున్నప్పుడే మీ ఓవరాక్షన్ చూసి నేను తెలుసుకున్నాను.

58

 మోనితే కదా దీపమ్మని చంపడానికి పంపించింది అని అనగా వాణి కోపంతో అవును నిన్ను కూడా వేసేమని చెప్పింది అని అంటుంది. అప్పుడు దుర్గా వాణి చున్నిని గట్టిగా పట్టుకుంటూ మా దీపమ్మ ని చంపాలని చూస్తావా అని అంటాడు. వదలమని వవాణి అంటుంది. ఆ తర్వాత రోజు ఉదయం మోనిత లేచేసరికి హమ్మయ్య దీప దుర్గాలు ఉండి ఉండరు హాయిగా నేను కార్తిక్ బతకవచ్చు అనుకొని దీప ఇంటి దగ్గరికి వెళ్లి చూస్తే సరికి దీప హాయిగా ఇంటి బయట కల్లాపు వేసుకుంటుంది. ఇంతలో వాణికి ఫోన్ చేద్దామని కోపంగా ఫోన్ చేస్తుండగా దుర్గా ఫోన్ లాక్కొని ఏం బంగారం వాల్తేర్ వాణి కి ఫోన్ చేస్తున్నావా పాప.
 

68

 నిన్న నాకు రెడ్ హ్యాండెడ్గా దొరికిపోయింది కదా కావేరికు పార్సెల్ చేసేసాను అని అనగా తను ఎలా ఉంటే నాకెందుకు అని మోనిత నటిస్తుంది. దానికి దుర్గ, మీరిద్దరూ ఒక టీమే అని నాకు తెలుసు రెడ్ హ్యాండెడ్ గా పట్టుకున్న తర్వాత నిజం అంతా కక్కేసింది. ఈ విషయం గాని కార్తీక్ సార్ కి తెలిస్తే అని అంగే లోగ ఏ విషయం గురించి మాట్లాడుకుంటున్నారు మీరు నా గురించి కూడా మాట్లాడుకుంటారా? మీ మధ్యలో నేనొకడు ఉన్నారని కూడా మీకు తెలుసా ఎప్పుడు నన్ను బకరా చేద్దామని మాట్లాడుకుంటుంటారా అని అనగా మోనిత కోపంగా చూసి వెళ్ళిపోతాడు. 
 

78

ఎందుకురా ఇలా ఆడుకుంటున్నావు నాతోని అని మోనిత అనగా, నేను ఆడుకోవడం లేదు బంగారం. కార్తీక్ సార్  నీ మీద చూపిస్తున్న అనుమానం ఉన్నది చూడు గుచ్చి గుచ్చి ప్రశ్నలు వేస్తున్నారు ఇది ఆనందం అంటే అయినా నీకు తెలుసు కదా దీపమ్మ జోలికి వేస్తే బొమ్మ ఇలాగే ఉంటుంది.ఇదిగో ఫోన్ తీసుకో జాగ్రత్త అని వెళ్లిపోతాడు దుర్గ. ఆ తర్వాత సీన్లో దీప ముఖం వెలిగిపోతూ ఉంటుంది.వెంటి మీరు డాక్టర్ బాబు ఇంకా బయలుదేరలేదు అని అనగా పిండి వంటలు అన్ని రెడీ చేసావు కదా నేను బయలుదేరడం ఎంతసేపు రెండు నిమిషాల్లో మార్చుకొని వస్తాను
 

88

 ఇంతకీ మీ వాణి ఏది కనిపించడం లేదు అని అంటాడు కార్తీక్. ఏమో డాక్టర్ బాబు ఉదయం నుంచి కనిపించడం లేదు ఫోన్ కూడా ఎత్తట్లేదు అని దీప అంటుంది. అయితే పని ఉండి వెళ్ళిందేమో అని కార్తీక్ అంటాడు. ఇంతటితో ఎపిసోడ్ ముగుస్తుంది. తరువాయి భాగంలో ఏం జరిగిందో తెలియాలంటే రేపటి వరకు ఎదురు చూడాల్సిందే!
 

click me!

Recommended Stories