ఈరోజు ఎపిసోడ్ ప్రారంభంలోనే...రిషి,వసు దగ్గరకి వచ్చి,వసు భుజం మీద తన తల పెట్టి,ఈ రోజు నేను కాఫీ కి దూరం గా ఉంటాను,మళ్ళీ నువ్వు కాఫీ వొంపితే డ్రెస్ మార్చే ఓపిక నాకు లేదు నీ అంటాడు.అప్పుడు వసు, సారీ సార్ అని అంటుంది.ఒక వేళ నీకు ఆ డ్రెస్ నచ్చకపోతే బాలేదు సార్ అని చెప్పు. అంతేగాని పొద్దు పొద్దున్నే వేడివేడి కాఫీతో నాకు స్నానం చేయించడం అవసరమా, నువ్వు ఏ విషయం గురించీ మనసులో సంకోచిచకుండా నాకు చెప్పు. మన ఇద్దరి మధ్య ఏ దాపరికాలు రాకూడదు.