Mishan Impossible Review: మిషన్‌ ఇంపాజిబుల్‌ ప్రీమియర్స్ రివ్యూ

First Published | Apr 1, 2022, 7:29 AM IST

చాలా కాలం తర్వాత తాప్సీ నటించిన తెలుగు సినిమా `మిషన్‌ ఇంపాజిబుల్‌`. `ఏజెంట్‌ సాయి శ్రీనివాస్‌ ఆత్రేయ` ఫేమ్‌ స్వరూప్‌ దర్శకత్వంలో రూపొందిన చిత్రమిది. `ఘాజీ`, `ఆచార్య` వంటి సినిమాలను నిర్మించిన మ్యాట్నీ ఎంటర్‌టైన్‌మెంట్స్ పతాకంపై నిరంజన్‌రెడ్డి నిర్మించారు. ఈ సినిమా ఏప్రిల్‌ 1న విడుదలవుతుంది. 

mishan impossible telugu movie premiers review did taapsee entertain with three boys

`ఝుమ్మంది నాదం` చిత్రంతో హీరోయిన్‌గా తెలుగు తెరకు పరిచయమైంది తాప్సీ. గ్లామర్‌ పాత్రలతో టాలీవుడ్‌ని ఓ ఊపు ఊపేసింది. దాదాపు అందరు యంగ్ స్టర్స్ తో కలిసి నటించింది. కేవలం కమర్షియల్‌ సినిమాలకే పరిమితమైన ఈ బ్యూటీ క్రమంగా తెలుగు సినిమాలు తగ్గించి బాలీవుడ్‌పై దృష్టి పెట్టింది. `పింక్‌` సక్సెస్‌తో అక్కడ పాగా వేసింది. ఇప్పుడు బాలీవుడ్‌లో లేడీ ఓరియెంటెడ్‌ చిత్రాలకు కేరాఫ్‌గా నిలుస్తుంది. చాలా కాలం తర్వాత ఆమె నటించిన తెలుగు సినిమా `మిషన్‌ ఇంపాజిబుల్‌`. `ఏజెంట్‌ సాయి శ్రీనివాస్‌ ఆత్రేయ` ఫేమ్‌ స్వరూప్‌ దర్శకత్వంలో రూపొందిన చిత్రమిది. `ఘాజీ`, `ఆచార్య` వంటి సినిమాలను నిర్మించిన మ్యాట్నీ ఎంటర్‌టైన్‌మెంట్స్ పతాకంపై నిరంజన్‌రెడ్డి నిర్మించారు. ఈ సినిమా ఏప్రిల్‌ 1న విడుదలవుతుంది. 
 

ఇటీవల జరిగిన `మిషన్‌ ఇంపాజిబుల్‌` చిత్ర ప్రీ రిలీజ్‌ ఈవెంట్‌కి చిరంజీవి గెస్ట్ గా వచ్చి సినిమాపై అంచనాలు పెంచారు. సినిమా చూశానని ఫాబులస్‌గా ఉందని చెప్పారు. ఫస్టాఫ్‌ సరదాగా సాగుతుందని, సెకండాఫ్‌ మాత్రం అద్భుతంగా ఉందని వెల్లడించారు. సినిమాకి ఆయన ఫస్ట్ రివ్యూ ఇచ్చేశారు. దీంతో సినిమాపై అందరిలోనూ అంచనాలు పెరిగాయి. నిజానికి ఈ సినిమా గురించి అంతకు ముందు జనరల్‌ ఆడియెన్స్ కి పెద్దగా తెలియదు. పూర్‌ ప్రమోషన్‌ కారణంగా ఇదొక సినిమా వస్తుందనే విషయమే ఐడియా లేదు. చిరంజీవి ఈవెంట్‌లో సందడి చేయడం, సినిమా గురించి చెప్పడం, మరోవైపు తాప్సీపై ప్రశంసలు కురిపించడంతో ఆసక్తి పెరిగింది. 


పైగా చిత్ర దర్శకుడు స్వరూప్‌ గతంలో రూపొందించిన `ఏజెంట్‌ సాయి శ్రీనివాస్‌ ఆత్రేయ` మంచి హిట్‌అయ్యింది. నవీన్‌ పొలిశెట్టి హీరోగా నటించిన ఆ సినిమా కామెడీ ఎంటర్‌టైనర్‌గా సూపర్‌ హిట్‌ సాధించింది. ఆ సినిమాతోనే నవీన్‌ పొలిశెట్టికి తెలుగులో మంచి గుర్తింపు లభించింది. మరోవైపు ఇప్పుడు `మిషన్‌ ఇంపాజిబుల్‌` చిత్రానికి ఆయన వాయిస్‌ ఓవర్‌ ఇచ్చారు. దీంతో సినిమాకి మరింత క్రేజీ నెస్‌ పెరిగింది. కచ్చితంగా సినిమా బాగుంటుందనే టాక్‌ స్టార్ట్ అయ్యింది. పైగా సినిమా నిడివి రెండు గంటలకే కావడం విశేషం. గురువారం(మార్చి 31) రాత్రి నుంచే యూఎస్‌లో  ప్రీమియర్స్ పడ్డాయి. మరి అక్కడ టాక్‌ ఎలా ఉందో `యూఎస్‌ ప్రీమియర్స్ రివ్యూ`లో తెలుసుకుందాం. 
 

`మిషన్‌ ఇంపాజిబుల్‌` కథ గురించి చూస్తే.. ఇది ముగ్గురు చిన్న పిల్లలు చుట్టూ తిరిగే కథ. అల్లరి చిల్లరగా ఉండే ఈ ముగ్గురు కుర్రాళ్ల జీవితంలోకి తాప్సీ ఎలా వచ్చింది. ఓ సమస్యలో ఇరుక్కున్న వారికి తాప్సీ ఎలా సహాయపడింది. మొత్తంగా వీరిచ్చిన సందేశం ఏంటనేది సినిమా కథ. తాప్సీ ఇందులో ఎక్స్ టెండెడ్‌ కొమియో తరహా పాత్ర. ఇక సినిమా  ఫస్టాఫ్‌ మొత్తం సరదాగా సాగుతుంది. సెకండాఫ్‌లో అసలైన కాన్ల్ఫిక్ట్ ఎదురవుతుంది. దాన్ని ఎలా ఎదుర్కొన్నారనే ఆసక్తికరంగా ఉంటుందని ప్రీమియర్స్ రివ్యూ ద్వారా తెలుస్తుంది. 

సినిమా `ఏజెంట్‌ సాయి శ్రీనివాస్‌ ఆత్రేయ` కంటే మూడు రెట్లు బాగుంటుందని `కలర్‌ఫోటో` డైరెక్టర్‌ సందీప్‌ రాజ్‌ ట్వీట్‌ చేశారు. అయితే సినిమా నిజానికి అంతగా లేదనే టాక్‌ వినిపిస్తుంది. ట్రైలర్‌ చూసిన అంశాలు క్రేజీగా ఉన్నాయని, సినిమాలో కంటెంట్‌ ఏం లేదంటున్నారు. మేజర్‌గా ఒక నలభై నిమిషాల పాటు సినిమా చాలా ఫన్నీగా, ఎంటర్‌టైనింగ్‌గా ఉంటుందని మిగిలిన అంశాలన్నీ బోరింగ్‌గా, చాలా నాసిరకంగా ఉంటాయనే అభిప్రాయం వ్యక్తమవుతుంది. 

క్రైమ్‌ఇన్వెస్టిగేషన్‌ ఎలిమెంట్స్ చాలా దారుణంగా ఉన్నాయని తెలుస్తుంది. ముగ్గురు కుర్రాళ్లు చాలా బాగా నటించారు. తమ ప్రతిభని చాటుకున్నారట. కానీ నటి తాప్సీ వృథా ప్రయత్నమని, ఆమె సినిమాకి హెల్ప్ కాలేకపోయిందంటున్నారు. ఓ రకంగా ఇదొక చెత్త సినిమాగా యూఎస్‌ ఆడియెన్స్ తీర్పు చెప్పేస్తున్నారు. కేవలం రెండు గంటల నిడివి ఒక్కటే ప్లస్‌ అంటున్నారు. దీంతో దర్శకుడు స్వరూప్‌ ద్వితీయ గండాన్ని గట్టేక్కలేకపోయాడనే టాక్‌ వినిపిస్తుంది. 

Latest Videos

click me!