ఏదో ఒక రకంగా రోజూ వార్తల్లో నిలుస్తోంది గుప్పెడంత మనసు సీరియల్ ఫేమ్ జగతీ మేడమ్.. అలీయాస్ జ్యోతీరాయ్. గుప్పెడంత మనసు సీరియల్ తో తెలుగు ప్రేక్షకుల మనసు దొచుకున్న ఈ బ్యూటీ.. సీరియల్ లోచాలా పద్దతిగా మిడిల్ ఏజ్ వ్యక్తిగా.. హీరో రిషి తల్లిగా నటించి మెప్పించారు. కాని ఆమె హాట్ హాట్ అందాల ఆరబోతను సోషల్ మీడియాలో చూసిన జనం.. ఈమె నిజంగా మన జగతీమేడమేనా అని గిల్లుకుని చూసుకున్నారు.
ఇక సినిమాల కోసం.. మరింతగా రెచ్చిపోయి అందాల ప్రదర్శనలు చేసింది జ్యోతీరాయ్. ఇన్ స్టాలో ఆమె పుట్టించే సెగలకు .. కుర్రాళ్లు తట్టుకోలేకపోయారు. కన్నడ సినీ పరిశ్రమకు చెందిన జ్యోతీరాయ్.. ప్రస్తుతం సినిమాల్లో బిజీ అవుతోంది. అందుకే గుప్పెడంత మనసు సీరియల్ ను కూడా వదిలేసుకోవల్సి వచ్చింది. ఇక జగతి పాత్రలో ఇంకెవరినీ చూడలేరు ఆడియన్స్ అందుకే ఆమె పాత్రను చంపేశారు దర్శకుడు.
Jyothi rai
జ్యోతీరాయ్ కు ఇంతకు ముందే పెళ్ళి జరిగింది. కాని అతనితో తెగదెంపులు చేసుకుని.. ఓకుర్ర దర్శకుడితో సహజీవనం చేస్తోంది. మరి అతన్ని పెళ్ళి కూడా చేసుకుందని అంటున్నారు. ఏ మాస్టర్ పీస్ సినిమాను తెరకెక్కించిన దర్శకుడు సురేష్ కుమార్ అలియాస్ సుకు పూర్వాజ్ తో జ్యోతి రాయ్ పెళ్లి జరిగింది అంటున్నారు.
ఇక జగతిమేడం అలియాస్ జ్యోతీరాయ్ పెట్టే హాట్ హాట్ పోస్ట్ లు సోషల్ మీడియాలో హాట్ కెక్ లనే చెప్పాలి. తాజాగా తన ప్రియుడికి బర్త్ డే విష్ చెపుతూ ఆమె చేసిన హాట్ కామెంట్స్ వైరల్ అవుతున్నాయి. హగ్గులు, కిస్సులు అంటూ.. తన ప్రియుడు అందించే ఆనందాన్ని వెల్లడిస్తూ పోస్ట్ పెట్టింది జ్యోతీరాయ్. ఇంతకీ ఆమె ఏమంటుందంటే..?
మనం కలిసి ఏడాది దాటింది. నీ వల్ల నా జీవితం మొత్తం మారిపోయింది. నాకు ఇప్పుడు ఎంత ఆనందంగా ఉందనేది మాటల్లో చెప్పలేకపోతున్నాను. నువ్వు చూపిస్తున్న ప్రేమ, లవ్, ఇచ్చే హగ్స్, కిస్సులు, సపోర్ట్, ఎంకరేజ్మెంట్, నీ పాజిటివ్ థాట్స్ ఇలా అన్నింటికీ థాంక్స్.. అంటూ జ్యోతీరాయ్ చెప్పకొచ్చారు.
అంతే కాదు నీ సహనం.. నాపై చూపించే ప్రేమ, కేరింగ్, విధేయత ఇలా అన్నింటికీ థాంక్స్..నీ వల్లే నా జీవితం సంపూర్ణమైంది.. నువ్వు నా భర్తగా దొరకడం నా అదృష్టం.. హ్యాపీ బర్త్ డే డార్లింగ్.. లవ్ యూ అన్ కండీషనల్లీ” అంటూ అందులో రాసుకొచ్చింది. ప్రస్తుతం జ్యోతి రాయ్ పోస్ట్ వైరల్ గా మారింది.
ఇక జ్యోతీరాయ్ ప్రస్తుతం వరుస సినిమాలతో బిజీ అయిపోయింది. కన్నడాలో వరుస ప్రాజెక్ట్ లు చేస్తోంది బ్యూటీ. సినిమాలతో పాటు వెబ్ సిరీస్ లకు కూడా ఆమె సైన్ చేసినట్టుసమాచారం. అంతే కాదు తెలుగులో కూడా జ్యోతీరాయ్ తనకున్న ఇమేజ్ ను వాడుకుని సినిమా అవకాశాలు తెచ్చుకోవాలి అని చూస్తుందట. మరి ఈ బ్యూటీ ప్రయత్నం ఎంత వరకూ ఫలిస్తుందో చూడాలి.