Rithu Chowdary
ఒకప్పటి సీరియల్ నటి రీతూ చౌదరి జబర్దస్త్ వేదికగా పాపులారిటీ తెచ్చుకుంది. హైపర్ ఆది టీమ్ లో ఆమె పదుల సంఖ్యలో స్కిట్స్ చేసింది. సడన్ గా జబర్దస్త్ కి దూరమైంది. అయితే సోషల్ మీడియాలో జనాలకు అందుబాటులో ఉంటుంది.
Rithu Chowdary
రీతూ చౌదరి పొట్టి బట్టల్లో దారుణమైన స్కిన్ షో చేస్తుంది. బోల్డ్ ఇమేజ్ కలిగిన అమ్మడు గ్లామరస్ ఫోటోల మీద జనాలు తీవ్రమైన విమర్శలు చేస్తారు. పాపం బట్టలు కొనుక్కోవడానికి డబ్బులు లేవనుకుంటా? అని కామెంట్స్ చేస్తుంటారు. కొందరేమో నీలాంటి అమ్మాయిల వలనే సమాజం చెడిపోతుంది అసహనం వ్యక్తం చేస్తారు.
Rithu Chowdary
ఎవరేమన్నా రీతూ చౌదరి పట్టించుకోదు. తన పని తాను చేసుకుపోతుంది. ఈ క్రేజీ బ్యూటీ ఓ టాక్ షోకి హోస్ట్ గా మారింది. అది యూట్యూబ్ లో ప్రసారం అవుతుంది. డిజిటల్ మీడియా కావడంతో ఎలాంటి పరిమితులు లేవు. దీంతో బూతులు, బూతు ప్రశ్నలు కామనై పోయాయి. బీప్ కూడా వేయడం లేదు.
Rithu Chowdary
గెస్ట్ గా వచ్చిన సోహైల్ మాట్లాడిన బూతులను ఎలాంటి బీప్, కట్ లేకుండా ప్రసారం చేశారు. రీతూ చౌదరి హోస్ట్ చేస్తున్న టాక్ షో పేరు దావత్ కాగా... హీరో నవదీప్ గెస్ట్ గా వచ్చాడు. వీరిద్దరి మధ్య కొన్ని సంభాషణలు పచ్చిగా సాగాయి.
నీకు నేను ప్రారంబోకు ఫ్యాన్ అని నవదీప్ తో రీతూ చౌదరి అన్నది. అదేంటి అనగా... నువ్వు హీరోగా చేసిన పోరంబోకు సినిమాను థియేటర్ లో చూసిన పోరంబోకు ఫ్యాన్ ని అని చెప్పింది. ఇప్పుడు ఆ సినిమా గురించి అవసరమా అని నవదీప్ అన్నాడు.
Rithu Chowdary
తర్వాత నవదీప్ ని అడగకూడని ప్రశ్న అడిగింది. నీకు సింగిల్ గా ఇష్టమా? గ్రూప్ గా ఇష్టమా? అని అడిగింది. దేని గురించి అడుగుతున్నావ్? అని నవదీప్ క్లారిటీ అడిగాడు. నీ మైండ్ లో ఏది రన్ అవుతుందో దాని గురించే అని రీతూ బోల్డ్ రిప్లై ఇచ్చింది. నాకు సింగిల్ గానే ఇష్టం అని నవదీప్ అన్నాడు...
Rithu Chowdary
ఇలా డబుల్ మీనింగ్స్, పచ్చిబూతులతో నవదీప్ ఇంటర్వ్యూ సాగింది. చూస్తుంటే రీతూ చౌదరి మరో రామ్ గోపాల్ వర్మ అయ్యేలా ఉందన్న టాక్ వినిపిస్తోంది. దావత్ వేదికగా రీతూ చౌదరి ఎన్ని సంచనాలు చేయనుందో చూడాలి..